అన్వేషించండి

Telangana Municipal Elections Results 2026: కరిగిపోతున్న బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ - కేటీఆర్ సంతృప్తి వెనుక అసలు నిజమెంత?

BRS: ఓటు బ్యాంక్ తగ్గలేదని బీఆర్ఎస్ గాంభీర్యం చూపిస్తోంది. కానీ ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతోందన్నది మాత్రం ఎన్నికలు నిరూపిస్తున్న సత్యం అని విశ్లేషణలు చూపిస్తున్నాయి.

BRS declining vote bank:   తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.   పార్టీ ఓటు బ్యాంక్ చెక్కుచెదరలేదని  ఆయన అంటున్నారు. అయితే కేటీఆర్ వ్యక్తం చేస్తున్న సంతృప్తిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయి ఫలితాలు మాత్రం బీఆర్ఎస్ పునాదులు నెమ్మదిగా కదులుతున్నాయని స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు.   గతంలో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతిన్నప్పటి గణాంకాలతో నేడు తమ పార్టీని పోల్చుకుని కేటీఆర్ సంతోషపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

ఏడు కార్పొరేషన్లలో అంతంతమాత్రం ఉనికి 

ఈ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. రాష్ట్రంలోని ఏడు ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలో బీఆర్ఎస్ పార్టీ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోవడం.    ఏడు కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగితే ఒక్క చోట కూడా గట్టిపోటీ ఇవ్వలేకపోయారు.   నల్గొండ, నిజామాబాద్, రామగుండం, మహబూబ్‌నగర్, మంచీర్యాల, కొత్తగూడెం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో బీఆర్ఎస్ ప్రభావం పూర్తిగా కనుమరుగైంది.  ఈ ప్రాంతాల్లో బలమైన పట్టున్న నేతలు ఉన్నప్పటికీ బలం నిలుపుకోలేకపోాయరు.   ఒకప్పుడు కంచుకోటలయిన నిజామాబాద్, కరీంనగర్ లలో బీజేపీ దూకుడు చూపించింది. కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది.
 
పరిమితమైన ప్రాంతాల్లోనే కనిపిస్తున్న బీఆర్ఎస్ బలం

హైదరాబాద్ శివార్లలో, ఉమ్మడి మెదక్ జిల్లా వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పార్టీ తన ఉనికిని చాటుకుంది.  ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కావడం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. గతంలో బీఆర్ఎస్ పట్టున్న దక్షిణ తెలంగాణ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ మయమైంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేకుండా పోతోంది.  బీఆర్ఎస్ కేవలం కొన్ని వార్డులకే పరిమితం కాగా, పీఠాలను దక్కించుకునే సత్తాను కోల్పోయింది. కేటీఆర్ తన ప్రసంగాల్లో పార్టీ కరిగిపోవడం లేదని క్యాడర్‌కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఓట్ల శాతం, వార్డుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 

బీఆర్ఎస్‌కు హెచ్చరికల్లాంటివే!
 
మున్సిపల్ ఫలితాలను వార్డుల వారీగా విశ్లేషిస్తే, బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ క్రమంగా ఇతర పార్టీల వైపు మళ్లుతోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా పట్టణ ఓటర్లు గతంలోలా కాకుండా ఈసారి మార్పు కోరుకున్నట్లు కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలైన ఈ  క్షీణత మున్సిపల్ ఎన్నికల వరకు కొనసాగుతుండటం పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.  ప్రస్తుత ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఒక హెచ్చరిక లాంటివి. కేవలం కొన్ని జిల్లాలకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు నొక్కి చెబుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా, పట్టణాల్లో కూడా పోగొట్టుకున్న పట్టును తిరిగి సాధించాలంటే కేవలం ప్రకటనలతో సరిపెట్టకుండా, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాల్సి ఉంటుంది.
 
ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని కేటీఆర్, తమ పార్టీని కాంగ్రెస్ గత వైఫల్యాలతో పోలుస్తూ ఆత్మరక్షణలో పడ్డారు. కానీ, రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే పాత రికార్డులు కాకుండా వర్తమాన ఫలితాలే ప్రామాణికం. బీఆర్ఎస్ తన వ్యూహాలను మార్చుకోకపోతే, రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాల్లో కూడా తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని ఈ మున్సిపల్ తీర్పు హెచ్చరిస్తోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  

 

టాప్ హెడ్ లైన్స్

Importance Of Voter List Verification: ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
KTR Vs Revanth Reddy Debate 2026: డేట్, టైం, ప్లేస్ పాలిటిక్స్ - కేటీఆర్ వర్సెస్ రేవంత్ సర్కార్.. ఈ సవాళ్లు నిజంగానే చర్చ వరకు వెళ్తాయా?
డేట్, టైం, ప్లేస్ పాలిటిక్స్ - కేటీఆర్ వర్సెస్ రేవంత్ సర్కార్.. ఈ సవాళ్లు నిజంగానే చర్చ వరకు వెళ్తాయా?
Telangana Sentiment Politics: రాజకీయాలకు దొరికిన ఇడుపు కాయితం - తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నాలు ఫలిస్తాయా?
రాజకీయాలకు దొరికిన ఇడుపు కాయితం - తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నాలు ఫలిస్తాయా?
YS Jagan Mavigan Capital Plan Analysis: పొలిటికల్ ఎజెండా షిఫ్ట్ - మూడు రాజధానుల నుండి మావిగన్ కారిడార్‌కు జగన్ షిఫ్ట్.. ప్రజలు నమ్ముతారా?
పొలిటికల్ ఎజెండా షిఫ్ట్ - మూడు రాజధానుల నుండి మావిగన్ కారిడార్‌కు జగన్ షిఫ్ట్.. ప్రజలు నమ్ముతారా?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Drugs Smuggling via Speed Post: వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
Yashasvi Jaiswal In FIFA World Cup : ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
ఫిఫా ప్రపంచకప్ లో ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
Stay Positive : రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
Superfoods for Healthy Hair : జుట్టు మంచిగా పెరగాలంటే డైట్లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి.. రోజూ తింటే హెయిర్​ ప్రాబ్లమ్స్ దూరమవుతాయట
జుట్టు మంచిగా పెరగాలంటే డైట్లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి.. రోజూ తింటే హెయిర్​ ప్రాబ్లమ్స్ దూరమవుతాయట
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. టీచర్లకూ మధ్యాహ్న భోజనం - మూసీ ప్రాజెక్ట్, ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. టీచర్లకూ మధ్యాహ్న భోజనం - మూసీ ప్రాజెక్ట్, ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
India Selection Policy Dispute: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి 'హైరార్కీ' బ్రేకులు.. గంభీర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ పై కస్సుమన్న వెటరన్లు, బెంచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం!
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి 'హైరార్కీ' బ్రేకులు.. గంభీర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ పై కస్సుమన్న వెటరన్లు, బెంచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం!
Cheating Partner : మీ భాగస్వామి(Partner) ప్రవర్తనలో ఈ 7 మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. చీటింగ్ కావచ్చు
మీ భాగస్వామి(Partner) ప్రవర్తనలో ఈ 7 మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. చీటింగ్ కావచ్చు
Embed widget