అన్వేషించండి

Telangana Municipal Elections 2026: తెలంగాణలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో పాగా వేసిందెవరు? ఎక్కడ ఎవరు గెలిచారు?

Telangana Municipal Elections 2026: తెలంగాణలో కార్పొరేషన్‌లో ప్రజలంతా కాంగ్రెస్‌కు జై కొట్టారు. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఒక చోట హంగ్ వస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 7 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు గెలుచుకుంది.
  • బీజేపీ రెండు కార్పొరేషన్లలో ఆధిక్యతతో విజయం సాధించింది.
  • కొత్తగూడెంలో హంగ్ ఏర్పడి, వామపక్షాల మద్దతు కీలకం కానుంది.
  • మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లలో లెక్కింపు అనంతరం స్పష్టత రానుంది.

Telangana Municipal Elections 2026: తెలంగాణలో 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాలుగ కార్పరేషన్లను కైవశం చేసుకుంది. బీజేపీ ఒకదాంట్లోపాగా వేసింది. మిగతా ఒక్కచోట మాత్రమే  హంగ్ వచ్చే అవకాశం ఉంది. అందులో కూడా కాంగ్రెస్‌కు భాగం ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. దీంతో ఒక్క కార్పొరేషన్‌లో కూడా కారుకు చోటు లేదని స్పష్టమవుతోంది. 

కాంగ్రెస్ పార్టీ రామగుండం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్‌లలో స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది. ఇంకా లెక్కింపు జరుగుతున్న మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్లలో హస్తం పార్టీ ఆధిక్యం సాధించింది.  29 చోట్ల గెలుపొందింది. నల్గొండ కార్పొరేషన్‌లో 48 డివిజన్లు ఉంటే అందులో 27 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మిగతా పార్టీలన్నీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యాయి. కారు పార్టీ అభ్యర్థులు 9 చోట్ల, బీజేపీ అభ్యర్థులు 4 చోట్ల, ఇతరులు 8చోట్ల గెలుపొందారు. 

రామగుండంలో ఉన్న 60 డివిజన్‌లలో 38 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుచుకుంటే... 13 మంది బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గెలిచారు. బీజేపీ కేవలం ఒక్కటంటే ఒకటే గెలుచుకుంది. ఇతరులు 8 మంది విజయం సాధించారు.  మంచిర్యాలలో 60 డివిజన్‌లకు 44 కాంగ్రెస్ కైవశం చేసుకుంది. బీఆర్‌ఎస్ 8, బీజేపీ 5 మాత్రమే గెలుచుకుంది. ఇతరులు ముగ్గురు గెలిచారు. 

కరీంనగర్, నిజామాబాద్‌ కార్పొరేషన్లలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చేసింది. అక్కడ ఆ పార్టీ పాలక మండలి కొలువుదీరనుంది. నిజామాబాద్ జిల్లాల్లో ఇంకా లెక్కింపు జరుగుతోంది. 60 డివిజన్‌లకు సగానికిపైగా డివిజన్‌లు కౌంటింగ్ పూర్తి అయ్యింది. ఇందులో ఎక్కువ స్థానాలు బీజేపీ దక్కించుకుంది. తర్వాత స్థానంలో స్వతంత్రులు, ఇతర పార్టీల నేతలు ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్‌ ఒకస్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్‌ 17 చోట్ల గెలిచింది. 

కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్‌ సొంత కార్పొరేషన్ అయిన కరీంనగర్‌లో కమలం వికసించింది. అక్కడ 66 డివిజన్‌లు ఉంటే అందులో 30డివిజన్‌లను బీజేపీ కైవశం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ 14 డివిజన్‌లు గెలుచుకుంది. బీఆర్‌ఎస్ సింగిల్‌ డిజిట్‌కు పరిమితమైంది. 

కొత్తగూడెంలో హంగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ డివిజన్‌లు గెలుచుకోలేకపోయింది. 60 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్‌లో వివిధ పార్టీలు చెందిన వాళ్లు 29 గెలుచుకుంటే కాంగ్రెస్ ఇరవై రెండింటిలో ఆధిక్యం కనబరిచింది. ఇక్కడ వామపక్షాలు కీలకం కానున్నారు. వారితో పాలకమండలి కైవశం చేసుకోవాలని బీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ 8 డివిజన్లలోనే ఆధిక్యత చూపించింది. అయితే తమ మద్దతుతో పాలకమండలి ఛైర్మన్‌ కైవశం చేసుకోవాలని వామపక్షాలకు కేటీఆర్ ఆఫర్ ఇచ్చారు. దీంతో ఇక్కడ రాజకీయం ఎలా మారుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

కార్పొరేషన్ పేరు డివిజన్‌ల సంఖ్య కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌  బీజేపీ ఇతరులు
కొత్తగూడెం   60 22   8   29
నల్గొండ     48     27     9    4   8   
కరీంనగర్‌       66   14 8    30     13
మంచిర్యాల  60    44    9 5    3  
మహబూబ్‌నగర్ 56/60     29   14   6    7
నిజామాబాద్   60     17    1     28   14   
రామగుండం 60    38   13   

Frequently Asked Questions

తెలంగాణలో ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి?

తెలంగాణలో 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేశాయి.

కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఫలితాలు ఎలా ఉన్నాయి?

కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు, హంగ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతరులు పోటీ పడ్డారు.

ఏయే కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది?

కాంగ్రెస్ పార్టీ రామగుండం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లలో స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో కూడా కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది.

కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో ఏ పార్టీకి మెజార్టీ వచ్చింది?

కరీంనగర్, నిజామాబాద్‌ కార్పొరేషన్లలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. అక్కడ ఆ పార్టీ పాలక మండలి కొలువుదీరనుంది.

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget