News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Telangana Corona : బాబోయ్ .. 20లక్షల మందికి కరోనా లక్షణాలా? తెలంగాణ ఫీవర్ సర్వేలో కీలక విషయాలు..

తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నాయని ఫీవర్ సర్వేలో తేలింది. హైదరాబాద్‌లోనే పదిహేను లక్షల మందికి ఉన్నాయి. వచ్చే రెండు, మూడు వారాలు పరిస్థితి తీవ్రంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.

FOLLOW US: 
Share:

మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా ? . నలుగురు మిత్రులకు ఫోన్ చేసి మాట్లాడండి ! వారిలో కనీసం ఒకరికైనా కరోనా లక్షణాలు అయిన జబులు, తుమ్ములు, జ్వరం, గొంతునొప్పి వంటివి ఉన్నాయని చెబుతారు. ఇది మనం వేసుకునే సాదాసీదా అంచనాలు. కానీ ఈ విషయాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖ నిర్వహించిన ఫీవర్ సర్వే కూడా ధృవీకరించింది. 

Also Read: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం.. కొత్తగా 10 వేలకుపైగా కేసులు నమోదు..

తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ సర్వేలో తేలింది. మున్ముందు కేసులు మరింతగా పెరవచ్చునని సర్వే అంచనా వేసింది. డిసెంబర్ రెండవ వారం నుంచి ఏఎన్ఎంలు, అంగన్ వాడీలు, ఆశావర్కర్లు చేసిన ఫీవర్ సర్వేలో 20 లక్షల మందికిపైగా కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు తేలింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 15 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు.  అలాగే జిల్లాల్లోనూ పరిస్థితి తీవ్రంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లుగా తెలుస్తోంది. 

Also Read: AP Night Curfew: ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ... ఆంక్షల నుంచి వీటికి మినహాయింపు

ఒమైక్రాన్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతోందని... రానున్న రెండు వారాల్లో కేసులు పెరుగుతాయని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది.  వైద్య ఆరోగ్యశాఖ నివేదిక గురించి చెప్పకపోయినా ఈ శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ఇదే విషయాన్ని మూడు రోజుల కిందట చెప్పారు. వచ్చే మూడు వారాలు అత్యంతకీలకమన్నారు. ఇప్పుడు ఆయన కూడా కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read: పారాసెటమాల్, డోలో మాత్రలు అతిగా మింగేస్తున్నారా? ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోండి

కరోనా లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవడం లేదు. సెల్ఫ్ ఐసోలేట్ అవుతున్నారు. పాజిటివ్ అని తేలినప్పటికీ.. ప్రత్యేకమైన చికిత్స లేకపోవడం.. తేలికపాటి లక్షణాలు ఉండయం.. లక్షణాలు లేని వారిని హోంఐసోలేషన్‌కే ప్రిఫర్ చేస్తూండటంతో టెస్టులు చేయించుకోకుండానే చాలా మంది ఐసోలే అవుతున్నారు. అందువల్ల నమోదవుతున్న కేసులు కూడా తక్కువగానే ఉంటున్నాయని.. కానీ పరిస్థితి ఊహించనంత తీవ్రంగా ఉందని అంచనా వేస్తున్నారు. 

Also Read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 19 Jan 2022 05:51 PM (IST) Tags: cm kcr Telangana Corona Cases Telangana Fever Survey Corona Symptoms in 20 Lakhs Corona Symptoms in 15 Lakhs in Hyderabad

ఇవి కూడా చూడండి

BRS News : కారును పోలిన గుర్తులు ఎవరికీ కేటాయించవద్దు - ఈసీని కోరిన బీఆర్ఎస్ !

BRS News : కారును పోలిన గుర్తులు ఎవరికీ కేటాయించవద్దు - ఈసీని కోరిన బీఆర్ఎస్ !

Mallareddy on Congress: మల్కాజిగిరిలో మామ అల్లుళ్ల భారీ ప్రదర్శన - కాంగ్రెస్‌కి సినిమా చూపిస్తామన్న మల్లారెడ్డి

Mallareddy on Congress: మల్కాజిగిరిలో మామ అల్లుళ్ల భారీ ప్రదర్శన - కాంగ్రెస్‌కి సినిమా చూపిస్తామన్న మల్లారెడ్డి

PM Modi: మోదీ తెలంగాణ టూర్ షెడ్యూ‌ల్‌లో స్వల్ప మార్పులు

PM Modi: మోదీ తెలంగాణ టూర్ షెడ్యూ‌ల్‌లో స్వల్ప మార్పులు

Telangana Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు ఖాయం - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !

Telangana Group 1 :    గ్రూప్ 1 ప్రిలిమ్స్  రద్దు ఖాయం   - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

టాప్ స్టోరీస్

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Salman Khan Tiger 3 : 'టైగర్ 3'తో సల్మాన్ 1000 కోట్లు కొడతాడా? - ఇండియాలో వెయ్యి కోట్ల హీరోలు ఎవరో తెలుసా?

Salman Khan Tiger 3 : 'టైగర్ 3'తో సల్మాన్ 1000 కోట్లు కొడతాడా? - ఇండియాలో వెయ్యి కోట్ల హీరోలు ఎవరో తెలుసా?

Skanda Pre Release Business : 'స్కంద' ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ - రామ్, బోయపాటి ముందున్న టార్గెట్ ఎంతంటే?

Skanda Pre Release Business : 'స్కంద' ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ - రామ్, బోయపాటి ముందున్న టార్గెట్  ఎంతంటే?

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో