By: ABP Desam | Updated at : 18 Jan 2022 06:57 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఏపీలో నైట్ కర్ఫ్యూ(ఫైల్ ఫొటో)
ఏపీలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నేటి నుంచి జనవరి 31వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ ఆంక్షల నుంచి ఆసుపత్రులు, మెడికల్ షాపులు, వైద్యులు, మెడికల్ సిబ్బంది, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్లు, పెట్రోలు బంకులు, ఐటీ సర్వీసులు, అత్యవసర సేవల సిబ్బందికి మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. గర్భిణులు, చికిత్స పొందుతున్న రోగులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి ప్రయాణాలు చేసేవారికి మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపింది. సరకు రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
Also Read: ఏపీలో కరోనా కల్లోలం.... కొత్తగా 6996 కోవిడ్ కేసులు, 4గురు మృతి
మాస్కు తప్పనిసరి
కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్ వేదికల్లో 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. వాణిజ్య సముదాయాలు, దుకాణాల్లో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన జరిగితే రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
Also Read: కొవిడ్ పరీక్ష కేంద్రాలి పెంచాలి.. పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు సరికాదు
ఏపీలో కరోనా కేసులు
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 38,055 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 6,996 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో నలుగురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,514కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 1,066 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,66,762 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 36108 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: Case On PVP : డీకే అరుణ కుమార్తె ఇంటి గోడను కూలగొట్టించిన వైఎస్ఆర్‌సీపీ నేత పీవీపీ .. కేసు నమోదు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Petrol Price Today 28th May 2022: వాహనదారులకు ఊరట, పలు నగరాలలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ
Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ
Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ
Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!
NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Ritika Singh Latest Photos: గురు - ఈ హీరోయిన్ గుర్తుందా? రితికా సింగ్
Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్ స్ట్రోక్