Corona Updates: ఏపీలో కరోనా కల్లోలం.... కొత్తగా 6996 కోవిడ్ కేసులు, 4గురు మృతి
ఏపీలో కొత్తగా 6996 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో నలుగురు మరణించారు. రాష్ట్రంలో 36108 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 38,055 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 6,996 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో నలుగురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,514కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 1,066 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,66,762 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 36108 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVIDUpdates: As on 18th January, 2022 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 18, 2022
COVID Positives: 21,14,489
Discharged: 20,63,867
Deceased: 14,514
Active Cases: 36,108#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/s2MwkiuARA
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,17,384కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1066 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 36108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,514కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,19,22,969 శాంపిల్స్ పరీక్షించారు.
Also Read: పోలీస్ శాఖపై కరోనా పంజా... హైదరాబాద్ పరిధిలోని పలు పీఎస్ లలో భారీగా కేసులు...
దేశంలో కోవిడ్ కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9 వేలకు చేరువైంది. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,891కి చేరింది. మరోవైపు దేశంలో కొత్తగా 2,38,018 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 17,36,628కి చేరింది. మరో 310 మంది కరోనాతో మృతి చెందారు.1,57,421 మంది కరోనా నుంచి కోలుకున్నారు. డైలీ కొవిడ్ పాజిటివిటీ రేటు 14.43కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 4.62గా ఉంది.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 158.04 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 80 లక్షల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. మహారాష్ట్రలో కొత్తగా 31,111 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 మంది వైరస్‌తో మృతి చెందారు. ముంబయిలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గింది. కొత్తగా 5,956 కరోనా కేసులు నమోదయ్యాయి. దిల్లీలో కొత్తగా 12,537 కరోనా కేసులు నమోదుకాగా 24 మంది కొవిడ్‌తో మృతి చెెందారు.
Also Read: కేంద్ర మంత్రికి లేఖ రాసిన హరీశ్ రావు.. వ్యాక్సిన్ గడువు తగ్గించాలని విజ్ఞప్తి
బంగాల్‌లో మాత్రం కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 9,385 కరోనా కేసులు నమోదయ్యాయి. 33 మంది వైరస్‌తో మృతి చెందారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రంలో ఆంక్షలను జనవరి 31 వరకు పొడిగించింది. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, నిత్యావసర వస్తువుల రవాణా, అత్యవసర సేవలకు మాత్రమే ఈ సమయంలో అనుమతి ఉంది. పెళ్లిళ్లు సహా పలు కార్యక్రమాలకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. రాత్రి కర్ఫ్యూ సహా ప్రయాణ ఆంక్షలు అలానే ఉంచింది. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలను జనవరి 31 వరకు మూసివేయాలని నిర్ణయించింది.
Also Read: ట్విట్టర్ వేదికగా పరస్పరం ట్వీట్లు విసురుకుంటున్న వైసీపీ ఎంపీలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి