News
News
X

Minister KTR : ఆహారసూచీలో అట్టడుగు స్థానంలో భారత్, నూకలు తినమన్న వారి తోకలు కత్తిరించాలి- మంత్రి కేటీఆర్

Minister KTR : ధాన్యం కొనుగోళ్లు ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం చెబుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రైవేటుకు కొనుగోళ్లు అప్పగిస్తే మన మరణ శాసనం మనం రాసుకున్నట్లే అని తెలిపారు.

FOLLOW US: 
 
Minister KTR : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మన్నెగూడ లో జరిగిన రైతు అవగాహన సదస్సులో మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ కేంద్రంపై విమర్శలు చేశారు. నూకలు తినమన్న వారి తోకలు కత్తిరించాలని మండిపడ్డారు. దక్షిణాసియాలో భారత్ ను పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ తర్వాత స్థానంలో నిలబెట్టారన్నారు. తెలంగాణలో తప్ప దేశంలో రైతు, వ్యవసాయ అనుకూల విధానాలు లేవన్నారు. తెలంగాణ మినహా దేశంలోని మిగతా 27 రాష్ట్రాల్లో రైతు కంట కన్నీరు కారుతున్నదన్నారు. రైతు కండువాను చూపి దేశంలో ఓట్ల కోసం వాడుకున్న నాయకులు ఉన్నారన్నారు. రాజకీయాల్లో బొడ్డూడని వాడు కూడా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సరిగ్గా పదేళ్ల క్రితం తెలంగాణ పల్లెల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు పోతున్నాం కరెంటు ఇడవమని కోరే పరిస్థితులు ఉండేవని కేటీఆర్ అన్నారు. 

గల్లా ఎగరేసి చెప్పొచ్చు 

"కరెంటు, సాగునీరు, విత్తనాలు, ఎరువుల కోసం తండ్లాడినం. నేడు వరి ధాన్యం ఉత్పత్తిలో నేడు నల్లగొండ జిల్లాది అగ్రస్థానం. తెలంగాణ రాష్ట్రంలో ఇది సాధ్యమయిందని గల్లా ఎగరేసి చెప్పొచ్చు. నాడు కరెంటు ఉంటే వార్త నేడు కరెంటు పోతే వార్త. 24 గంటల కరెంటు ఇస్తే గొప్పనా అంటున్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారో చూపే దమ్ము విపక్షాలకు ఉన్నదా? 2014లో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు  నేడు వరి ధాన్యం ఉత్పత్తి 3.50 కోట్ల టన్నులకు చేరుకున్నది.  నాడు 35 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయితే నేడు 65 లక్షల బేళ్లకు చేరుకున్నది. స్వాతంత్ర్య భారతదేశంలో రైతుబంధు ఇవ్వాలని అలోచన చేసిన ఏకైక నేత కేసీఆర్.  రైతుబంధు పథకం కింద రూ.68 వేల కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. రైతు బీమా కింద రూ.5 లక్షల జీవిత బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. "- మంత్రి కేటీఆర్ 

ధాన్యం కొనుగోళ్లు ప్రైవేటీకరణ 

News Reels

24 గంటల ఉచిత కరెంటుకు ఏటా రూ.10,500 కోట్లు వెచ్చిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మోదీ 2014లో అధికారం ఇస్తే రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నారు కానీ వేలు, లక్షల రెట్లు ఆదాయం పెరిగింది ఒక్క అదానీకి మాత్రమే అని కేటీఆర్ మండిపడ్డారు. ఒక్కడు ధనవంతుడైతే ప్రజలు ధనవంతులు కారన్నారు. పల్లె జీవితాలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలను బలోపేతం చేయాలన్నది టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉచిత చేప పిల్లలతో తెలంగాణ మత్స్యసంపద దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కోటి 35 లక్షల ఎకరాలలో సాగు తెలంగాణకు గర్వకారణమన్నారు. పుట్ల కొద్దీ తెలంగాణ రైతులు ధాన్యం పండిస్తే కొనలేక కేంద్రం చేతులు ఎత్తేసిందని ఆక్షేపించారు.  నాలుగేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయి వడ్లు కొనం తెలంగాణ ప్రజలకు నూకలు తినడం నేర్పమని కేంద్ర మంత్రి అవహేళన చేశారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. రైతుల చైతన్యాన్ని మోదీ తక్కువ అంచనా వేస్తున్నారన్నారు. మోటార్లు మీటర్లు పెట్టాలని మోదీ అన్నారని, తన గొంతులో ప్రాణం ఉండగా బాయికాడ మీటర్లు పెట్టనని కేసీఆర్ అన్నారన్నారు. ప్రీ పెయిడ్ మీటర్లు రైతాంగానికి గొడ్డలిపెట్టు అని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం చెబుతుందని కేటీఆర్ తెలిపారు. ప్రైవేటుకు కొనుగోళ్లు అంటే మన మరణ శాసనం మనం రాసుకున్నట్లే తీవ్రంగా స్పందించారు.  

Published at : 15 Oct 2022 05:58 PM (IST) Tags: India TS News Minister KTR Central Govt Rangareddy news Global Hunger Index

సంబంధిత కథనాలు

KCR Risky Politics : తెలంగాణ లేని రాజకీయం వర్కవుట్ అవుతుందా ? కేసీఆర్ ప్రతీ సారి అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నారా ?

KCR Risky Politics : తెలంగాణ లేని రాజకీయం వర్కవుట్ అవుతుందా ? కేసీఆర్ ప్రతీ సారి అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నారా ?

TSPSC JL Recruitment: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా!

TSPSC JL Recruitment: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా!

వరంగల్ నగరంలో నూతన సీపీ అకస్మిక తనిఖీలు, పోలీసులకు కీలక సూచనలు

వరంగల్ నగరంలో నూతన సీపీ అకస్మిక తనిఖీలు, పోలీసులకు కీలక సూచనలు

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Mancherial News : దళిత బంధు రావాలంటే ఎంపీపీ భర్తతో గడపాలి, వివాహితకు భర్త వేధింపులు!

Mancherial News :  దళిత బంధు రావాలంటే ఎంపీపీ భర్తతో గడపాలి, వివాహితకు భర్త వేధింపులు!

టాప్ స్టోరీస్

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?