Puppalaguda Accident : పుప్పాలగూడలో ఘోర ప్రమాదం, సెల్లార్ పనుల్లో గోడ కూలి ఇద్దరు మృతి
Puppalaguda Accident : రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో విషాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణంలో సెల్లార్ కోసం రాడ్ పనులు చేస్తుండగా గోడ కూలి కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
Puppalaguda Accident : రంగారెడ్డి జిల్లా పుప్పాల గూడలో ఘోర ప్రమాదం జరిగింది. సెల్లార్ కోసం స్లాబ్ వేసేందుకు ఐరన్ వర్క్స్ చేస్తుంటే మట్టి ఒక్కసారిగా కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. ఈ ప్రమాదం నుంచి కొందరు బయటపడగా మరికొంతమంది మట్టికింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలం వద్ద శిథిలాల తొలగింపు సహాయచర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అసలేం జరిగింది?
పుప్పాలగూడలో శనివారం గోడ కూలి ముగ్గురు సెంట్రింగ్ కార్మికులు మృతి చెందారు. మూడు ఫోర్ల సెల్లార్ గుంత తీయడంతో గోడ కూలిపోయింది. సెల్లార్ గుంతకు ఆనుకొని బిల్డింగ్ స్లాబ్ కోసం కార్మికులు సెంట్రింగ్ కడుతున్నారు. ఒక్కసారిగా గోడ కుంగిపోవడంతో సెంట్రింగ్ డబ్బాలు మీద కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాల మీద మట్టి పడడంతో జేసీబీ సహాయంతో మట్టిన తొలగిస్తున్నారు. శిథిలాల కింద ఎవరైనా అని గాలిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని హిమగిరి ఆసుపత్రికి తరలించగా అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రసాద్ గా గుర్తించారు. మరో వ్యక్తి మృతదేహం కూడా లభ్యం అయింది. ఘటనా స్థలిలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయచర్యలు చేపట్టారు. పైప్ లైన్ తడి వల్ల గోడ కూలిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్ల మూడు ప్రాణాలు పోయాయని కార్మికులు ఆరోపిస్తున్నారు.
శ్రీకాకుళం వాసులు మృతి
Also Read : Nizamabad News : మంచినీళ్లు అనుకుని కస్టమర్ కు యాసిడ్ ఇచ్చిన షాపింగ్ మాల్ వర్కర్, ఆ తర్వాత తాను తాగి!