Telangana Elections 2023 : హైదరాబాద్‌లో మెగా రోడ్ షో - మోదీ ప్రచార షెడ్యూల్ ఇదే
Prime Minister Modi : తెలంగాణలో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మధ్యలో ఓ రోజు తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుని వస్తారు.
Telangana Elections 2023 Prime Minister Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో సుదర్ఘంగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మూడు రోజుల పాటు తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. ప్రధాని ప్రచార షెడ్యూల్ ఖరారయింది. ఈనెల 25వ తేదీన కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో మోడీ ప్రచారం చేయనున్నారు. 26న దుబ్బాక, నిర్మల్ పబ్లిక్ మీటింగ్‌లో ప్రధాని పాల్గొంటారు. 27న మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్, హైదరాబాద్‌లో రోడ్డు షోలో పాల్గొననున్నారు.
25వ తేదీ మధ్యాహ్నం నుంచి ఎన్నికల ప్రచారం
25న మధ్యాహ్నం 2:05 గంటలకు కామారెడ్డికి మోదీ చేరుకుంటారు. మధ్యాహ్నం 2:15 నుంచి 2:55 వరకు సభలో పాల్గొంటారు. ఆ సభ అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:05 గంటలకు రంగారెడ్డి జిల్లాకు చేరుకుంటారు. సాయంత్రం 4:15 నుంచి 4:55 గంటల వరకు నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి 7:35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజ్ భవన్‌కు చేరుకుని అక్కడే బస చేయనున్నారు.
మిగిలింది వారం రోజులే ఊరూ వాడా చుట్టేద్దాం- పీక్స్‌కు చేరుకున్న తెలంగాణ ఎన్నికల ప్రచారం
కీలక నియోజకవర్గాల్లో బహిరంగసభలు
26వ తేదీన దుబ్బాక, నిర్మల్‌లో పబ్లిక్ మీటింగ్‌లో మోడీ పాల్గొంటారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు కన్హయ్య శాంతివనంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 2 గంటలకు దుబ్బాకకు వెళ్తారు. 2:15 గంటల నుంచి 2:45 వరకు దుబ్బాకలో నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లో మోడీ పాల్గొంటారు. ఆ సభ అనంతరం నిర్మల్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3:45 నుంచి సాయంత్రం 4:25 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 5:45 గంటలకు తిరుపతికి బయలుదేరనున్నారు. తర్వాతి రోజు తెల్లవారు జామున తిరుమలలో శ్రవారి దర్శనం చేసుకుని నేరుగా తెలంగాణ ప్రచారానికి వస్తారు.
కాంగ్రెస్ నాడు - నేడు ! రేవంత్ రెడ్డితోనే మార్పా ?
27వ తేదీన హైదరాబాద్‌లో రోడ్ షో
మళ్లీ 27వ తేదీన మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్, హైదరాబాద్‌లో రోడ్డు షోలో మోడీ పాల్గొంటారు. తొలుత మహబూబాబాద్ చేరుకుని మధ్యాహ్నం 12:45 నుంచి 1:25 వరకు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ సభ అనంతరం నేరుగా కరీంనగర్ బయలుదేరనున్నారు. 2:45 గంటల నుంచి 3:25 వరకు కరీంనగర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:40కి హైదరాబాద్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించే రోడ్ షోలో మోడీ పాల్గొంటారు. విమానాశ్రయం నుంచి ఈ రోడ్ షో ప్రారంభం కానుంది. రోడ్ షో అనంతరం నేరుగా హైదరాబాద్ నుంచి 6:25 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు.