అన్వేషించండి

Telangana Poll: మిగిలింది వారం రోజులే ఊరూ వాడా చుట్టేద్దాం- పీక్స్‌కు చేరుకున్న తెలంగాణ ఎన్నికల ప్రచారం

Telangana Assembly Elections 2023: తెలంగాణ ప్రచారం పీక్స్‌కు చేరింది. ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ ప్రచారంతో పార్టీలు హోరెత్తిస్తున్నాయి. లోపాలు గుర్తించి వాటిని అధిగమించేలా పని చేస్తున్నాయి.

Telangana Assembly Election 2023 Campaign :తెలంగాణ ఎన్నికల పోలింగ్ దగ్గర పడింది. మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు పార్టీలు, పార్టీల అగ్రనేతలు సంసిద్ధమవుతున్నారు. ఊరూవాడా చుట్టేసి ఓటర్ల మదిలో ముద్రపడేలా చూసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు తెప్పించుకొని వీక్‌గా ఉన్న ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. నేతలకు ఫోన్లు చేసి ఉన్న సమస్యలు తెలియజేస్తూ కేడర్‌ను కలుపుకు వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. 

కారు స్పీడ్ 

ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పటి నుంచి దూసుకెళ్తున్న బీఆర్‌ఎస్‌... ప్రచారంలో కూడా అదే స్పీడ్‌ కొనసాగిస్తోంది. ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచనతో అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తామని చెబుతున్న సీఎం కేసీఆర్‌.. ఎక్కడా అలసత్వం లేకుండా అందర్నీ పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతి నిత్యం ప్రచార సభల్లో పాల్గొంటూ కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

వారం రోజులే గడువు ఉన్నందున కేసీఆర్‌ తన ప్రచారాన్ని మరింత వేగం పెంచబోతున్నారు. ఇప్పటికే 70కిపైగా నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన ఆయన...ప్రచార గడువు ముగిసేలోపు వంద నియోజకవర్గాలను చుట్టేయాలని ఆలోచనలో ఉన్నారు. ఓవైపు కేసీఆర్ ప్రచారం హోరెత్తిస్తుంటే మరోవైపు హరీష్‌, కేటీఆర్‌ కూడా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. మండల స్థాయిలో ప్రచారం చేస్తూ పదేళ్లు సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తున్నారు. మిగతా మంత్రులు, ఇతర నేతలు తమ తమ నియోజకవర్గాలకే పరిమితమైన గెలుపు తలుపు తట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

రేవంత్ రెడ్డి దూకుడు 

కాంగ్రెస్‌ నేతలు కూడా అధికార పార్టీకి దీటుగా ప్రచారంలో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చుట్టేస్తున్న రేవంత్ రెడ్డి... బీఆర్‌ఎస్ పాలనలో  ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, పడుతున్న ఇబ్బందులు వివరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే తీసుకోబోయే పథకాలతోపాటు మేనిఫెస్టో ప్రజలకు తెలియజేస్తూ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

రేవంత్ రెడ్డికి సపోర్ట్‌గా కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. వారితోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫేమస్ లీడర్లు కూడా తెలంగాణలో ఓ లుక్‌ వేస్తున్నారు. వచ్చే వారం రోజుల పాటు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక సహా ఇతర నేతలంతా వచ్చి తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఊరూవాడా తెరగనున్నారు. తెలంగాణ పార్టీలో సీనియర్లు కూడా విభేదాల సంగతి పక్కన పెట్టి తమ నియోజకవర్గంలో విజయం కోసం మాత్రమే శ్రమిస్తున్నారు. వాళ్లెవరు కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడంలేదు. స్టార్ క్యాంపెయినర్స్‌గా ఉన్న వాళ్లు కూడా తమ నియోజకవర్గానికో తమ జిల్లాకో పరిమితమై ప్రచారం చేస్తున్నారు. 

 

మెల్లిగా వేగం పెంచిన కమలం  

బీజేపీలో కూడా ప్రచారం హోరెత్తుతోంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కాషాయం దళం ఈ మధ్య కాలంలోనే క్యాంపెయిన్ స్పీడ్ పెంచారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల ముగ్గురు కూడా రాష్ట్రాన్ని చూట్టేస్తున్నారు. తమకు కీలకమైన ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్నారు. వారికి తోడుగా కేంద్రమంత్రులు, ఢిల్లీ నుంచి అగ్రనేతలు వచ్చి అడపాదడపా ప్రచారం చేస్తున్నారు. ఈ వారంలోనే మోదీ, అమిత్‌షా మరోసారి  ప్రచారం చేయనున్నారు. మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్నందున తెలంగాణతో పోలిస్తే ఆయా రాష్ట్రాలపై వారి ఫోకస్ ఎక్కువగా ఉంది.

 

జనంలోకి జనసేన 

బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ ప్రచారం నేటి నుంచి మొదలు కానుంది. పవన్‌ కల్యాణ్‌తో ప్రచారం తమ పార్టీకి లాభిస్తుందని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ వారంలో రోజుల పాటు వివిధ నియోజవర్గాల్లో జనసేన ప్రచారం చేయనున్నారు. జనసేన పోటీ చేసే 8 నియోజకవర్గాలకే ఆయన ప్రచారం పరిమితం అవుతుంది. ఆయనతోపాటు ఎవరెవరు ప్రచారంలో పాల్గొంటారనేది మాత్రం క్లారిటీ లేదు. 

ఆన్‌లైన్‌లోనూ తగ్గని ప్రచార హోరు 

ఆఫ్‌లైన్‌ ప్రచారంలో ఇలా ఉంటే ఆన్‌లైన్ ప్రచారంలో ఎవరూ తగ్గడం లేదు. ఒకరికి మించి మరొకరు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు. పార్టీలతోపాటు నాయకులంతా ఎవరికి వారుగా టీంలను ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకుంటున్నారు. ఇన్‌ఫ్లూయెన్సర్లతో ప్రత్యేక ఇంటర్వ్యూలు, సమాన్య ప్రజల పేరుతో ప్రత్యేక ముఖాముఖీలు అంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget