అన్వేషించండి

Modi Tweet : తెలంగాణకు అతి పెద్ద వరం ప్రకటించిన మోదీ - లక్షల మందికి ఉద్యోగాలు గ్యారంటీ !

తెలంగాణకు మెగా టెక్స్ టైల్ పార్క్ ను ప్రధాని మోదీ ప్రకటించారు. దీని వల్ల కోట్ల పెట్టుబడులు.. లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆయన సోషల్ మీడియాలో తెలిపారు.


Modi Tweet :    తెలంగాణ‌లో కేంద్రం టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేయ‌నుంది.. ఈ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. తెలంగాణకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు, లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కేంద్రం ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణతో సహా పలు రాష్ట్రాలలో టెక్స్‌టైల్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలియజేశారు. తెలంగాణ‌, త‌మిళ‌నాడు, ఉత్త‌ర ప్ర‌దేశ్ , క‌ర్నాట‌క , మ‌ధ్య‌ప్ర‌దేశ్ , గుజ‌రాత్ ల‌లో మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు రానున్నాయి. 

 ఇది ‘మేక్ ఇన్ ఇండియా’   ‘మేక్ ఫర్ ది వరల్డ్’కి గొప్ప అవకాశం

ఈ పార్కుల ద్వారా టెక్స్‌టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని, కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తుందని, లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని ఆయన ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. “పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు 5F (ఫార్మ్ నుంచి ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ నుంచి ఫారిన్ వరకు) లక్ష్యదృష్టికి అనుగుణంగా టెక్స్‌టైల్స్ రంగాన్ని పెంచుతాయి. తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఎంపీ, యూపీలలో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు కానున్నాయని పంచుకోవడానికి సంతోషిస్తున్నాను. పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు టెక్స్‌టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించి కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తాయి. వాటితో పాటు లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తాయి. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘మేక్ ఫర్ ది వరల్డ్’కి గొప్ప ఉదాహరణ అవుతుంది.  ’ అంటూ తన ట్వీట్‌ ద్వారా తెలియజేశారు.

 

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ కోసం నిధులు కావాలని చాలా కాలంగా కోరుతున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో వరంగల్లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసింది.ఈ  మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి   నిధులు కేటాయించాలని చాలా సార్లు  మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. దీంతోపాటు ప్రాజెక్టుకు అనుమతి త్వరగా ఇవ్వాలని లేఖలో పేర్కొ్న్నారు. కాకతీయ మెగా పార్క్ వంటి భారీ ప్రాజెక్ట్‌లు సముచితంగా లబ్ది పొందేందుకు వీలుగా 'టెక్స్‌టైల్ అపెరల్ సెక్టార్ తయారీ ప్రాంతాల అభివృద్ధి   విధానాన్ని ఖరారు చేయాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లో 1200 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్‌ అయిన  కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ను అభివృద్ధి చేస్తుంది. ‘ఫైబర్ టు ఫ్యాషన్’ కాన్సెప్ట్ ఆధారంగా, అత్యాధునిక  సౌకర్యాలతో  కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ రూపుదిద్దుకుంటున్నట్టు కేటీఆర్  కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన టెక్స్ టైల్ పార్క్ ను కింద దీన్ని అభివృద్ధి చేస్తారా లేకపోతే విడిగా మరొకటి అభివృద్ధి చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduates MLC Election: ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు చివరి తేదీ నవంబర్ 6.. పట్టభద్రుల ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్!
ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు చివరి తేదీ నవంబర్ 6.. పట్టభద్రుల ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్!
PDS Rice Recycling: సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
Khammam SDRF Boats Capsized: ఖమ్మం బేతుపల్లి చెరువులో ఘోరం - 2 ఎస్‌డీఆర్ఎఫ్ బోట్లు బోల్తా - 11 మంది సిబ్బంది గల్లంతు!
ఖమ్మం బేతుపల్లి చెరువులో ఘోరం - 2 ఎస్‌డీఆర్ఎఫ్ బోట్లు బోల్తా - 11 మంది సిబ్బంది గల్లంతు!
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతుపై కాంగ్రెస్ ఫోకస్.. రేవంత్ వ్యూహం ఏంటి?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతుపై కాంగ్రెస్ ఫోకస్.. రేవంత్ వ్యూహం ఏంటి?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget