Ponguleti : సస్పెన్స్ కొనసాగిస్తున్న పొంగులేటి - అనుచరులకు ఏం చెప్పారంటే ?
రెండు రోజుల్లోనే తాను ఏ పార్టీలో చేరబోయేది ప్రకటన చేస్తానన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి . ఖమ్మంలో అనుచరులతో సమావేశం అయ్యారు.
Ponguleti : బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న తన అనుచరులతో సమావేశం అయిన ఆయన ఏ పార్టీలో చేరేది 2, 3 రోజుల్లోనే తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు. పార్టీ మార్పుపై ఎక్కువ సమయం తీసుకోనని, అధికారికంగా హైదరాబాద్‌లోనే ప్రకటిస్తానని చెప్పారు. తాను ఓ పార్టీలో చేరతానని బీఆర్ఎస్ నేతలు ఊహించారని, మందు పార్టీలు, పండగ చేసుకున్నారని అన్నారు. ‘నా అభిమానుల నిర్ణయమే.. నా నిర్ణయం’ అని స్పష్టం చేశారు. కార్యకర్తల సమక్షంలోనే కొత్త పార్టీ లో చేరతానన్నారు.
అందరితో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నాన్న పొంగులేటి
అన్ని ప్రాంతాల్లో ఉండే మేధావులు, కవులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యమ నాయకులు, అన్నీ సంఘాల నాయకులతో వివరంగా, విపులంగా చర్చలు జరిపామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకుంటే సీఎం కేసీఆర్ , ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ఈ ప్రభుత్వాన్ని, ప్రజలను పట్టించుకోని సర్కార్‌ను ఇంటికి పంపిస్తుందో విశ్లేషించడం జరిగిందన్నారు. అందరి అభిప్రాయాలు సేకరించడానికి చాలా సమయం పట్టిందని అన్నారు.
ప్రియురాలిని హత్య చేసి మ్యాన్‌హోల్‌లో పడేసిన పూజారి- హైదరాబాద్‌లో దారుణం
రాహు్ గాంధీ టీమ్ జరిపిన చర్చలు సఫలం
కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ టీం ఇటీవల పొంగులేటితో చర్చలు జరిపారు. ఖమ్మం జిల్లాలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జూపల్లికి కూడా ప్రాధాన్యం ఇస్తామని హామీ రావడంతో వారు కాంగ్రెస్ లోచేరాలని నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులతో సమావేశమై తన నిర్ణయాన్ని ప్రకిటంచే అవకాశం ఉంది. ఇప్పటికే పొంగులేటి పలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో ఏకతాటిపైకి తీసుకురావాలనేది పొంగులేటి, జూపల్లి వ్యూహంగా తెలుస్తోంది. ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉండటం, కర్ణాటక గెలుపుతో రాష్ట్రంలో పుంజుకునే అవకాశం ఉండటంతో హస్తం పార్టీలో చేరాలని పొంగులేటి, జూపల్లి నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ
పొంగులేటి అనుచరవర్గం అంతా కాంగ్రెస్ లోకే !
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట చాలామంది వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం సీనియర్ నేత, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావ్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, మేకల మల్లిబాబు యాదవ్, రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ వెంట ఉన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా పొంగులేటి వెంట వెళ్తారని ప్రచారం జరుగుతోంది.