News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Dead Body In Manhole: ప్రియురాలిని హత్య చేసి మ్యాన్‌హోల్‌లో పడేసిన పూజారి- హైదరాబాద్‌లో దారుణం

Dead Body In Manhole: హైదరాబాద్‌లో ఓ యువతిని పూజారి చంపేసి మ్యాన్‌హోల్‌లో పడేశాడు.. ఆమె భద్రాచలం వెళ్లి మిస్ అయిందని ఫిర్యాదు చేశాడు.

FOLLOW US: 
Share:

Dead Body In Manhole: హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ యువతిని పూజారి చంపేసి మ్యాన్‌హోల్‌లో పడేశాడు. తర్వాత ఏమీ తెలియనట్టు మిస్సింగ్ కంంప్లైంట్ ఇచ్చాడు. సరూర్‌ నగర్ ప్రాంతానికి చెందిన వెంకటసాయి సూర్యకృష్ణ వృత్తి రీత్యా పూజారి. పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా వేరే మహిళతో ఏర్పడిన వివాహేతర సంబంధం చిక్కుల్లో పడేసింది. 
 
వెంకటసాయికి అప్సర అనే యువతి పరిచయం ఏర్పడింది. వరుసకు ఆమె మేనకోడలు అవుతుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. 

ఇద్దరు పిల్లలు ఉన్న వెంకటసాయి ఆమెను వదలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆమె పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టాడు. చివరకు ఒత్తిడి ఎక్కువయ్యేసరికి ఆమెను హతమార్చాడు. 

మూడు రోజుల క్రితం అప్సరను కారులో శంషాబాద్ సుల్తాన్ పల్లికి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేని ప్రాంతంలో ఆమె బండరాయితో కొట్టి చంపేశాడు. తర్వాత డెడ్‌బాడీని సంచిలో కట్టి తీసుకొచ్చాడు. సరూర్‌నగర్‌లోని ఓ మ్యాన్‌హోల్‌లో పడేశాడు. 

తర్వాత రోజు ఏమీ ఎరగనట్టు తన మేనకోడలు అప్సర కనిపించడం లేదంటూ శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మేనకోడలు ఫ్రెండ్స్‌తో భద్రాచలం వెళ్లేందుకు ప్లాన్ చేసినట్టు తెలిపారు. మూడో తేదీన తానే స్వయంగా శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద డ్రాప్ చేసినట్టు కంప్లైంట్‌లో చెప్పాడు. 

అయితే అదే రోజు ఆమెను కారులో తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి హత్యచేసినట్టు తెలుస్తోంది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. దీంతో వెంకటసాయి దురాగతం వెలుగులోకి వచ్చింది. వెంటనే అతన్ని అరెస్టు చేసి విచారిస్తే అసలు గుట్టంతా చెప్పుకొచ్చాడు. 

తన సోదరి కుమార్తె మిస్సైందని ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ వెంకటసాయి కృష్ణ ఫ్యామిలీ మాత్రం ఆమెతో సంబంధం లేదని చెప్తున్నారు. అసలు ఆమెను  తమ ప్రాంతంలో చూడలేదంటున్నారు. ఎప్పుడూ అప్సరను ఇంటికి తీసుకొచ్చింది కూడా లేదని వివరిస్తున్నారు. 
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కేసులో పోలీసులు అప్సర డెడ్‌బాడీని వెలికి తీసే పనిలో ఉన్నారు. నిందితులు వెంకటసాయికృష్ణ... మ్యాన్‌హోల్‌లో ఆమె డెడ్‌బాడీ వేయడమే కాకుండా దాన్ని కాంక్రీట్‌తో కప్పేశాడు. దాన్ని ఉప్పుడు జేసీపీ సాయంతో వెలికి తీస్తున్నారు. 

Published at : 09 Jun 2023 12:40 PM (IST) Tags: Hyderabad Crime News Hyderabad Police Dead Body In Manhole

ఇవి కూడా చూడండి

Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!

Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!

TS TET 2023 Results: టీఎస్ టెట్‌-2023 ఫలితాలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు

TS TET 2023 Results: టీఎస్ టెట్‌-2023 ఫలితాలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

టాప్ స్టోరీస్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా

Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా

Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం

Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం

Salaar Release : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?

Salaar Release : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?