Nizamabad News: నిజామాాబాద్ జిల్లాలో పసుపు బోర్డుపై రాజుకున్న రాజకీయం.. కమలం, గులాబీ బాహాబాహీ

ఆర్మూర్ నియోజకవర్గంలో హాట్ హాట్. బీజేపీకి పసుపు బోర్డు సెగ. బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ ధర్నాలు. ఎంపీ అరవింద్ ను గ్రామాల్లో తిరగనివ్వకుండా అడ్డుకుంటున్న పసుపు రైతులు. పోలీసుల తీరుపై అరవింద్ ఆగ్రహం.

FOLLOW US: 

నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు వివాదం తారాస్థాయికి చేరుకుంటోంది. 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకోస్తానని అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చి ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఆ హామీని పూర్తిగా మర్చిపోయారని పసుపు రైతులు కొన్ని రోజులుగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఎంపీగా గెలిచి రెండున్నరేళ్లయినా ఇంకా ఇచ్చిన హామీని నెరవేర్చట్లేదని పసుపు రైతులు ఆరోపిస్తున్నారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తానన్న హామీతో ఎన్నికల్లో గెలిచి పసుపు బోర్డు అంశాన్ని మరుగున పడేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాండ్ పేపర్ రాసిచ్చిన అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు తెచ్చేవరకు అరవింద్ ను గ్రామాల్లో తిరగనివ్వబోమని పసుపు రైతులు హెచ్చరిస్తున్నారు.

ఆర్మూర్ నియోజకవర్గంలోని చిన యానాం, నడకూడ, దేగాం గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వెళ్లిన అరవింద్ ను రానివ్వకుండా పసుపు రైతులు ఆయా గ్రామాల్లో రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. అరవింద్ రాకుండా అడ్డుకునేందుకు ముందస్తుగా ట్రాక్టర్ టైర్లు అడ్డంగా పెట్టి అడ్డుకునేందుకు సిద్దమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అలెర్ట్ అయ్యారు. వివాదం చెలరెేగే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో మోహరించారు.

ఊళ్లోకి వెళ్తే సమస్య వస్తుంందని ఎంపీ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును తప్పుబట్టిన ఎంపీ అరవింద్ ఆర్మూర్ ని పెర్కిట్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. అరవింద్ తిరిగి వెళ్లిపోవాలంటూ పోలీసులు ఎంత చెప్పినా వినలేదు. రెండు గంటల పాటు ధర్నా చేసిన తర్వా అరవింద్ ఇస్సాపల్లికి బయలు దేరారు. పసుపు రైతులు అడ్డుకుంటారన్న సమాచారం అరవింద్ కు పోలీసులు ముందస్తుగా సమాచారం ఇచ్చినా పట్టించుకోకుండా వెళ్లారని తెలుస్తోంది.

ఇస్సాపల్లికి బయల‌్దేరిన అరవింద్ ను గ్రామంలోకి రాకుండా పసుపు రైతులు, టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఇటు బీజేపీ అటు టీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ దాడిలో ఎంపీ అరవింద్ కాన్వాయ్ లోని రెండు కార్ల అద్దాలు పగుల గొట్టారు ఆందోళనకారులు. ఈ బాహాబాహీలో పలువురికి గాయాలయ్యాయ్. పోలీసులు నచ్చజెప్పడంతో అరవింద్ అక్కడి నుంచి నేరుగా నిజామాబాద్ సీపీ కార్యాలయానికి వచ్చారు. జరిగిన సంఘటనపై ఎంపీ అరవింద్ ఫిర్యాదు చేశారు. 

పోలీసుల వైఖరిపై అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తమపై దాడికి పాల్పడిన టీఆర్ఎస్ నాయకులకు పోలీసులు సహకరించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని 50 వేల ఓట్ల మెజార్టీతో ఓడిస్తానని సవాల్ విసిరారు. ఈ దాడి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే జరిగిందని అరవింద్ ఆరోపించారు. ఈ దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్ ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు 

Published at : 25 Jan 2022 08:59 PM (IST) Tags: nizamabad Nizamabad news Nizamabad Latest News Nizamabad Updates

సంబంధిత కథనాలు

Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు

Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు

TS Inter Results 2022 Live Updates: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల, మళ్లీ బాలికలే టాప్ - వెంటనే ఇలా చెక్ చేస్కోండి

TS Inter Results 2022 Live Updates: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల, మళ్లీ బాలికలే టాప్ - వెంటనే ఇలా చెక్ చేస్కోండి

TS Inter Supplementary Exams Date: ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయని టెన్షన్ వద్దు, ఇలా చేస్తే సరి !

TS Inter Supplementary Exams Date: ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయని టెన్షన్ వద్దు, ఇలా చేస్తే సరి !

Nizamabad News: శ్రీరాం సాగర్ వద్ద కొత్త టూరిజం స్పాట్- ఆకట్టుకోనున్న బోటింగ్, రోప్‌వే

Nizamabad News: శ్రీరాం సాగర్ వద్ద కొత్త టూరిజం స్పాట్- ఆకట్టుకోనున్న బోటింగ్, రోప్‌వే

Rythu Bandhu Money Status: అన్నదాతల అకౌంట్లోకి రైతుబంధు నగదు జమ - మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

Rythu Bandhu Money Status: అన్నదాతల అకౌంట్లోకి రైతుబంధు నగదు జమ - మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

టాప్ స్టోరీస్

Janasena Janavani : " జనవాణి " ప్రారంభిస్తున్న పవన్ కల్యాణఅ ! ఇక నుంచి ప్రతి ఆదివారం ..

Janasena Janavani  :

Privatisation of PSU Banks: బ్యాంకుల ప్రైవేటీకరణ! పార్లమెంటులో కొత్త బిల్లు పెట్టనున్న కేంద్రం

Privatisation of PSU Banks: బ్యాంకుల ప్రైవేటీకరణ! పార్లమెంటులో కొత్త బిల్లు పెట్టనున్న కేంద్రం

Optical Illusion: ఈ బొమ్మలో ఒక జంతువు దాక్కొని ఉంది, 30 సెకన్లలో దాన్ని కనిపెడితే మీ కంటి చూపు భేష్

Optical Illusion: ఈ బొమ్మలో ఒక జంతువు దాక్కొని ఉంది, 30 సెకన్లలో దాన్ని కనిపెడితే మీ కంటి చూపు భేష్

TCSలో ఉద్యోగానికి, గవర్నమెంట్ జాబ్‌కు పెద్ద తేడా లేదట, ఎందుకంటే..

TCSలో ఉద్యోగానికి, గవర్నమెంట్ జాబ్‌కు పెద్ద తేడా లేదట, ఎందుకంటే..