Morning Top News: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పు, వైసీపీలో ముసలం వంటి మార్నింగ్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Morning Top News:
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా పలు సవాళ్లు ఎదురవుతున్న నేపధ్యంలో కాలం కలసి రావాంటే సచివాలయానికి వాస్తు మార్పులు కొన్ని చేయాలని భావిస్తున్నారు. కేసీఆర్ సచివాలయం అయితే కట్టించారు కానీ పూర్తి స్థాయిలో సీఎంగా అందులో విధులు నిర్వహించలేకపోయారు. రేవంత్ పూర్తి స్థాయిలో సచివాలయాన్ని ఉపయోగించుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సజ్జల నియామకంతో వైసీపీలో ముసలం?
కొత్త దుమారానికి కారణం అవుతోంది. పైకి ఎవరూ మాట్లాడకపోయినప్పటికీ చాలా మంది సీనియర్లు ఇక పార్టీలో యాక్టివ్‌గా ఉండటం కన్నా వీలైనంత మౌనం పాటిస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సీఎం సోదరుడుపై కాంగ్రెస్ నేత ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిపై సొంత పార్టీ కాంగ్రెస్ లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజశేఖర్ సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన సోదరుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.లగచర్లలో జరిగిన దాడి కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందని, ఇలాంటివి ఇకనైనా మానుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
టీటీడీ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం
ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనం కల్పించాలన్న టీటీడీ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని తిరుపతి ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని, వారి ఆకాంక్షను నెరవేర్చాలని టీటీడీ ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లానన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో పాలాభిషేకం చిచ్చు రేపింది. వరంగల్ లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మంత్రి కొండా సురేఖ సభ ప్రాంగణం వద్ద ఏర్పాట్లలో ఉంటే.. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఎయిర్ పోర్టుకు నిధులు విడుదల చేసినందుకు రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. దీంతో కొండా సురేఖ తాను లేకుండా ఎలా చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
పెళ్లి నిజం కానీ వధువు మాయం
పెళ్లి కాని ప్రసాదులే టార్గెట్‌గా తెలివిగా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలో ప.గో జిల్లాలో ఇటీవల ఎక్కువవుతున్నాయి. ఇప్పటివరకూ అందిన ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి కాని ప్రసాదులనే ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంటుంది. వారి నుంచి డబ్బులు వసూలు చేసి పరారవుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
లగచర్ల దాడి కేసులో పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
తెలంగాణలో సంచలనం రేపిన వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో డీఎస్పీ పై బదిలీ వేటు వేశారు. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
పాక్ చెర నుంచి మత్స్యకారులను ఇండియన్ కోస్ట్ గార్డ్
భారత మత్స్యకారులను పాక్ అధికారుల చెర నుంచి ఇండియన్ కోస్ట్ గార్డు సిబ్బంది సాహసోపేతంగా రక్షించారు. పీఎంఎస్ఏకు చెందిన PMS సుస్రత్ నౌకను వెంటాడి మరీ మత్స్యకారులను రక్షించారు. రెండు గంటల పాటు పాక్ ఓడను వెంటాడి ఈ ఆపరేషన్ ముగించింది. ఇందులో మన దేశానికి చెందిన బోట్ 'కాలభైరవ' డ్యామేజీ అయి మునిగిపోయినట్లు తెలిపింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ముగిసిన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న మహారాష్ట్రలో ఈ సారి తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతల ప్రచారం హైలెట్ గా నిలిచింది. అలాగే ఏపీ బీజేపీ నేతలు పలువురు మహారాష్ట్రలో పలు ప్రాంతాలకు ఎన్నికల ఇంచార్జులుగా వ్యవహరించారు.వారు కూడా శక్తివంచన లేకుండా తమ ప్రయత్నాలు తాము చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ
బ్రెజిల్ వేదికగా జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ బిజీబిజీగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం అయ్యారు. G20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వీరిద్దరూ బ్రెజిల్ పర్యటనకు వెళ్లారు. అమెరికా అధ్యక్షుడిని కలుసుకోవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..