Indian Coast Guard: పాక్ నౌకను ఛేజ్ చేసిన ఇండియన్ కోస్ట్ గార్డు - భారత మత్స్యకారులను రక్షించిన సిబ్బంది
National News: పాక్ అధికారుల చెర నుంచి భారత మత్స్యకారులను ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది ఆదివారం రక్షించారు. పాక్ బోటను 2 గంటలు వెంబడించి మరీ వారిని సేఫ్‌గా తీసుకొచ్చారు.
Indian Coast Guard Saves 7 Indian Fishermen From Pakistan Security Agency: భారత మత్స్యకారులను పాక్ అధికారుల చెర నుంచి ఇండియన్ కోస్ట్ గార్డు (Indian Coast Guard) సిబ్బంది సాహసోపేతంగా రక్షించారు. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. అరేబియా సముద్రంలో ఏడుగురు మత్స్యకారులను పాక్ అధికారులు పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌకలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో నో ఫిషింగ్ జోన్ సమీపంలో మత్స్యకారుల నుంచి అందిన సమాచారం మేరకు భారత నౌకాదళ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.
పీఎంఎస్ఏకు (PMSA) చెందిన PMS సుస్రత్ నౌకను వెంటాడి మరీ మత్స్యకారులను రక్షించారు. రెండు గంటల పాటు పాక్ ఓడను వెంటాడి ఈ ఆపరేషన్ ముగించింది. ఇందులో మన దేశానికి చెందిన బోట్ 'కాలభైరవ' డ్యామేజీ అయి మునిగిపోయినట్లు తెలిపింది. ఏడుగురు జాలర్ల ఆరోగ్యం నిలకడగా ఉందని కోస్ట్‌గార్డ్ సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై ఇండియన్ కోస్ట్ గార్డ్, స్టేట్ పోలీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఫిషరీస్ అధికారులతో కూడిన సంయుక్త దర్యాప్తును నిర్వహిస్తున్నాయి.
Indian Coast Guard (ICG) ship successfully rescued seven Indian fishermen on 17 Nov 24, apprehended by a Pakistan Maritime Security Agency (PMSA) ship near the India-Pakistan Maritime Boundary. Despite efforts by the PMSA ship to retreat, ICG Ship intercepted PMSA ship and… pic.twitter.com/YA05cNu0y2
— ANI (@ANI) November 18, 2024
#WATCH | Indian Coast Guard Ship Agrim chasing Pakistani ship PMSA Nusrat to rescue Indian fishermen who were being taken to Pakistani waters on Sunday, November 17. The Indian Coast Guard managed to rescue Indian fishermen.
— ANI (@ANI) November 18, 2024
(Source: Indian Coast Guard) https://t.co/fdigpCelvN pic.twitter.com/23w67dt33w
Also Read: Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !