News
News
X

RS Praveen Kumar: పేదల భూములను లాక్కోవడానికే ధరణి, మోసం చేయడానికే దళితబంధు పథకం

ఆంధ్ర నుండి వచ్చిన దోపిడీ పాలకులు తెలంగాణ బహుజన బిడ్డలను చంపుతామని బెదిరిస్తున్నాడంటే ఇంకా తెలంగాణ రాలేదని అన్నారు బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

FOLLOW US: 
Share:

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్ (టి) నియోజకవర్గాన్ని తెలంగాణలో విలీనం చేయడానికి ఈ బహిరంగ సభ జరుగుతుందని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సిర్పూర్ నియోజకవర్గం ఇంకా ఆంధ్ర వలసవాదుల కబ్జాలోనే ఉందన్నారు. 2008లో తుమ్మిడిహట్టి దగ్గర అప్పటి సిఎం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో భూములు లాక్కొని, కొందరికి పరిహారం కూడా ఇవ్వకుండా 1500 కోట్లు ఖర్చు చేశారు. ఆ కాంట్రాక్టు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఇచ్చారని గుర్తుచేశారు. పైగా ప్రాజెక్టు నిలిపివేసి కమీషన్ల కోసం రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి 82వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు ఆంధ్రవారికే అప్పజెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికి కూడా క్రషర్లు, కంకర క్వారీలు పెట్టి, రోడ్ల కాంట్రాక్టుల పేరుతో 50 కోట్లు ఆంధ్రకు చెందిన వల్లభనేని కన్‌స్ట్రక్షన్స్ కి అప్పజెప్పారని విమర్శించారు. ఆంధ్ర నుండి వచ్చిన దోపిడీ పాలకులు తెలంగాణ బహుజన బిడ్డలను చంపుతామని బెదిరిస్తున్నాడంటే ఇంకా తెలంగాణ రాలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల భూములను లాక్కోవడానికే ధరణి తీసుకొచ్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

సీఎస్ కూడా ఆంధ్రావారే ! 
తెలంగాణకు చెందిన బహుజన బిడ్డలకు ఉన్నత పదవులు ఇవ్వకుండా ఇటీవల చీఫ్ సెక్రటరీ పదవి ఆంధ్రవారికి కట్టబెట్టిన తెలంగాణ వ్యతిరేకి కేసిఆర్ అని గుర్తుచేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుచరులు సిర్పూర్ నియోజకవర్గంలో అటవీ అధికారిణిపై దాడి చేస్తే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అడ్డగూడూరులో దొంగతనం ఆరోపణలు వస్తే అరెస్టు చేసిన పోలీసులు, వందకోట్ల లిక్కర్ స్కాం చేసిందని ఆరోపణలు వచ్చిన కల్వకుంట్ల కవితను ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నించారు. కోయపోచగూడేంలో పోడు భూమి సాగు చేసిన మహిళలను బట్టలు ఊడిపోతున్నా దాడి చేశారని, పోడు భూముల విషయంలో ఓ బాలింతలను సైతం అరెస్టు చేశారని, అదే పేదల భూములు, నోటిఫైడ్ భూములు కబ్జా చేసినవారిని ఎందుకు అరెస్టు చేయడంలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.

ప్రజలు మీకు విఆర్ఎస్ ఇవ్వనున్నారు
దేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడు బీబ్రా గ్రామంలో జాతీయజెండా ఎగురవేసిన విధంగా, అదే స్పూర్తితో 2023లో నీలిజెండా ఎగురవేసి కోనప్ప నుండి విముక్తి కల్పిస్తామని తెలిపారు. సిర్పూర్ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్, బిఆర్ఎస్ అంటూ ఎన్ని పెట్టినా ప్రజలు మీకు విఆర్ఎస్ ఇవ్వనున్నారని తెలిపారు. సిర్పూర్ పేపర్ మిల్ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. కాలుష్యం ప్రజలకిస్తూ లాభాలు మాత్రం కంపెనీ,పాలకులు పంచుకుంటున్నారని ఆరోపించారు. బహుజన రాజ్యంలో 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని తెలిపారు. మన బహుజన బిడ్డలు కాంట్రాక్టర్లు, యజమానులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు కావాలంటే మన రాజ్యం రావాలన్నారు. జి.వో నెం 317 వల్ల ఆసిఫాబాద్ యువత తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
బిసిలకు గత ఎనిమిది ఏళ్లుగా బడ్జేట్ లో కేవలం 2వేల కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. విద్యార్థులకు కనీసం ఫీజ్ రియంబర్స్ మెంట్  కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఫాంహౌస్ పంటలకు ఒక ధర, పేదల భూముల్లో పండిన పంటలకు ఇంకో ధర ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి నాయకులు బండి సంజయ్ ఇవన్ని పట్టించుకోకుండా కులాలు, మతాల మధ్య చిచ్చులు పెడుతూ,మసీదులు తవ్వాలంటున్నారని విమర్శించారు. ఇలాంటి మాటలతో హిందూ ముస్లిం తెహజీబ్ చెడగొట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు క్షమించరని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
కెసిఆర్ జీతాలే ఇవ్వడం లేదు..
దళిత బంధు పథకం రాష్ట్రంలో అందరికి రావాలంటే రెండు లక్షల కోట్ల బడ్జెట్ కావాలని, కానీ కెసిఆర్ జీతాలే ఇవ్వడం లేదని, బిల్లులు రాక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడతలో భాగంగా నేడు సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

కాగజ్‌నగర్‌ లోని సర్సిలా, శిశుమందిర్ స్కూల్ వెనకగల డంపింగ్ యార్డుకు సంబంధించిన 9 ఎకరాల భూమి కెటిఆర్ మంత్రి అండదండతో కోనేరు కోనప్ప కబ్జా చేసి వెంచర్లు వేస్తున్నారన్నారు. 2015లో మున్సిపాలిటీకి కేటాయించిన భూమిని నేడు అక్రమంగా ఆక్రమించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కెటిఆర్ నీకు దమ్ముంటే నీవు తెలంగాణ వాదివి అయితే ఆంధ్ర దొంగల నుండి ప్రభుత్వ భూమి కాపాడాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రైవేట్ ఎస్టేట్ కాదన్నారు. వెంటనే కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు రియంబర్స్ మెంట్ రావాలంటే, రైతుల పంటకు మద్దతు ధర రావాలన్నా,కౌలు రైతులకు న్యాయం జరగలన్నా మన రాజ్యం రావాలని తెలిపారు.

తెలంగాణ కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలు నెరవేరలేదన్నారు. కాగజ్‌నగర్‌  బహిరంగసభలో భాగంగా బియాని అపార్ట్ మెంట్స్ కాలనీ నుండి అంబేడ్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులార్పించి, స్టేజి మీద గల మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులార్పించి బహుజనగీతం పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి, సిర్పూర్ (టి) నియోజకవర్గ ఇంచార్జి అర్షద్ హుస్సేన్, బిఎస్పి ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు మోర్ల గణపతి, నియోజకవర్గ సెక్రటరీ దుర్గం ప్రవీణ్, నియోజకవర్గ అధ్యక్షులు రాంప్రసాద్, నాయకులు రాంటెంకి నవీన్, జ్యోతి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Published at : 16 Jan 2023 11:23 PM (IST) Tags: RS Praveen kumar BSP Telangana KCR Kumuram Bheem Asifabad

సంబంధిత కథనాలు

Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !

Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !

Nizamabad News: దక్షిణ మధ్య రైల్వేలో నిజామాబాద్ జంక్షన్ కీలకం - కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా న్యాయం జరిగేనా!

Nizamabad News: దక్షిణ మధ్య రైల్వేలో నిజామాబాద్ జంక్షన్ కీలకం - కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా న్యాయం జరిగేనా!

Telangana CS Shanti Kumari: కంటి వెలుగు, పోడు పట్టాలు, టీచర్ల బదిలీలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష

Telangana CS Shanti Kumari: కంటి వెలుగు, పోడు పట్టాలు, టీచర్ల బదిలీలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష

Breaking News Live Telugu Updates: అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Breaking News Live Telugu Updates: అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Nizamabad News : కలెక్టరేట్ ముందు సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం, బిల్లులు చెల్లించకుండా ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఆరోపణలు!

Nizamabad News :  కలెక్టరేట్ ముందు సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం, బిల్లులు చెల్లించకుండా ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఆరోపణలు!

టాప్ స్టోరీస్

Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

Etala Vs Kousik Reddy :  ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ -  పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో Adani Enterprises, Sun Pharma

Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో Adani Enterprises, Sun Pharma

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని