జల్సాల కోసం చోరీలు- ఇద్దరు చైన్ స్నాచర్స్‌ను పట్టుకున్న పోలీసులు
ఈజీ మనీకి అలవాటు పడి నేరాలు చేస్తున్న యువత. దొంగతనాలకు అడ్డాగా మారిన నిజామాబాద్ నగరం. ఇద్దరు చైన్ స్నాచర్స్, డబ్బు దొంగిలించిన వారిని అరెస్టు చేశారు పోలీసులు.
నిజామాబాద్ జిల్లాలో యువత జల్సాలకు అలవాటు పడి నేరాలు చేస్తున్నారు. ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్స్, వ్యక్తుల నుంచి డబ్బు దొంగిలించడాలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ఘటనలు ఎక్కువయ్యాయ్. పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా... ఇలాంటి ఘటనలు ఆగటం లేదు. ఓ వైపు యువత మత్తుకు బానిసవుతూ... గంజాయ్ స్మగ్లింగ్ కుదరకపోతే చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారు. లేదంటే బైక్ లను దొంగిలిస్తూ... ఎంతో కొంతకు అమ్మేస్తున్నారు. అలా వచ్చిన డబ్బుతో జల్పాలు చేస్తున్నారు. చివరికి పోలీసులకు చిక్కితే కటకటాల పాలవుతున్నారు.
ఇటీవల నిజామాబాద్ నగరంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయ్. వ్యాపారులను, బ్యాంకుల వద్ద డబ్బు డ్రా చేస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. బైక్ లపై వచ్చి వారి కల్లల్లో కారం కొట్టి లేదంటే బెదిరించి వారి నుంచి డబ్బులు లాక్కెళుతున్న ఘనటలు చోటు చేసుకుంటున్నాయ్. తాజాగా ఇద్దరు యువకులు చైన్ స్నాచింగ్, దొంగతనం చేస్తూ పోలీసులకు చిక్కారు. నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్ కు చెందిన షేక్ నేహల్, (21), ఆటో నగర్ కు చెందిన సోఫీ అహ్మద్ ఓ వ్యక్తి నుంచి పది రోజుల క్రితం బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని వస్తుండగా అతని వద్ద నుంచి డబ్బులు లాక్కుని వెళ్లిపోయారు.
ధర్మపురి అనే వ్యక్తి ఈనెల 1వ తేదీన పులాంగ్ జంక్షన్ లోని సిటీ యూనియన్ బ్యాంక్ లో తన ఖాతా నుంచి రూ.49 వేలు విత్ డ్రా చేసుకుని తన ప్రగతి నగర్ లోని తన ఇంటికి వేణు మాల్ వెనుక వైపు నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. ధర్మపురి అనే వ్యక్తి జేబులో నుంచి 49 వేల రూపాయలను లాక్కుని అతన్ని తోసేసి పల్సర్ బైక్ పారిపోయారు. అయితే బుధవారం 4వ టౌన్ పోలీసులు పులాంగ్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా TS 16 ED 0097 నెంబర్ పల్సర్ బైక్ పై ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతుండగా చూసిన పోలీసులు పట్టుకోవటానికి ప్రయత్నించారు. వారు పారిపోతుండగా ఛేజ్ చేసి వారిని పోలీసులు పట్టుకున్నారు.
ఈ ఇద్దరు యువకులను పోలీసులు విచారించగా ధర్మపురి అనే వ్యక్తి వద్ద నుంచి 49 వేల రూపాయలను దొంగిలించిన వ్యవహారాన్ని ఒప్పుకున్నారు. డబ్బులు పోయిన వెంటనే ధర్మపురి 4వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఇవాళ కూడా ఈ ఇద్దరు ప్రగతి నగర్ ఏరియాలో రెక్కి నిర్వహించి వినాయక్ నగర్ లోని బ్యాంకు వద్ద చోరీ చేసేందుకు వెళ్లినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. గతంలో కూడా వీరు పలు చోరీలకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇద్దరు నిందితుల నుంచి పోలీసులు 48,500 రూపాయల నగదు, దొంగతనానికి ఉపయోగించిన పల్సర్ బైక్, 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 1న వారు దొంగతనం చేసిన ఫుటేజీని ప్రగతి నగర్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. సీసీ కెమెరాలో ఉన్న పుటేజీ పట్టుబడిన వ్యక్తులు ఒకరే కావటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపారు. అయితే సీసీ కెమెరాలు పోలీసులకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని కాలనీల్లో సీసీ కెమెరాలు తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను అభినందించారు సీపీ నాగరాజు.