Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలో చిరుత పులి సంచారం - ప్రజల్లో టెన్షన్ టెన్షన్
Adilabad Latest News: ఆదిలాబాద్‌లో చిరుతపులి టెన్షన్ పెడుతోంది. రోజుల వ్యవధిలోనే పశువులపై దాడి చేసి చంపేసింది. దీంతో ప్రజలు కంగారు పడుతున్నారు.

Adilabad Latest News:ఆదిలాబాద్ జిల్లా బోథ్ అటవీ రేంజ్ పరిధిలో గత నాలుగు రోజుల్లో చిరుత పులి దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి. నిగిని అటవీ ప్రాంత సమీపంలో మేత మేస్తున్న ఆవులపై చిరుత పులి దాడి చేసింది. అడవిలో చిరుతల పులి సంచారం వల్ల సమీప గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పంట చేలల్లోకి వెళ్లడానికి, వ్యవసాయ పనులు చేయడానికి కూలీలు భయపడుతున్నారు. అటవీ విస్తీర్ణం పెరగడం, నీరు పుష్కలంగా లభించడంతో వన్యప్రాణులకు ఆవాసాలుగా మారుతున్నాయని పేర్కొంటున్నారు. మృతి చెందిన పశువుల యజమానులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇప్పిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అడవిలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పొలం పనులకు వెళ్లేవారు గుంపులుగుంపులుగా వెళ్లాలని సూచించారు.





















