అన్వేషించండి

Cinematic Love Story: తాళికట్టే సమయంలో తమ ప్రేమకథను చెప్పిన పెళ్లికూతురు - ఆ పెళ్లి కొడుకు చేసిన పనికి అందరూ హ్యాట్సాఫ్!

Love Story: తాళికట్టే సమయంలో ఆపండి అనే డైలాగ్ పాత సినిమాల్లోదే. అయితే పెద్దలో..పోలీసులో ఆ డైలాగ్ వదిలేవారు. ఇప్పుడు ఓ పెళ్లికూతురే అ డైలాగ్ చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగింది?

Bride love story:  నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని ఆ కళ్యాణ మండపం పెళ్లి సందడితో కళకళలాడుతోంది. బంధుమిత్రుల కోలాహలం, మంగళ వాయిద్యాల హోరు మధ్య వధువు పల్లవి , వరుడు  వేణుగోపాల్ పెళ్లి పీటల మీద కూర్చున్నారు. పండితులు మంత్రోచ్ఛారణలు చేస్తూ పెళ్లి తంతును నడిపిస్తున్నారు. జీలకర్ర బెల్లం కార్యక్రమం పూర్తయ్యింది. ఇక ప్రధాన ఘట్టమైన మాంగల్య ధారణ  సమయం రానే వచ్చింది. పెళ్లికొడుకు వేణుగోపాల్ చిరునవ్వుతో తాళిని పల్లవి మెడలో కట్టబోయాడు.

సరిగ్గా అదే క్షణంలో.. కాలం ఆగిపోయినట్లుగా పల్లవి ఒక్కసారిగా  వద్దు.. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు!  అని గట్టిగా అరిచింది. ఆ ఒక్క మాటతో పెళ్లి పందిరంతా నిశ్శబ్దం అలుముకుంది. అప్పటివరకు సంతోషంగా ఉన్న బంధువుల ముఖాల్లో ఒక్కసారిగా ఆందోళన, అయోమయం నెలకొన్నాయి. పల్లవి కన్నీళ్లతో తన మనసులోని నిజాన్ని అందరి ముందూ బయటపెట్టింది. తాను వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తున్నానని, ఇంట్లో చెబితే ఎక్కడ ఒప్పుకోరో అన్న భయంతో ఇంతకాలం మౌనంగా ఉన్నానని నిజాయితీగా ఒప్పేసుకుంది.

ఈ మాట వినగానే పల్లవి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.  బంధువులు ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పెళ్లి ఆగిపోతే పరువు పోతుంది, కాపురం మొదలుపెట్టాక అంతా సర్దుకుంటుంది  అని నచ్చజెప్పారు. కానీ పల్లవి తన నిర్ణయానికి కట్టుబడింది. తనని ప్రేమించిన వాడికి కాకుండా మరొకరికి భార్యగా కాలేనని తెగేసి చెప్పింది. పరువు కోసం ఒక నిరర్థకమైన బంధంలో బందీ కావడానికి ఆమె నిరాకరించింది.

అక్కడ అందరూ ఆశ్చర్యపోయే మరో దృశ్యం ఆవిష్కృతమైంది. తన మెడలో తాళి కట్టాల్సిన అమ్మాయి అలా చెప్పడంతో సాధారణంగా ఏ వరుడైనా అవమానంగా భావించి గొడవ చేస్తాడు. కానీ వేణుగోపాల్ సంస్కారం ముందు అందరూ తలవంచాల్సిందే. పల్లవి బాధను, ఆమె నిజాయితీని అతను అర్థం చేసుకున్నాడు.  నాపై ప్రేమ లేని అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకొని, ఇద్దరి జీవితాలను నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. ఆమె ఇష్టాన్నే నేను గౌరవిస్తాను అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

 ఘటన సినిమాల్లో వచ్చే  క్లైమాక్స్ లా అనిపించినా, వేణుగోపాల్ చూపించిన ఆ పరిణతికి అక్కడున్న వారంతా ఫిదా అయిపోయారు. ఆ గొడవలో ఆమెను విమర్శించకుండా, ఒక ప్రాణం విలువ తెలిసిన మనిషిగా అతను పెళ్లి రద్దుకు అంగీకరించాడు. చివరికి బంధువులు కూడా చేసేదేమీ లేక పెళ్లిని రద్దు చేసుకున్నారు.     

ఒకవైపు తన ప్రేమ కోసం సాహసం చేసిన వధువు పల్లవి, మరోవైపు తనను కాదన్న అమ్మాయి వ్యక్తిత్వాన్ని గౌరవించిన వరుడు వేణుగోపాల్.. వీరిద్దరి నిర్ణయాలు సమాజంలో ఒక కొత్త చర్చకు దారితీశాయి. ప్రేమ, పెళ్లి అనేవి బలవంతంగా రుద్దేవి కావని, అవగాహనతో కూడినవని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News:మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News:మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget