అన్వేషించండి

Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!

Rythu Bharosa Scheme Update: తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే మొదటి విడతను మార్చిలో విడుదల చేసింది. ఇప్పుడు మిగతా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రైతు భరోసా పథకం: మిగతా డబ్బులు ఈ నెలలోనే రెండు విడతల్లో జమ.
  • ఎకరాకు రూ.6,000 చొప్పున సీజన్‌కు పెట్టుబడి సాయం అందిస్తారు.
  • 9,000 కోట్లను మూడు విడతల్లో, 70 లక్షల మంది రైతులకు అందజేస్తారు.
  • ఆధార్, పాస్ బుక్ వివరాలు ఏఈవోకు ఇచ్చి సహాయం పొందండి.

Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రాష్ట్రంలోని కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చేసింది. రైతులకు ఇవ్వాల్సిన మిగతా డబ్బులను మరో రెండు విడతల్లో ఈ నెలలోనే జమ చేయాలని ప్రభుత్వ ఆలోచన చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మార్చిలో ఒక విడత నిధులు జమ చేశారు. ఇప్పుడు రెండో విడతను వారం పది రోజుల్లో విడుదల చేస్తారు. మిగతా సొమ్మును ఈ నెలాఖరుకు ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నారు. 

గతంలో అమలైన రైతు బంధు పథకంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న రైతు భరోసా పథకంలో ప్రభుత్వం చాలా మార్పులు చేసింది. గతంలో ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయలు ఇచ్చే వారు. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని పన్నెండు వేలకు పెంచారు. అంటే ప్రతి సీజన్‌కు ఆరువేల రూపాయల చొప్పున రైతులకు అందజేస్తున్నారు. 

మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి నిధులు

రాష్ట్రంలో ఈ సీజన్ కోసం మొత్తం 9వేల కోట్లను మూడు విడతల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో మార్చి 23నుంచి 3590 కోట్లను రైతుల ఖాతాల్లో వేశారు. రెండో విడతను ఏప్రిల్ రెండో వారంలో 2650 కోట్లను విడుదల చేయనున్నారు. ఇందులో ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యత ఇస్తారు. మూడో విడతను ఏప్రిల్ చివరి నాటికి 2, 760 కోట్లను విడుదల చేస్తారు. 

రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నందున వీటిని జమ చేసే విధానంలో సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది ప్రభుత్వం గతంలో తక్కువ భూమి ఉన్న వారికి ముందుగా డబ్బులు వేసే వారు. దీంతో మిగతా వాళ్లకు ఎప్పుడో వచ్చేవి. ఇప్పుడు దానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. ఇప్పుడు భూమి ఎంత ఉన్నా సరే మొదటి ఎకరాకు సంబంధించిన ఆరు వేల నిధులను ఒకేసారి విడుదల చేస్తున్నారు. దీని వల్ల రాష్ట్రంలోని 70లక్షల మంది రైతులకు ఒకేసారి లబ్ధి జరుగుతుంది. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సమన్వయం చేస్తూనే రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ దశల వారీగా పంపిణీ ప్లాన్ అమలు చేస్తోంది. అందులో భాగంగానే కేవలం సాగు అవుతున్న వ్యవసాయం భూములకు మాత్రమే ఈ సాయం అందిస్తున్నారు. భూభారతిలో నమోదు అయిన భూములకే సాయం అందుతోంది. ఇప్పుడు ఫిబ్రవరిలో కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు అందుతున్న వేల మంది రైతులకు కూడా సాయం అందజేయనుంది. అయితే వీళ్లంతా ఏప్రిల్ 25 లోపు ఆధార్, పాస్ బుక్, బ్యాంకు వివరాలను ఏఈవోకు అందజేయాలి. 

స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

రైతులు తమ నిధుల స్థితిగతులను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ సౌకర్యాన్ని కల్పించింది. రైతు భరోసా అధికారిక వెబ్‌సైట్‌ rythubharosa.telangana.gov.in సందర్శించాలి. స్టాటస్ చెక్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీ ఆధార్ నెంబర్‌లేదా రిజిస్టర్డ్ వివరాలు నమోదు చేయాలి. దీని ద్వారా మీ ఖాతాలో నగదు జమ అయిందా లేదా అని తెలుస్తుంది. 

Frequently Asked Questions

రైతు భరోసా పథకం కింద ఎంత మొత్తం అందిస్తారు?

రైతు భరోసా పథకం కింద ప్రతి సీజన్‌కు ఆరువేల రూపాయల చొప్పున అందిస్తారు. గతంలో ఎకరాకు ఏడాదికి పదివేలు ఇచ్చేవారు, ఇప్పుడు ఆ మొత్తాన్ని పన్నెండు వేలకు పెంచారు.

రైతు భరోసా నిధులను ఎలా పంపిణీ చేస్తున్నారు?

ఈ సీజన్‌కు మొత్తం 9వేల కోట్లను మూడు విడతల్లో పంపిణీ చేస్తున్నారు. మొదటి విడత నిధులు ఇప్పటికే జమ అయ్యాయి, మిగిలినవి ఏప్రిల్‌లోనే విడుదల చేయనున్నారు.

రైతులు తమ రైతు భరోసా స్టేటస్‌ను ఎలా చెక్ చేసుకోవచ్చు?

రైతులు rythubharosa.telangana.gov.in వెబ్‌సైట్‌లో 'స్టాటస్ చెక్' ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆధార్ నెంబర్‌తో తమ నిధుల స్థితిగతులను తెలుసుకోవచ్చు.

కొత్త పట్టా పాస్ పుస్తకాలు అందుకున్న రైతులకు కూడా సాయం అందుతుందా?

అవును, కొత్త పట్టా పాస్ పుస్తకాలు అందుతున్న రైతులకు కూడా సాయం అందజేయనుంది. వారు ఏప్రిల్ 25 లోపు ఆధార్, పాస్ బుక్, బ్యాంకు వివరాలను ఏఈవోకు అందజేయాలి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget