Payal Shankar: గుజరాత్‌లో అలాగని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా- పాయల్ శంకర్ ఛాలెంజ్
Adilabad News | సీసీఐ ఒకే ధరతో పత్తి కొనుగోలు చేస్తోందని, గుజరాత్ లో ఒక్క రూపాయి ఎక్కువకు పత్తి కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు పాయల్ శంకర్.

Payal Shankar fire on former minister Jogu Ramanna | ఆదిలాబాద్: ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన జోగు రామన్న భారతదేశంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) దేశం మొత్తంలో ఒకే ధరతో పత్తి కొనుగోలు చేస్తున్న విషయం నీకు తెలియదా అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా పత్తి కొనుగుల విషయంలో అనవసరంగా మాజీ మంత్రి జోగు రామన్న రాద్దాంతం చేస్తున్నారన్నారు. గుజరాత్ రాష్ట్రంలో సీసీఐ ఒక్క రూపాయి ఎక్కువ పెట్టి పత్తి కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే.. నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి, అక్కడి నుంచి అసెంబ్లీకి లెటర్ పంపిస్తానన్నారు.
సిగ్గు లేకుండా నువ్వు (జోగు రామన్న) మంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ మార్కెట్ కు రైతులు పత్తి తీసుకువస్తే నాలుగైదు రోజులు పత్తిని ఎండబెట్టుకుంటేనే కానీ పోలేని దుస్థితిలో ఉండేదని గుర్తు చేశారు. ఆరోజు రైతులు పత్తిని ఎండబెట్టిన ఆధారాలు ఉన్నాయని చూపించారు. అవన్నీ మర్చిపోయి నేడు భారతీయ జనతా పార్టీ పైన, నా పైన లేనిపోని ఆరోపణలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఏం పీకుతున్నారని చేసిన వ్యాఖ్యాలపై అసహనం వ్యక్తం చేశారు. మొన్న రైతులు ధర్నా చేస్తుంటే నువ్వేడా పన్నావు అని రామన్నను ప్రశ్నించారు.
జోగు రామన్న హుందాగా మాట్లాడతారనుకున్నాను!
ఆరోజు హైదరాబాద్ నుండి అన్ని కార్యక్రమాలు వదిలేసి రైతులు ఆందోళన చేస్తున్నారని హుటాహుటిన ఆదిలాబాద్ కు వచ్చానన్నారు. రాత్రి 11 గంటల వరకు కలెక్టర్ తో కలిసి వ్యాపారులను ఒప్పించి, పత్తి కొనుగోలు చేసేలా చూసానన్నారు. దినమంతా రైతులు మార్కెట్ యార్డులో పడిగాపులు కాసారన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న హుందాగా మాట్లాడుతారని అనుకున్నాను అన్నారు. రాజకీయాల పాలసీలపైని మాట్లాడుకుందామని వ్యక్తిగత పై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితువు పలికారు. రైతుల కు ఫసల్ బీమా కొరకు ఆనాడు హైదరాబాద్లో రైతులతో పోరాడిననని, నాపై ఎన్నో కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. రైతుల కోసం పోరాటాలు చేసింది ఎవరు అని ప్రజలందరికీ రైతులందరికీ తెలుసు అన్నారు.
దేశం మొత్తం సీసీఐ ఒకటే ధర
ప్రైవేట్ వ్యాపారులు ఎంతైనా ధర పెట్టి కొనుగోలు ఎక్కడైనా చేయొచ్చని, కానీ సిసిఐ మాత్రం దేశ మొత్తంలో ఒకే ధర చెల్లిస్తుందన్నారు. తెలిసి తెలియనట్టు మాట్లాడి రామన్నా ఉన్న పరువును పోగొట్టుకోవద్దన్నారు. ఎంపీ ఎమ్మెల్యే పై భాష మాట్లాడే విధానం మార్చుకోవాలి అన్నారు లేకపోతే నేను నా కార్యకర్తలు మాటలు మొదలుపెడితే నీకే కష్టమైతదన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు ఆదినాథ్, అయ్యన్న గారి భూమయ్య, జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, నాయకులు మయూర్ చంద్ర, లాలా మున్నా, కృష్ణ యాదవ్, జోగు రవి, ఆకుల ప్రవీణ్, రాజేష్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, సతీష్. భరత్, శివ, ముకుంద తదితరులు పాల్గొన్నారు.
Also Read: Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Also Read: Family Survey: తెలంగాణలో సమగ్ర సర్వే, కుల గణన చేసేది వీరే - మంచి వేతనం ఇస్తామన్న భట్టి విక్రమార్క
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

