అన్వేషించండి

Asifabad News: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సిర్పూర్(టి) జడ్పీటీసీ, నేడు బీజేపీలోకి చేరిక 

Telangana News: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) జడ్పీటీసీ నీరేటి రేఖ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజే బీజేపీ పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రకటించారు. 

Asifabad News: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) జడ్పీటీసీ సభ్యురాలు నీరేటి రేఖ, ఆమె భర్త జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ నీరెటి సత్యనారాయణ శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సిర్పూరు(టి)లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్థానిక నాయకుడి మాటలు విని మండల అభివృద్ధిని విస్మరిస్తుననారని ఆరోపించారు. సిర్పూర్ (టీ) మండల కేంద్రానికి మంజూరైన ఎమ్మేల్యే క్వార్టర్ నీ కాగజ్ నగర్ పట్టణానికి తరలించారని ఆరోపించారు. సిర్పూర్ (టి) కి మంజూరైన ఏకలవ్య ఆశ్రమ పాఠశాలను సైతం పురపాలిక పరిధిలో ఏర్పాటు చేయించారని పేర్కొన్నారు. మండల అభివృద్ధిని ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, ఇక్కడ కనీసం బస్టాండ్ సౌకర్యం కూడా లేదన్నారు. ఎమ్మెల్యే చూపుతున్న వివక్ష కారణంగానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరతామని ప్రకటించారు. నీరేటి రేఖ 2014 నుంచి 2018 వరకు సిర్పూరు(టి) మండల ఎంపీపీగా 2018 నుంచి జడ్పీటీసీ సభ్యురాలు కొనసాగుతున్నారు. 

Asifabad News: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సిర్పూర్(టి) జడ్పీటీసీ, నేడు బీజేపీలోకి చేరిక 

నేడే బీజేపీలో చేరబోతున్న జడ్పీటీసీ సభ్యురాలు నీరేటి రేఖ

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సిర్పూర్(టి) జడ్పీటీసీ సభ్యురాలు నీరేటి రేఖ, సత్య నారాయణ దంపతులు భాజపాలో చేరేందుకు హైదరాబాద్ కు బయల్దేరారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబుతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ముందుగా సిర్పూర్ (టీ) మండలంలోని టోంకిని సిద్ది హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించి, బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిర్పూర్ టౌన్ లోని బస్టాండ్ చౌరస్తాలో కాగజ్ నగర్ లోని ప్రధాన కూడళ్లలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. సిర్పూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా వెనక్కి నెట్టిన ఘనత కోనేరు కొన్నపకే దక్కిందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో దోపిడీకి చిరునామా కల్వకుంట్ల కుటుంబం అయితే సిర్పూర్ (టీ) నియోజకవర్గంలో దోపిడీకి చిరునామా కోనేరు కుటుంబమని విమర్శించారు. 

Asifabad News: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సిర్పూర్(టి) జడ్పీటీసీ, నేడు బీజేపీలోకి చేరిక 

రాబోయే రోజుల్లో సిర్పూర్ (టీ) నియోజవర్గం విముక్తి పోరాటంలో జడ్పీటిసి సభ్యురాలు నీరటి రేఖ - సత్యనారాయణ దంపతుల మాదిరిగా అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. త్వరలో సిర్పూర్ (టి) నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజల హృదయాల నుండి ఖాళీ అవ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఖాళీ అవుతుందని తెలిపారు. సిర్పూర్ లో బిజేపి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల భాజపా అధ్యక్షులు ఎల్ములే శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరక్టర్ నీరెటి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కొప్పుల శంకర్, నాయకులు కొండ్ర మనోహర్ గౌడ్, రాచర్ల మహేష్ యాదవ్, దంద్రే శంకర్, చౌదరి భగవాన్, ఉప్పుల వెంకట్శ్వర్, మైదం తిరుపతి, మేకల తిరుపతి, మేకల వెంకటేష్, అశోక్ ఆచార్య గురూజీ, జాగరి రమేష్, సాయి బనార్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget