అన్వేషించండి

Jagadish Reddy: వాటర్ ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు, జిల్లా మంత్రులు ఉత్తరకుమారులంటూ జగదీశ్ రెడ్డి ఫైర్

Telangana News: పంట పొలాలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలపై మండిపడ్డారు.

Suryapet MLA Jagadish Reddy: నల్లగొండ: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు సాగునీళ్లు ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో చాలా మార్పు వచ్చిందన్నారు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. నల్లగొండ మండలం, అన్నపర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తో కలిసి ఎండిన వరి పంట పొలాలను, నిమ్మ తోటలను జగదీష్ రెడ్డి పరిశీలించారు. అక్కడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

Jagadish Reddy: వాటర్ ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు, జిల్లా మంత్రులు ఉత్తరకుమారులంటూ జగదీశ్ రెడ్డి ఫైర్

నాగార్జునసాగర్ ఆయకట్టు కోసం ఎగువనున్న నారాయణపుర్, ఆల్మట్టి  డ్యామ్ లనుండి 10 టీఎంసీల నీటిని విడుదల చేయించి.. రైతులకి సాగునీరు అందించాలని జగదీశ్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టు కింద నీరు అందించే అవకాశం ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లినా తమకు ఎండిన పంట పొలాలే దర్శనమిస్తున్నాయని, పెట్టుబడులన్నీ మట్టిలో కలిసిపోయి రైతులు విలపిస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సహా జిల్లాల్లోని ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు సైతం రైతుల వైపు కన్నెత్తి  చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Jagadish Reddy: వాటర్ ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు, జిల్లా మంత్రులు ఉత్తరకుమారులంటూ జగదీశ్ రెడ్డి ఫైర్

కాంగ్రెస్ మంత్రులకు రాజకీయాలు, అక్రమ వసూళ్లు, దందాలు తప్ప, రైతుల గోడు పట్టట్లేదని జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు   ఉత్తరకుమారులు అని, ప్రగల్భాలు పలకడం తప్ప దేనికి పనికిరారని ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరికీ ఎంతసేపు రాజకీయాలు చేయడం తప్పా, రైతుల సంక్షేమం పట్టలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య పూరిత వైఖరితో రైతులు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి కరువుపై సర్వే చేయించి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం అవుతుందంటూ శాపనార్థాలు పెట్టారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CRDA Building: ఏడాది కిందట శిథిలం -నేడు వరల్డ్ క్లాస్ బిల్డింగ్ - 13న సీఆర్డీఏ భవనం ప్రారంభోత్సవం
ఏడాది కిందట శిథిలం -నేడు వరల్డ్ క్లాస్ బిల్డింగ్ - 13న సీఆర్డీఏ భవనం ప్రారంభోత్సవం
Manchu Vishnu Statement: మోహన్ బాబు యూనివర్శిటీపై అదంతా దుష్ప్రచారమే, ఎవరూ ఆందోళన చెందొద్దు: మంచు విష్ణు
మోహన్ బాబు యూనివర్శిటీపై అదంతా దుష్ప్రచారమే: మంచు విష్ణు కీలక ప్రకటన
Telangana Congress News: అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ.. మంత్రుల మధ్య ముగిసిన వివాదం
అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ.. మంత్రుల మధ్య ముగిసిన వివాదం
Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపై టీడీపీ కీలక నిర్ణయం, తేల్చేసిన చంద్రబాబు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపై టీడీపీ కీలక నిర్ణయం, తేల్చేసిన చంద్రబాబు
Advertisement

వీడియోలు

ఆ క్రెడిట్ ద్రవిడ్‌దే..! గంభీర్‌కి షాకిచ్చిన రోహిత్
గ్రౌండ్‌‌లోనే ప్లేయర్‌ని బ్యాట్‌తో కొట్టబోయిన పృథ్వి షా
ప్యానిక్ మోడ్‌లో పీసీబీ అడుక్కుంటున్నా నో అంటున్న ఫ్యాన్స్!
ముంబై ఇండియన్స్ లోకి ధోనీ? CSK ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్!
BIG BANG Explained in Telugu | బిగ్ బ్యాంగ్ తో మొదలైన విశ్వం పుట్టుక వెనుక ఇంత కథ ఉందా.? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CRDA Building: ఏడాది కిందట శిథిలం -నేడు వరల్డ్ క్లాస్ బిల్డింగ్ - 13న సీఆర్డీఏ భవనం ప్రారంభోత్సవం
ఏడాది కిందట శిథిలం -నేడు వరల్డ్ క్లాస్ బిల్డింగ్ - 13న సీఆర్డీఏ భవనం ప్రారంభోత్సవం
Manchu Vishnu Statement: మోహన్ బాబు యూనివర్శిటీపై అదంతా దుష్ప్రచారమే, ఎవరూ ఆందోళన చెందొద్దు: మంచు విష్ణు
మోహన్ బాబు యూనివర్శిటీపై అదంతా దుష్ప్రచారమే: మంచు విష్ణు కీలక ప్రకటన
Telangana Congress News: అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ.. మంత్రుల మధ్య ముగిసిన వివాదం
అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ.. మంత్రుల మధ్య ముగిసిన వివాదం
Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపై టీడీపీ కీలక నిర్ణయం, తేల్చేసిన చంద్రబాబు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపై టీడీపీ కీలక నిర్ణయం, తేల్చేసిన చంద్రబాబు
Mohan Babu University: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దుకు ఏపీ ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు, అసలేం జరిగింది
మోహన్ బాబు యూనివర్సిటీ రద్దుకు ఏపీ ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు, అసలేం జరిగింది
Prithvi Shaw Viral Video: కట్టలు తెంచుకున్న పృథ్వీ షా కోపం, ఔటయ్యాక బౌలర్‌పై బ్యాట్ తో దాడికి షా యత్నం
కట్టలు తెంచుకున్న పృథ్వీ షా కోపం, ఔటయ్యాక బౌలర్‌పై బ్యాట్ తో దాడికి యత్నం
Mammootty: మమ్ముట్టి ఇంటిపై ఈడీ దాడులు... లగ్జరీ కార్స్ వివాదమా? కొత్త లోక విజయమా?
మమ్ముట్టి ఇంటిపై ఈడీ దాడులు... లగ్జరీ కార్స్ వివాదమా? కొత్త లోక విజయమా?
Mass Jathara Songs: 'మాస్ జాతర'లో మూడో పాట... 'హుడియో హుడియో' వచ్చేసిందండోయ్!
'మాస్ జాతర'లో మూడో పాట... 'హుడియో హుడియో' వచ్చేసిందండోయ్!
Embed widget