News
News
X

Revanth Reddy: చదువు చెప్పమంటే చంపుతున్నారు, కేసీఆర్ కక్ష కట్టారు: రేవంత్ రెడ్డి

బాసర ట్రిపుల్ ఐటీలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని, కిచెన్‌లో స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అన్నంలో పురుగులు వస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలో ప్రస్తుత విద్యా విధానం పట్ల రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. పిల్లలకు చదువు చెప్పమంటే ప్రభుత్వం పిల్లల్ని చంపుతోందని ఆరోపించారు. పేద పిల్లలు చదువుకుంటామంటే కేసీఆర్ ఎందుకు ఓర్చుకోలేరని విమర్శించారు. బాసర ట్రిపుల్ ఐటీలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని, కిచెన్‌లో స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. అన్నంలో పురుగులు వస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

‘‘చదువుల తల్లి నీడలో చావు కేకలు.
బాసరలో గోస పడుతున్న పేదల బిడ్డలు.

అన్నంలో పురుగులు.. కిచెన్ లో స్నానాలు..
అడుగడుగునా ఆంక్షలు.. సవాలక్ష సమస్యలు..

సరస్వతీ పుత్రులపై కక్షగట్టిన కేసీఆర్..
చదువు చెప్పమంటే చంపుతున్న సర్కారు..

పేద బిడ్డలు చదువుతుంటే ఓర్వలేవా కేసీఆర్?’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలపై ఛార్జ్ షీట్

టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ శనివారం ఛార్జ్ షీట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మునుగోడులో పర్యటించిన కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, నిర్వాసితుల ఆత్మహత్యలకు కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమే అని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో సమస్యలను పరిష్కరించాల్సింది పోయి కేవలం ఉప ఎన్నికలపైనే టీఆర్ఎస్, బీజేపీలు దృష్టి పెట్టాయని ఆరోపించారు. గొర్ల మందపై తోడేళ్లలా, మిడతల దండులా మునుగోడు ప్రజలపై దాడి చేయడానికి టీఆర్ఎస్, బీజేపీలు వస్తున్నాయన్నారు. సెప్టెంబర్ 17 నుంచి 2023 సెప్టెంబర్ 17 వరకు తెలంగాణ విమోచన వజ్రోత్సవాలు నిర్వహించాలని కాంగ్రెస్ తరఫున పిలుపునిస్తున్నానన్నారు. 

విమోచన వజ్రోత్సవాలు 
"తెలంగాణ పోరాట చరిత్రను దేశానికి చాటాల్సిన అవసరం ఉంది. వజ్రోత్సవాలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. కేంద్రం రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టి ఊరూరా వజ్రోత్సవాలు చేయాలి. కాంగ్రెస్ ను విమర్శించిన కేసీఆర్ ఎనిమిదేళ్లుగా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదన్నారు.  మీరు ఎవరికి లొంగిపోయారు, ఎవరి ముందు వంగిపోయారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించనందుకు కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి.  తెలంగాణ సమాజాన్ని నిజాం నుంచి విముక్తి కలిగించింది కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. చెప్పుకోవడానికి చరిత్ర లేనోళ్లు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు" - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు 

ఏ గ్రామానికైనా నిధులొచ్చాయా?
మునుగోడులో కాంగ్రెస్ ఓటు బ్యాంకు 97 వేల ఓట్లని రేవంత్ రెడ్డి అన్నారు. కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ ఓటు బ్యాంకును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.  రోజుకో రెండు గంటలు ఇంటింటికి తిరిగితే లక్ష ఓట్లు సాధిస్తామన్నారు. కాంగ్రెస్ ను ఓడించే శక్తి ఆ మోదీకి లేదన్నారు.  రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సర్వం అండగా నిలిస్తే.. ఇప్పుడు మోదీకి రూ.22 వేల కోట్లకు అమ్ముడుపోయారని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నికల వల్ల అమ్ముడు పోయే సన్నాసులకు నిధులు వచ్చాయి తప్ప.. నియోజక వర్గంలో ఏ గ్రామానికైనా నిధులొచ్చాయా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  కమ్యూనిస్టులను చూస్తే జాలేస్తుందన్నారు.  కమ్యూనిష్టు పార్టీలను బొందపెట్టిన టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు.  నాయకులు ఎక్కడికైనా పోనీ మునుగోడు కమ్యూనిస్టు కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. విలీన దినోత్సవం పేరుతో మత కల్లోలం సృష్టించాలని బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల్లో చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తోందన్నారు. ఒక్క ఓటుతో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలని కోరారు.

Published at : 04 Sep 2022 02:43 PM (IST) Tags: Basar RGUKT CM KCR Revanth reddy education system in telangana Revanth tweet

సంబంధిత కథనాలు

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

KNRUHS Final MBBS Results: ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

KNRUHS Final MBBS Results: ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!

కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం  - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి