అన్వేషించండి

KCR in Huzurnagar: సీఎం అవుతానని ఒక‌రు, బుడ్డెర‌ఖాన్ అని ఇంకోక‌రు వస్తారు - కాంగ్రెస్‌ నేతలపై కేసీఆర్ ఎద్దేవా

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. 

నేను ముఖ్యమంత్రి అయితా అని ఒక‌రు.. నేను బుడ్డెర‌ఖాన్ అయితా అని ఇంకోక‌డు.. కాంగ్రెస్ పార్టీలో ఆరాటపడేవాళ్లు ఎక్కువ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో డ‌జ‌న్ మంది ముఖ్యమంత్రులు అవ్వాలని కోరుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ న‌న్ను గెలిపిచండి నేను ముఖ్యమంత్రి అవుతా అంటున్నారని అన్నారు. అస‌లు కాంగ్రెస్ గెలిచే ప‌రిస్థితి లేదని కేసీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. 

కాంగ్రెస్ నేతలు ర‌కరకాల మాయ‌మాట‌లు చెప్పి గోల్ మాల్ చేసి ఓట్లు అడుగుతున్నారని అన్నారు. పార్టీల త‌ర‌పున నిల‌బ‌డే వ్యక్తుల‌నే కాదు.. ఆ పార్టీ తీరు తెన్నుల గురించి కూడా తెలుసుకోవాలని కేసీఆర్ సూచించారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుకున్నామని కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు, మంచి నీళ్ల కోసం అనేక క‌ష్టాలు ప‌డ్డామని చెప్పారు. ఇవాళ అన్ని స‌మ‌స్యల‌ను అధిగ‌మించుకున్నామని అన్నారు. 

దళిత బిడ్డలు ఏళ్ల తరబడి వివక్షకు గురవుతున్నారని కేసీఆర్ అన్నారు. ఓటు ప్రజల తలరాత, భవిష్యత్తును మార్చేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్రహ్మాండమైన ఆయుధం ఓటు అని చెప్పారు. రాజకీయ నాయకులు కళ్ల ముందు జరిగిన దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తారని.. ఏది నిజమో తెలుసుకున్న తర్వాతే ప్రజలు ఓటు వేయాలని అన్నారు. గిరిజ‌న తండాలను గ్రామ‌పంచాయ‌తీలుగా తీర్చిదిద్దుకుని.. వారి హ‌క్కుల‌ను కాపాడామని అన్నారు. హుజుర్‌ న‌గ‌ర్‌కు వారం ప‌ది రోజుల పాటు మ‌ళ్లీ సాగు నీళ్లు వదులుతామని కేసీఆర్ చెప్పారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.

1956లో తెలంగాణను ఏపీలో కలపాలని ప్రతిపాదన వచ్చినప్పుడు విద్యార్థులు, ఉద్యోగులు వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఇడ్లీ, సాంబారు గో బ్యాక్‌ ఉద్యమ సమయంలో కాల్పులు జరిగాయని అన్నారు. ఈ కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని.. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు కనీసం నోరు మెదపలేదని అన్నారు. వాళ్లు ఏనాడూ ప్రజల కోసం కొట్లాడలేదని చెప్పారు. వారికి పదవులు ఉంటే చాలని.. ప్రజలు ఏమై పోయినా పట్టించుకోరని విమర్శించారు. అసెంబ్లీలో కూడా గందరగోళం సృష్టించారని అన్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు ఏనాడూ నీళ్ల కోసం పోరాడలేదని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Embed widget