అన్వేషించండి

BJP MP Laxman: ఎమ్మెల్యేలకు ఎరలో బీజేపీ పాత్ర లేదు‌‌, పార్టీకేం సంబంధం లేదు: ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని, అందులో బీజేపీ పాత్ర ఎంత మాత్రమూ లేదని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. 

BJP MP Laxman: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి ఎవరమేది అధిష్టానమే నిర్ణయిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి సహా.. ఏ పదవిని తాను ఆశించటం లేదని వివరించారు. గెలుపు గుర్రాలకే అసెంబ్లీ టికెట్లు వస్తాయని... తాను పోటీ చేసేది లేనిదీ బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నికను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావించటం లేదన్నారు. అవినీతి చేయకుంటే కేసీఆర్ సర్కార్ జీవో 51ను ఎందుకు తీసుకొచ్చిందని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ కు ఓటు వేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లేనని పేర్కొన్నారు.

చేనేత.. 5శాతం జీఎస్టీపై మంత్రులు  హరీష్, కేటీఆర్ లు దొంగ నాటకాలాడుతున్నారంటూ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష పాత్ర పోషించటంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయిందని అన్నారు. ఇతర పార్టీల ద్వారా పొందిన పదవులకు రాజీనామా చేస్తేనే బీజేపీలో చేర్చుకుంటామన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం‌ వలనే.. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చారు. అలాగే జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలే మునుగోడులో పునరావృతం అవుతాయన్నారు. తెలంగాణ భవిష్యత్ కోసం మునుగోడులో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజలు బీజేపీ మద్దతు తెలుపుతున్నారన్నారు.  టీఆర్ఎస్ చేస్తున్న  గజకర్ణ, గోకర్ణ విద్యలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఓటమిని ముందుగానే తెలుసుకున్న టీఆర్ఎస్ అప్రజాస్వామిక పనులకు పాల్పడుతోందని ఆరోపించారు.  మునుగోడును కేటీఆర్ ఇప్పుడు దత్తత తీసుకోవడం దేనికని ప్రశ్నించారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంచేసిందని నిలదీశారు.  ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన ఒక్క హామీ కూడా  నెరవేర్చలేదన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో గట్టుప్పల్ మండలం వచ్చిందన్నారు. చర్లగూడెం భూ నిర్వాసితులకు డబ్బులు డిపాజిట్ చేశారని లక్ష్మణ్ తెలిపారు. మునుగోడులో కాంగ్రెస్ పోటీ కేవలం ఉనికి చాటుకోవడానికేనని స్పష్టం చేశారు.  టీఆర్ఎస్, కాంగ్రెస్‌  డూప్‌ ఫైట్‌ చేస్తున్నాయని ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. కాంగ్రెస్ కు పడ్డ ఓటు మూసీ  మురికిల పడ్డట్టే అన్నారు. 

నేడే ప్రచారం చివరి రోజు - అందరిలోనూ టెన్షన్ టెన్షన్

మునుగోడు ఉపఎన్నికల ప్రచారం చివరి రోజున పలిమెల గ్రామంలో టీఆర్ఎస్,  బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై పెద్ద ఎత్తున రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులకు కూడా గాయాలయ్యాయి.  పలివెల గ్రామంలో బీజేపీ నేతల క్యాంప్ ఉన్న దిశగా టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో.. బీజేపీ నేతలతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు కంట్రోల్ చేస్తున్నప్పటికీ ఎవరూ తగ్గలేదు. ఈ ఘర్షణ ముదిరి చివరికి దాడులకు కారణం అయింది.

ఉపఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకున్నాయి. చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో పార్టీల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యాలయాలు, వాహనాలపైనా  దాడులు చేశారు. ఇప్పుడు బీజేపీకి చెందిన వాహనాలపై రాళ్ల దాడి జరిగింది. దీంతో రాజకీయ పార్టీలు సహనం కోల్పోతున్నాయని... పోలింగ్ రోజున మరింత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగా ఈసీ చర్యలు తీసుకోనుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Mahindra Thar Roxx: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Mahindra Thar Roxx: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
New Zealand Parliament News : న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Embed widget