అన్వేషించండి

రైతుకు పొలంలో దొరికిన గుప్తనిధులు.. పూనకంతో ఊగిపోయిన మహిళ.. వాటా కావాలని వచ్చిన సోదరుడు.. చివరకు

ఓ వ్యక్తికి తన పొలంలో గుప్త నిధులు దొరికాయి. అయితే తనకూ వాటా కావాలని సోదరుడు రావడంతో విషయం బయటకు తెలిసింది.. చివరకు..

నల్లగొండ జిల్లా.. రామన్నపేట.. మండలంలోని కుంకుడుపాముల గ్రామంలో ఓ రైతు పొలం పనులు చేసుకుంటున్నాడు. అయితే పనిలో భాగంగా.. గట్లు తీస్తున్న సమయంలో.. మెుదట మట్టిపాత్ర దొరికింది. ఆ తర్వాత ఓ చిన్న ఇనుప పెట్టెసైతం దొరికింది. అప్పటికే ఏదో ఉంది అందులో అనే ఆత్రుత మెుదలైంది రైతుకు. ఆ పక్కనే తన సోదరుడి పొలం ఉంది. వాళ్లు ఉన్నది పట్టించుకోకుండా.. వాటిని తెరిచాడు ఆ రైతు.

మట్టిపాత్రలో 38 వెండి నాణేలు, 5 వెండి పట్టీలు కనిపించాయి. విరిగిపోయిన 14 వెండి రింగులు కూడా ఉన్నాయి. ఇక ఇనుప పెట్టే తెరిచి చూసేసరికి.. అందులో.. 19 బంగారు బిళ్లలు, ఐదు చిన్నచిన్న బంగారు గుండ్లు కనిపించాయి. అయితే అందులో దొరికిన వెండి నాణేలపై.. ఉర్దూ పదాలు రాసి ఉన్నాయి. ఆ రైతు సోదరుడి పొలంలోకి పనికి వచ్చిన కొంత మంది మహిళలు.. నాణేలను తలా ఒకటి తీసుకున్నారు.  ఈ సమయంలో ఓ మహిళ.. తనకు పూనకం వచ్చినట్టు ఊగి.. వాటిని ముట్టుకోవద్దని హెచ్చరించింది. వాటిని తీసుకుంటే... మంచిది కాదని చెప్పింది. దీంతో భయపడిన మహిళలు.. వాటిని అక్కడే వదిలేశారు. 

పొలంలో దొరికిన వాటిని ఆ రైతు తీసుకెళ్లి.. పెంటకుప్పలో పెట్టాడు. ఈ విషయం తెలిసిన రైతు సోదరుడు వచ్చి.. గట్టుపై దొరికింది కాబట్టి.. తనకూ వాటా కావాలని చెప్పాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ మెుదలైంది. విషయం ఆ ఊరి పెద్ద వరకు వెళ్లింది.  సమానంగా పంచుకుంటే.. ఇద్దరికీ మంచిదని .. పెద్దమనిషి సూచించాడు. అయినా.. ఈ గుప్త నిధులపై సమస్య పోలేదు. గొడవలు ఇంకా ఎక్కువ అవ్వడం మెుదలయ్యాయి. దీంతో చేసేదేమీ లేక.. తనకు పొలంలో దొరికిన గుప్త నిధులను తీసుకెళ్లి రామన్నపేట పోలీసులకు అప్పజెప్పాడు ఆ రైతు. గుప్తనిధి వివరాలను రెవెన్యూ అధికారులకు అందించామని పోలీసులు తెలిపారు.

Also Read: Nizamabad News: సన్‌ఫ్లవర్‌ విత్తనాలు బ్లాక్‌లో అమ్ముతున్నారు... తెలంగాణ మంత్రిపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

Also Read: Hyderabad Traffic: రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు... ఫ్లైఓవర్లు మూసివేత, ఓఆర్ఆర్ పై కార్లకు నో ఎంట్రీ... ఆంక్షలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు

Also Read: Omicron in Telangana: కొద్దిరోజుల్లో TSలో తార స్థాయికి ఒమిక్రాన్.. 90 శాతం మందికి లక్షణాల్లేవు: డీహెచ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Importance Of Voter List Verification: ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
Breaking News: టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్- తప్పుల సవరణలో కీలక అప్‌డేట్‌!
టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్- తప్పుల సవరణలో కీలక అప్‌డేట్‌!
KTR Vs Revanth Reddy Debate 2026: డేట్, టైం, ప్లేస్ పాలిటిక్స్ - కేటీఆర్ వర్సెస్ రేవంత్ సర్కార్.. ఈ సవాళ్లు నిజంగానే చర్చ వరకు వెళ్తాయా?
డేట్, టైం, ప్లేస్ పాలిటిక్స్ - కేటీఆర్ వర్సెస్ రేవంత్ సర్కార్.. ఈ సవాళ్లు నిజంగానే చర్చ వరకు వెళ్తాయా?
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Nara Lokesh: జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
Gujarat High Court Hindu Marriage: ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
IND vs ENG 1st T20 Highlights: వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్! 
వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్! 
Cylinders Prices Reduced: గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లతో పోలిస్తే వాణిజ్య సిలిండర్లు ఎందుకు ఖరీదు ఎక్కువగా ఉంటాయి? ధరలు ఎలా నిర్ణయిస్తారు? 
గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లతో పోలిస్తే వాణిజ్య సిలిండర్లు ఎందుకు ఖరీదు ఎక్కువగా ఉంటాయి? ధరలు ఎలా నిర్ణయిస్తారు? 
Tata Sierra EV Variants 2026: టాటా సియారా EVలోని మంచి ఫీచర్లు ఉన్న వేరియంట్ ఏది? కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
టాటా సియారా EVలోని మంచి ఫీచర్లు ఉన్న వేరియంట్ ఏది? కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
Jagannath Rath Yatra 2026: పూరి జగన్నాథ ఆలయంలో ఫ్రెంచ్ గంట - 200 సంవత్సరాల క్రితం సముద్రంలో జరిగిన అద్భుతం!
పూరి జగన్నాథ ఆలయంలో ఫ్రెంచ్ గంట - 200 సంవత్సరాల క్రితం సముద్రంలో జరిగిన అద్భుతం!
Embed widget