Nizamabad News: సన్‌ఫ్లవర్ విత్తనాలు బ్లాక్‌లో అమ్ముతున్నారు... తెలంగాణ మంత్రిపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
ఎప్పటి నుంచో డీఎస్ పార్టీ మారుతారన్న చర్చే తప్ప ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. దీనిపై బీజేపీ అరవింద్ కూడా స్పందించారు.
తెలంగాణపై స్పెషల్‌ఫోకస్ పెట్టిన బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. స్థానికంగా ఉన్న సమస్యలు వెలుగులోకి తీసుకొస్తూనే.. వాటిని పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు చేస్తోంది. ఈ లైన్‌తోనే జనాల్లోకి వెళ్లి ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో కాషాయ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా జిల్లాల్లో ఆయా లీడర్లు ప్రత్యేక దృష్టి పెట్టారు.
బీజేపీ ప్లాన్‌లో భాగంగా నిజామాబాద్ బాధ్యతలు చూస్తున్న ఎంపీ అరవింద్ లోకల్‌గా బలపడే మార్గాలు అన్వేషిస్తున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు తెరపైకి తీసుకొస్తున్నారు. అందుకే ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ చేశారు ఎంపీ అరవింద్. లేకుంటే తీవ్ర ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు ఎంపీ అరవింద్. వరి వేయొద్దని చెప్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు ఎందుకు సూచించడం లేదని ప్రశ్నిస్తున్నారు. సన్‌ప్లవర్ విత్తనాలను బ్లాక్‌లో మంత్రి అమ్ముకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
తండ్రి డీ శ్రీనివాస్ పార్టీ మార్పుపై కూడా ఎంపీ అరవింద్ స్పందించారు. ఆయన బిజెపిలోకి వస్తే సంతొషమేనన్నారు. ఆయన ఎక్కడ ఉన్నా తనపై ఆశీర్వాదం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయన ఏ పార్టీలోకి వెళ్తారన్న విషయంపై త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారాయన.
తెలంగాణ పై బిజెపి పోకస్ పూర్తి స్థాయిలో ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ప్రణాళికాబద్దంగా గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేటానికి చర్యలు మొదలయ్యాయని అన్నారు.
పార్టీ గాలులు పక్కనపెడితే
అభ్యర్థిపరంగా చూస్తే జీవన్ రెడ్డి లాంటి వారికి ఓటేసినప్పుడు ఇంకెవరికైనా ఓటేస్తారని అన్నారు ఎంపీ అరవింద్. జీవన్‌రెడ్డితోపాటు అతని సంబంధీకుల వాట్సప్ నంబర్లను బ్లాక్ చేయాలని బిజెపి తీర్మానం చేసిందని చెప్పారు అరవింద్. చెరకు ఫ్యాక్టరీలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇథనాల్ ఫాక్టరీలు పెట్టాలని చాలా మంది సిద్దంగా ఉన్నా కెసిఆర్ వల్ల వెనక్కిపోతున్నారని అన్నారు. షుగర్ ఫాక్టరీలు తెరుస్తారా... పూర్తిగా మూస్తారా అనే విషయంలోసంక్రాంతిలోపు నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు అరవింద్. ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు ప్రత్యామ్నాయ పంటల గురించి క్లారిటీ ఇవ్వలేదని ఆరోపించారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొంటామని కేంద్రం ఇంతకు ముందే రాష్ట్రానికి ఎంఓయు ఒప్పందం రాసి ఇచ్చిందని తెలిపారు.
బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి రాసిచ్చి ఎంత కొంటారని రాష్ట్ర మంత్రులు అర్థం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు ఎంపీ అరవింద్. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం జాతీయ విధానాన్ని అవలంభిస్తుందని దాని ప్రకారమే ధాన్యం కొంటుందని చెప్పారు. రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చినా కొనుగోలు చేస్తామని సిఎం కెసిఆర్ అసెంబ్లీలో ఏ స్థితిలో చెప్పారని ప్రశ్నించారు ఎంపీ.
మిగులు ఆదాయం ఉన్న డిసిసిబికి 250 కోట్ల అప్పులెలా అయ్యాయో స్పీకర్ పోచారం, డిసిసిబి ఛైర్మెన్ భాస్కర్ రెడ్డి లెక్కలు చెప్పాలని డీమాండ్ చేశారు అరవింద్. సంక్రాంతిలోపు చెప్పకుంటే బాన్స్‌వాడ నుంచి ఉద్యమం ప్రారంబిస్తామని చెప్పారు. జిల్లాలో చెరకు పంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రకటించారు. జిల్లాకు మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసింది శూన్యం అని అన్నారు ఎంపీ అరవింద్.
Also Read: Hyderabad: మీరు అపార్ట్‌మెంట్లలో ఉంటారా? ఈ సౌకర్యం ఫ్రీగా పొందండి.. ఇంకా రెండు రోజులే ఛాన్స్
Also Read: Khammam Politics 2021: ఒడిదుడుకుల కారు పయనం.. ప్రతిపక్షాలకు చిక్కని ఖమ్మం జిల్లా ప్రజల నాడి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి