Hyderabad Traffic: రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు... ఫ్లైఓవర్లు మూసివేత, ఓఆర్ఆర్ పై కార్లకు నో ఎంట్రీ... ఆంక్షలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రజలకు సూచించారు. హైదరాబాద్ పరిధిలో డిసెంబర్ 31 రాత్రి 10 నుంచి జనవరి 1 ఉదయం 5 వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

FOLLOW US: 

కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మహేందర్‌రెడ్డి... కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆంక్షలు జనవరి 2వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. కోవిడ్‌ నిబంధనలు అమలుచేయాలని జిల్లా అధికారులకు డీజీపీ ఆదేశాలిచ్చారు. పబ్ లు, ఈవెంట్లలలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సూచనలు పోలీస్‌శాఖ కఠినంగా అమలు చేస్తుందని డీజీపీ తెలిపారు. 

Also Read:  కొద్దిరోజుల్లో TSలో తార స్థాయికి ఒమిక్రాన్.. 90 శాతం మందికి లక్షణాల్లేవు: డీహెచ్

హైదరాబాద్ నగరంలో ఆంక్షలు

న్యూ ఇయ‌ర్ వేడుక‌ల నేప‌థ్యంలో హైదరాబాద్ లోని మూడు పోలీస్ క‌మిష‌న‌రేట్ ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షల‌ను విధించారు. డిసెంబ‌ర్ 31వ తేదీ రాత్రి 10 గంట‌ల నుంచి జ‌న‌వ‌రి 1వ తేదీ ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్షలు అమ‌ల్లో ఉంటాయి. హైదరాబాద్ లోని సైబ‌ర్ ట‌వ‌ర్స్ ఫ్లై ఓవ‌ర్, గ‌చ్చిబౌలి బ‌యో డైవ‌ర్సిటీ, మైండ్ స్పేస్, ఫోరం మాల్, జేఎన్టీయూ, దుర్గం చెరువు బ్రిడ్జి, బీజేఆర్, బేగంపేట‌, ప్యార‌డైజ్, ప్యాట్నీ, తెలుగు త‌ల్లీ, నారాయ‌ణ‌గూడ‌, బ‌షీర్‌బాగ్, ఎల్బీన‌గ‌ర్‌, మ‌ల‌క్‌పేట‌, నెక్లెస్ రోడ్డు, మెహదీప‌ట్నం, పంజాగుట్ట ఫ్లై ఓవ‌ర్లతో పాటు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మూసివేస్తామని ప్రకటించారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే వారు టికెట్లు చూపిస్తే ఎక్స్‌ప్రెస్ వేపైకి అనుమ‌తిస్తారన్నారు. 

Also Read: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారా ? ఇదిగో ఈ రూల్స్ అన్నింటినీ గుర్తు పెట్టుకోండి..

రాచకొండ పరిధిలో

రాచకొండ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ప్రజలు ఇళ్లలోనే వేడుకలు చేసుకోవాలని పోలీసులు సూచించారు. డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఓఆర్‌ఆర్‌పై కార్లకు అనుమతి లేదని పేర్కొన్నారు. కేవలం లారీలు, ట్రాన్స్ పోర్టు వాహనాలను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఓఆర్‌ఆర్‌ మీదుగా ఎయిర్ పోర్టుకు వెళ్లేవారు టికెట్‌ చూపించి ప్రయాణించవచ్చని తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని అన్ని ఫ్లైఓవర్లను డిసెంబర్‌ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకూ మూసివేస్తామని ప్రకటించారు.  బార్లు, పబ్‌లు, క్లబ్‌ల నుంచి బయటకు వచ్చిన కస్టమర్లు డ్రంకన్ డ్రైవ్ చేయకుండా పూర్తి బాధ్యత యజమానులదేనని రాచకొండ పోలీసులు తెలిపారు. వీరి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటులు చేయాలని సూచించారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో డీజేలకు అనుమతి లేదన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే కేసుతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తామని పోలీసులు వెల్లడించారు. 

Also Read: హైవేపై కుప్పలుతెప్పలుగా కొత్త కరెన్సీ నోట్లు కలకలం.. అవాక్కయిన స్థానికులు, ఏం జరిగిందంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 30 Dec 2021 05:22 PM (IST) Tags: Hyderabad Traffic restrictions New Year 2022 Hyderabad new year Covid protocol

సంబంధిత కథనాలు

BJP Leaders In TRS :  బీజేపీకి ముందుగానే షాక్ - నలుగురు హైదరాబాద్ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ కండువా !

BJP Leaders In TRS : బీజేపీకి ముందుగానే షాక్ - నలుగురు హైదరాబాద్ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ కండువా !

Khammam Politics : ఖమ్మంలో ఎవరి టైమ్ బాగుందో? నేతల ఫొటోలతో గోడగడియారాల పంపిణీ

Khammam Politics : ఖమ్మంలో ఎవరి టైమ్ బాగుందో? నేతల ఫొటోలతో గోడగడియారాల పంపిణీ

Konda Vishweshwar Reddy : అవును బీజేపీలో చేరుతున్నాను- సస్పెన్ష్‌కు తెర దించిన కొండా విశ్వేశ్వరరెడ్డి

Konda Vishweshwar Reddy : అవును బీజేపీలో చేరుతున్నాను- సస్పెన్ష్‌కు తెర దించిన కొండా విశ్వేశ్వరరెడ్డి

Minister KTR : ఐటీ రంగంలో హైదరాబాద్ మేటీ, ఆరు నెలలే రాజకీయాలపై దృష్టి- మంత్రి కేటీఆర్

Minister KTR : ఐటీ రంగంలో హైదరాబాద్ మేటీ, ఆరు నెలలే రాజకీయాలపై దృష్టి- మంత్రి కేటీఆర్

BJP TRS Flexi Fight : బీజేపీ-టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్, ప్రధాని పర్యటన వేళ ముదిరిన వివాదం

BJP TRS Flexi Fight : బీజేపీ-టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్, ప్రధాని పర్యటన వేళ ముదిరిన వివాదం

టాప్ స్టోరీస్

GPF Money Moved To Pensions : ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ములు సామాజిక పెన్షన్లకు మళ్లించారా ?

GPF Money Moved To Pensions : ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ములు సామాజిక పెన్షన్లకు మళ్లించారా ?

IND Vs ENG Squads: ఇంగ్లండ్ వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!

IND Vs ENG Squads: ఇంగ్లండ్ వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!

Eknath Shinde: 'ఉద్ధవ్ ఠాక్రేకు ఎన్నో సార్లు చెప్పాను- ఆయన సైనికుడ్ని భాజపా సీఎం చేస్తుంది'

Eknath Shinde: 'ఉద్ధవ్ ఠాక్రేకు ఎన్నో సార్లు చెప్పాను- ఆయన సైనికుడ్ని భాజపా సీఎం చేస్తుంది'

AP Weekly Five Days : వారానికి ఐదు రోజులే పని - మరో ఏడాది పొడిగించిన ఏపీ ప్రభుత్వం !

AP Weekly Five Days : వారానికి ఐదు రోజులే పని - మరో ఏడాది పొడిగించిన ఏపీ ప్రభుత్వం !