అన్వేషించండి

KTR News: ఇది ముమ్మాటికీ రాజకీయ హత్య! బీఆర్ఎస్ హయాంలో ఒక్కటీ జరగలేదన్న కేటీఆర్

BRS Working President KTR: నాగర్‌కర్నూల్ జిల్లాలో హత్యకు గురైన బీఆర్ఎస్ నేత మల్లేష్ యాదవ్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. మల్లేష్ భార్యకు రూ.5 లక్షల చెక్ అందజేశారు. ఇది రాజకీయ హత్య అని ఆరోపించారు.

BRS Activist Murder News: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావ్ పల్లి గ్రామంలో హత్యకు గురైన మాజీ సైనికుడు, బీఆర్ఎస్ నేత మల్లేష్ యాదవ్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్త మల్లేశ్‌ హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (BRS Working President KTR) డిమాండ్‌ చేశారు. హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త మల్లేశ్‌ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును కేటీఆర్ అందజేశారు. మల్లేశ్ పిల్లల చదువులు, భవిష్యత్తుకి హామీ ఇచ్చారు. రాజకీయ హత్యని, భూ వివాద హత్యగా చిత్రీకరించకుండా కుటుంబానికి న్యాయం చెయ్యాలని పోలీసులను కేటీఆర్ కోరారు. 

KTR News: ఇది ముమ్మాటికీ రాజకీయ హత్య! బీఆర్ఎస్ హయాంలో ఒక్కటీ జరగలేదన్న కేటీఆర్

తెలంగాణలో తొలి రాజకీయ హత్య.. 
అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మల్లేశ్ గతంలో భారత ఆర్మీలో జవాన్ గా సేవలు అందించారు. రాష్ట్రంలో పరిస్థితుల కారణంగా కేసీఆర్ సీఎం కావాలని, హర్షవర్ధన్ ఎమ్మెల్యే కావాలని పార్టీ మద్దతుదారుడు మల్లేశ్ భావించి బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేశారు. హర్షవర్ధన్ నాయకత్వాన్ని బలపరుస్తూ మల్లేశ్ ఎంతగానో శ్రమించారు. కానీ ఇక్కడ, రాష్ట్రంలో బీఆర్ఎస్ దురదృష్టవశాత్తూ ఓడిపోయింది. తెలంగాణలో గతంలో ఎన్నికల్లో ఎన్నడూ లేనట్లుగా హింసాత్మక పరిస్థితి నెలకొందన్నారు. మల్లేశ్ ది తెలంగాణలో తొలి రాజకీయ హత్య అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సైతం ఈ విషయం తెలిసి చలించిపోయారని.. పార్టీ తరఫున ఆయన కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేశామన్నారు. మల్లేశ్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, ఆయన పిల్లల భవిష్యత్తును హామీ ఇచ్చారు.

గెలుపోటములు సహజమని స్థానిక మంత్రికి సూచన.. 
రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు. ఈరోజు మీరు గెలిస్తే, రేపు తాము విజయం సాధించవచ్చునని పేర్కొన్నారు. నేతలు, పార్టీల మధ్య పోరాటం, వివాదాలు ఉండవచ్చు.. కానీ మధ్యలో కార్యకర్తల్ని బలి పశువులు చేయకూడదని కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో ఏనాడూ తాము భౌతిక దాడులకు పాల్పడలేదని, ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచాలని తాము భావించలేదన్నారు. కనుక రాజకీయాల కోసం ఏ వ్యక్తిని హత్య చేయడం మంచిది కాదన్నారు. ప్రభుత్వంలో ఎవరున్నా సరే హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ పోలీసులను కోరారు.

కాల్ డేటా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రత్యక్షంగా విచారణ జరిపించి డీజీపీ ఈ కేసులో నిజాలను బయటపెట్టాలని కోరారు. మల్లేశ్ భార్యకు ఉపాధి కల్పించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా కార్యకర్తల కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. ఏ ఎజెండా లేకుండా అన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలని మీడియాను కోరారు. నిజాలు బహిర్గతం చేసేందుకు మీడియా కీలక పాత్ర పోషించాలన్నారు. వ్యక్తి చనిపోయే, వారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని.. ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, జిల్లా ఎస్పీ న్యాయం చేయాలని కోరారు. మల్లేశ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కుటుంబానికి తాము అండగా నిలుస్తామన్నారు కేటీఆర్.

Also Read: కేసీఆర్ రీ ఎంట్రీ అప్పుడేనా? - తెలంగాణ భవన్ వేదికగానే కార్యకలాపాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget