By: ABP Desam | Updated at : 24 Sep 2023 05:42 PM (IST)
Minister Sabita Indra Reddy opened a market complex in Kandukur and bought vegetables
ఒక మంత్రి.. సామాన్యురాలిగా షాపింగ్ కు వస్తే... పక్కనే కూర్చుని కబుర్లు చెప్తే... షాపులో వస్తువులు స్వయంగా కొంటే... ఆ షాపులో వాళ్లు ఎలా ఫీలవుతారు..? రంగారెడ్డి కూడా కందుకూరులో ఇదే జరిగింది. కందుకూరు మార్కెట్ సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి... కాసేపు మార్కెట్ అంతా తిరిగి చూశారు. ఆ తర్వాత జడ్పీ చైర్‌పర్సన్ అనితతో కలిసి కూరగాయలు అమ్మే మహిళ దగ్గరకు వెళ్లి... ఆమెను ఆప్యాయంగా పలకరించారు. పక్కనే కూర్చొ.. కురగాయాలు కొనుగోలు చేశారు. బేరమాడి... కాకరగాయాలు, ఆకుకూరలు తీసుకున్నారు.
ఒక మంత్రి స్వయంగా తన షాపుకు వచ్చి కూరగాయాలు కొనడంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కూరగాయాలు తూకం వేస్తూ... సంబరపడిపోయింది ఆ మహిళ. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక సామాన్య మహిళగా... కూరగాయాలు అమ్మే మహిళ పక్కనే కూర్చుని... చేతులు కలిపి మరీ మాట్లాడారు. దీంతో సబితమ్మ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది కూరగయాలు అమ్మే మహిళ. తమ కోసం ఒక మంచి మార్కెట్ నిర్మించినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఈమెతోనే కాదు.. మార్కెట్ మొత్తం తిరుగుతూ కూరగాయల వ్యాపారం చేసే మహిలందరితో ఆప్యాయంగా మాట్లాడారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
కందుకూరు మార్కెట్ సముదాయమేకాదు... పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కందుకూరు, చిన్న రోడ్డు నుంచి ఫార్మాసిటీ వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కందుకూరు, కొత్తగూడ గ్రామాలకు చెందిన 300మంది నిరుపేదలకు ఇంటి స్థలాల సర్టిఫికెట్లను జడ్పీ చైర్‌పర్సన్ అనితతో కలిసి అందజేశారు. 9ఏళ్లలో కందుకూరు, మహేశ్వరం, మండలాలతో పాటు నియోజకవర్గం పరిధిలోని అర్బన్ ప్రాంతాల్లో శరవేగంగా అభివృద్ధి జరిగిందన్నారు సబితారెడ్డి. రంగారెడ్డి జిల్లాపై సీఎం కేసీఆర్ ఎంతో అభిమానం ఉందని.. అందుకే దాసర్లపల్లి గేటు వరకు మెట్రో రైలు సౌకర్యం కల్పించడానికి నిధులు కూడా మంజూరు చేశారని చెప్పారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేస్తోందని చెప్పారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తమ పార్టీపై ప్రజలు చూపిస్తున్న ఆధరణను తట్టుకోలేక ప్రతిపక్షాలు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చివరగా... కందుకూరులో కుమ్మరి సంఘం ఏర్పాటు చేసిన కవయిత్రి మొల్ల విగ్రహాన్ని జడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు మంత్రి సబితారెడ్డి. కవయిత్రి మొల్ల చేసిన సేవలు మరుపురానివని అన్నారు. రామాయణాన్ని తెలుగులో అనువదించిన తొలి మహిళ ఆమె అని చెప్పారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
Kishan Reddy on Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ పై కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలా! క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి
Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
RS Praveen Kumar: 'మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీకి పెను భారం' - ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్న బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
MLA Yashaswini Reddy Dance Video: విజయోత్సవ ర్యాలీలో స్టెప్పులేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వీడియో వైరల్
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
/body>