By: ABP Desam | Updated at : 05 Jan 2022 07:26 PM (IST)
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై మంత్రి కేటీఆర్ రివ్యూ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సమిష్టగా కృషి చేద్దామని పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఈ రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మరియు వివిధ విభాగాలకు చెందిన శాఖాధిపతులతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల ప్రక్రియపైన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని సాధించేందుకు మంత్రి కేటీఆర్.. వివిధ శాఖలకు సంబంధించిన సంస్కరణలు, సన్నాహక ప్రక్రియపైన దిశానిర్దేశం చేశారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో సీఎం కేసీఆర్ మార్గదర్శనం, ప్రభుత్వ శాఖాధిపతుల కృషివలన అగ్రస్థానంలో నిలిచామని కేటీఆర్ అన్నారు. ఈసారి ర్యాంకుల్లో సైతం అగ్రస్థానంలో నిలిచేందుకు కృషి చేద్దామని చెప్పారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ అంశాల్లో 100% సంస్కరణలు, చర్యలు పూర్తయ్యాయని ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలిపారు.
వచ్చే ర్యాంకులను నిర్దేశించే యూజర్ ఫీడ్ బ్యాక్ అత్యంత కీలకమైన అంశమని పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు. వివిధ శాఖలకు సంబంధించిన సేవలు పొందుతున్న పారిశ్రామిక వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక ఫీడ్ బ్యాక్ తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై.. ఇక్కడి అధికారులు చొరవ తీసుకోవడం కారణంగా.. రాష్ట్రానికి అనేక పెట్టుబడులు విజయవంతంగా వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. తద్వారా ఇక్కడ అద్భుతమైన ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో దక్కించుకోవడం ఎంతో దోహదకారిగా నిలిచిందన్నారు. ఈసారి సైతం అగ్రస్థానం సాధించుకునేందుకు మనమంతా కలిసి ప్రయత్నం చేద్దామని కేటీఆర్ అన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల కోసం పనిచేయడం కేవలం పరిశ్రమల శాఖ కోసం పని చేయడం మాత్రమే కాదని, తమ తమ శాఖలు విభాగాలను బలోపేతం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం అని కేటీఆర్ చెప్పారు. తమ విభాగాలను బలోపేతం చేసుకుంటూనే మనమంతా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం పని చేస్తున్నామనే స్ఫూర్తితో పని చేస్తే ర్యాంకుల్లో మరోసారి అగ్ర స్థానం దక్కడం ఖాయమని దిశానిర్దేశం చేశారు.
వివిధ శాఖలకు సంబంధించిన 300కు పైగా సంస్కరణలు, చర్యలు పూర్తి అయ్యాయని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఆయా శాఖల వారీగా మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించి సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో లో వివిధ శాఖల విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
Also Read: KTR On Nadda : బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ.. జేపీ నడ్డా అబద్దాలకు అడ్డా అని కేటీఆర్ విమర్శ !
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Kishan Reddy On TRS: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పెట్టుబడులు కేంద్రం ఘనతే- ప్రజలు గమనిస్తున్నారన్న కిషన రెడ్డి
Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు
Breaking News Live Updates: బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు, కేఏ పాల్ ఫైర్
KTR Davos Tour : దావోస్ సదస్సు ద్వారా తెలంగాణకు రూ. 4200 కోట్ల పెట్టుబడులు - చివరి రోజూ కేటీఆర్ బిజీ మీటింగ్స్ !
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?
AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !