By: ABP Desam | Updated at : 05 Jan 2022 04:54 PM (IST)
Cryptocurrency_price_today
Cryptocurrency Prices Today, 05 January 2022: క్రిప్టో మార్కెట్లలో బుధవారమూ జోష్ కనిపించడం లేదు. మదుపర్లు కొనుగోళ్లు చేపట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 0.27 శాతం పెరిగి రూ.37.35 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.65.36 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 0.72 శాతం పెరిగి రూ.3,05,383 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.33.83 లక్షల కోట్లుగా ఉంది.
బైనాన్స్ కాయిన్ 0.09 శాతం పెరిగి రూ.41,181, టెథెర్ 0.07 శాతం పెరిగి రూ.80.09, సొలానా 0.18 శాతం పెరిగి రూ.13,632, కర్డానో 1.01 శాతం పెరిగి రూ.108, యూఎస్‌డీ కాయిన్ 0.08 శాతం పెరిగి 80.06 వద్ద కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్ కో, లైవ్‌పీర్, ది గ్రాఫ్, చైన్ లింక్, ఫెచ్ ఏఐ, ఠీటా నెట్‌వర్క్, ఎల్‌రాండ్ 6 నుంచి 18 శాతం వరకు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పవర్ లెడ్జ్, యార్న్ ఫైనాన్స్, ఆవె, అయిలెఫ్, కర్వ్ డావో, పాలీగాన్, డీఎఫ్‌ఐ మనీ 2 నుంచి 7 శాతం వరకు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Delhivery Listing Price: డెల్హీవరీ లిస్టింగ్ ప్రీమియం తక్కువే! ముగింపులో రూ.49 లాభం
Stock Market News: ఆరంభ లాభాలు ఆవిరి! రేంజ్బౌండ్లో కదలాడిన సూచీలు చివరికి..!
Cryptocurrency Prices Today: భారీ నష్టాల్లో క్రిప్టోలు! బిట్‌కాయిన్ @ రూ.24.20 లక్షలు
Petrol-Diesel Price, 24 May: వాహనదారులకు షాక్! నేడు మళ్లీ పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ మాత్రమే తగ్గుదల
Gold-Silver Price: స్వల్పంగా ఎగబాకిన బంగారం ధరలు, నేటి ధరలు ఇవీ - వెండి కూడా నేడు పైపైకి
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరపై..!