News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం, ఎందుకంత కడుపు మంట? - మంత్రి ఇంద్రకరణ్

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో నిర్మల్ రూరల్ మండలం న్యూ పోచంపాడు గ్రామంలోని రైతువేదికలో సమావేశం అయ్యారు.

FOLLOW US: 
Share:

వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతానానికి నిదర్శనం అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం (జూలై 18) మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో నిర్మల్ రూరల్ మండలం న్యూ పోచంపాడు గ్రామంలోని రైతువేదికలో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ మాట్లాడుతూ.. వ్యవసాయానికి కరెంట్ ఇస్తలేరు అని రైతులు ఏమైనా ఫిర్యాదు చేశారా? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి లాంటి వారికి వ్యవసాయం అంటే తెలుసా ఆయన ఏనాడైనా వ్యవసాయం చేశాడని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఏనాడైనా 24 గంటల ఉచిత నిరంతర విద్యుత్ ని ఇచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మళ్ళీ అంధకారంలోకి నెట్టాలని చూస్తున్నదని, వారి పాలనలో ఏనాడు పగటిపూట కరెంటు ఉండేది కాదని రాత్రిపూట రైతులు పంటపొలాల వద్ద జాగారం చేసే పరిస్థితి ఉండేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి  సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్ తో ఇస్తుండటంతో రైతులు మూడు పంటలు పండిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రైతు రాజ్యం అంటే కేవలం మాటల్లోనే కాక దాన్ని చేతల్లో చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో అన్నదాతలు సంతోషంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని,  రైతులందరూ బాగుంటే రేవంత్ రెడ్డి లాంటి వారు పరేషాన్ లో ఉన్నారని  ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ రైతులను రాజకీయ ఓటు బ్యాంకుగా చూసిందే తప్ప ఏనాడు వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేయలేదని కాంగ్రెస్ తీరును ఎత్తిచూపారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణలో కేంద్రం చేతులెత్తితే సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలిచి కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారన్నారని పేర్కొన్నారు.

 రైతుబంధు, రైతు బీమా పథకాలతో రైతులను ఆదుకుంటుంటే కాంగ్రెస్ ఇలాంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు? రాష్ట్రంలో  రైతులు మూడు గంటల కరెంటు కావాలా? మూడు పంటల బీఆర్ఎస్ పార్టీ కావాలో తేల్చుకొవాలని కోరారు. రైతు వ్యతిరేఖ కాంగ్రెస్ పార్టీని  వచ్చే ఎన్నికల్లో పాతాళంలో పాతిపెట్టాలని సూచించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు. ఆనంతరం రాష్ట్ర సర్కారు వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని, 3 గంటలు వద్దు 3 పంటలు కావాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రైతుల హర్షద్వానాల మధ్య ఆమోదించారు.

Also Read: ఎన్నికల వరకూ పసీసీ చీఫ్‌గా రేవంత్ ఉంటే వంద సీట్లొస్తాయి - ఈ నమ్మకం కాంగ్రెస్‌ది కాదు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేది!

Published at : 18 Jul 2023 04:55 PM (IST) Tags: TPCC Revanth Reddy BRS News Indrakaran reddy free power in telangana

ఇవి కూడా చూడండి

Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు వేసిన లోకేష్‌- ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు వేసిన లోకేష్‌- ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

TS DEECET: డీఎడ్ కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం, ఆందోళనలో అభ్యర్థులు

TS DEECET: డీఎడ్ కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం, ఆందోళనలో అభ్యర్థులు

వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు

వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు

PM Modi tour: ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌-వచ్చే వారం మూడు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన

PM Modi tour: ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌-వచ్చే వారం మూడు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన

పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన

పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన

టాప్ స్టోరీస్

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు- చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్

Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు-  చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?