అన్వేషించండి

KTR : కొత్తగూడెంలో మళ్లీ పోడు భూముల వివాదం - మహిళల దుస్తులు చించేశారని ఆరోపణలు - కేటీఆర్ తీవ్ర స్పందన

Podu Lands: కొత్తగూడంలో పోడు భూముల విషయంలో తీవ్ర దుమారం రేగింది. అటవీ అధికారులు మహిళల దుస్తులను చించేశారని కేటీఆర్ ఆరోపించారు.


Kottagudem Lands : తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం ఎరవెండి గ్రామంలో  పోడుభూముల వివాదం చెలరేగింది.  అటవీ  శాఖ అధికారులు మహిళల బట్టలు చింపాని.., వారిపై దాడి కూడా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.  ఆదివాసీలు తమ 30 ఏళ్ల నాటి పొడు   భూమిని సాగు చేసుకుంటున్నారు. అయితే దాన్ని స్వాధీనం  చేసుకునేందుకు  అటవీ అధికారులు ప్రయత్నించారు. 

అటవీ అధికారులు  JCB యంత్రాన్ని తీసుకొచ్చి భూమిలో పంటల్ని తొలగించేందుకు ప్రయత్నించారు.  దీనికి ఆదివాసీలు నిరసన తెలపారు. అడ్డుకునే ప్రయత్నంచేశారు.  అధికారులు వారికి దౌర్జన్యంగా వ్యవహరించి, మహిళలపై దాడి చేశారు. కొందరి మహిళల బట్టలు కూడా చింపారన్న ఆరోపణలువస్తున్నాయి. తమ బట్టలు చింపారని ఆదివాసీ మహిళలు కన్నీరు పెట్టారు. 

దశాబ్దాలుగా ఆ భూమిపై వ్యవసాయం చేస్తూ జీవనోపాధిని కొనసాగిస్తున్నామని అయితే ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం తమను ఆ భూమి నుంచి తరిమేయాలనుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశస్తున్నారు.   ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ హక్కులను రక్షించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
   
 మా మహిళలపై దాడి చేస్తుండగా వీడియో తీస్తే మమ్మల్ని కొట్టారు, ఫోన్లు లాక్కున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు.   JCB తో మీ ఇళ్లు కూల్చేస్తాం. ఆపరేషన్ కాగర్ మొదలుపెడతామని హెచ్చరిస్తున్నారని..కన్నీరు పెట్టుకున్నారు.  స్థానిక ఆదివాసీ నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసీ సంఘాలు ఇప్పటికే నిరసన కార్యక్రమాలు ప్రారంభించాయి.

ఈ ఘటనపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఒక గూండా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు, అది అటంకవాద్ కా దుకాన్, అత్యాచార్ కా కేంద్ర, రాజ్యాంగ భ్రష్టాచార్ అవుతుందని  రాహుల్, ఖర్గేలకు ట్వీట్ చేసి మండిపడ్డారు. 

పోడు భూములు అంటే గిరిజనులు , ఇతర సంప్రదాయ వ్యవసాయదారులు అడవుల్లో చెట్లు, పొదలు నరికి సాగు చేసే భూములు. తెలంగాణలో ఈ భూముల సమస్య గిరిజన హక్కులు, అటవీ సంరక్షణ,  ప్రభుత్వ విధానాల మధ్య  వివాదాలుగా మారుతున్నాయి.  అటవీ హక్కుల చట్టం (FRA, 2006) కింద పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. తెలంగాణలో 6.69 లక్షల ఎకరాలకు పట్టాలు మంజూరైనప్పటికీ, లక్షలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి .  కొందరికి పట్టాలు వచ్చినా, క్లెయిమ్ నంబర్లు  లేవు.  అటవీ అధికారులు పోడు భూములను అటవీ భూమిగా గుర్తించి, సాగుదారులను బలవంతంగా తొలగించడం లేదా హరిత హారం కోసం మొక్కలు నాటడం జరుగుతోంది. వీటిని గిరిజనులు అడ్డుకుంటున్నారు. అలాంటి సందర్భాల్లో తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి.             

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget