KTR On Harish: హరీష్ రావుపై కేటీఆర్ పొగడ్తల ట్వీట్ - ఇవన్నీ సరే కవిత ఆరోపణలను ఎవరూ ఖండించరేంటి ?
KTR: అసెంబ్లీలో హరీష్ రావు ప్రసంగాన్ని అభినందిస్తూ కేటీఆర్ ట్వీట్ పెట్టారు. కానీ కవిత ఆరోపణల్ని మాత్రం ఖండించలేదు.

KTR praise Harish Rao : భారత రాష్ట్ర సమితి అంతర్గత రాజకీయాలు చాలా జోరుగా సాగుతున్నాయి. అసలే కాళేశ్వరం రిపోర్టుపై సీబీఐ విచారణకు అసెంబ్లీ సిఫారసు చేయడంతో టెన్షన్ లో ఉన్న ఆ పార్టీకి కవిత చేసిన ఆరోపణలు కొత్త తలనొప్పులు తీసుకు వచ్చాయి. హరీష్ రావు, సంతోష్ రావుపై ఆమె ఆరోపణలు చేశారు. కవిత ఆరోపణలు చేసిన వెంటనే.. బీఆర్ఎస్ పార్టీ అధికారిక హ్యాండిల్ నుంచి ఆరడుగుల బుల్లెట్టు అని ఓ ట్వీట్ వేశారు. అసెంబ్లీలో హరీష్ రావు ప్రసంగాన్ని పొగుడుతూ ఆ ట్వీట్ ఉంది.
ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥
— BRS Party (@BRSparty) September 1, 2025
సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish pic.twitter.com/RT0NtpsgJe
ఈ ట్వీట్ ను బట్టి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ హరీష్ కు మద్దతుగా ఉందని అనుకున్నారు. అలాగే ప్రచారం చేశారు. కాసేపటికి కేటీఆర్ కూాడా ట్వీట్ పెట్టారు. హరీష్ రావును పొగిడారు.కానీ టాపిక్ మాత్రం అసెంబ్లీ ప్రసంగమే.
This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏
— KTR (@KTRBRS) September 1, 2025
I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu https://t.co/w5YGJCETtL
హరీష్ రావు ను ఇలా మునగచెట్టు ఎక్కించేలా పొగుడుతున్నారు కానీ.. ఒక్కరంటే ఒక్క పార్టీ నేత కూడా కవిత ఆరోపణల్ని గట్టిగా ఖండించలేదు. పార్టీ అధినేత కుమార్తె అయినందున కవిత విషయంలో స్పందించడానికి పార్టీ నేతలెవరూ ముందుకు రాలేదు. చివరికి హరీష్ రావు, సంతోష్ రావులకు క్లీన్ చిట్ ఇవ్వడానికి కేటీఆర్ కూడా ముందుకు రాలేదు. ఆయన అసెంబ్లీలో ప్రసంగాన్ని పొడిగారు కానీ..ఆయన నిజాయితీ పరుడని.. కవిత చేసిన ఆరోపణలు కరెక్ట్ కాదని చెప్పలేకపోయారు.
కేటీఆర్ ఉదయం నుంచి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. పార్టీ ముఖ్యనేతలతో కలిసి కేసీఆర్ తో చర్చిస్తున్నారు. అసలు సమావేశమైన టాపిక్ వేరు. కాళేశ్వరం రిపోర్టు విషయంలో సీబీఐ ఎంట్రీ ఇస్తే ఏం చేయాలి.. ఎలాంటి న్యాయపరమైన పోరాటం చేయాలన్న అంశంపై చర్చించడానికి సమావేశం అయ్యారు. కానీ హఠాత్తుగా కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత రోజునే.. ఇలాంటి ఆరోపణలు చేయడంతో.. ీ అంశంపై ఎలా స్పందించాలన్నదానిపై ఓ నిర్ణయానికి రాలేకపోయారు. ఏదో ఒకటి కేసీఆర్ నుంచి సూచనలు వచ్చేదాకా.. హ రీష్ , సంతోష్ పై ఆరోపణలు కూడా ఖండించకూడదని నిర్ణయించుకున్నారు. అయితే మద్దతుగా లేరన్న ప్రచారం జరుగుతుందని పొగడ్తల ట్వీట్లు పెడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.





















