Kavitha vs Harish Rao: అవినీతిపరుడు కాదు ఆరడుగుల బుల్లెట్టు- హరీష్‌కు బీఆర్‌ఎస్ సోషల్ మీడియా సపోర్ట్- కవితకు అవమానం..!
Kavitha vs Harish Rao: కవిత వ్యాఖ్యలతో బిఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. కవిత మాకొద్దంటూ, హరీష్‌రావుకే మా మద్దతంటూ బీఆర్ ఎస్ చెప్పకనే చెప్పేసింది.

Kavitha vs Harish Rao: కాళేశ్వరం అవినీతిపై సిబిఐ ఏం తేల్చనుందో పక్కనపెడితే, ఆ సిబిఐ ప్రభావం ఆదిలోనే బిఆర్‌ఎస్ పార్టీలో పెను దుమారం రేపింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అదే పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్‌రావుపై చేసిన విమర్శలతో పార్టీలో ఊహించని పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి.
ఇన్నాళ్లు భరించాం, కేసీఆర్ కూతురు కాబట్టే ఊరుకున్నాం. ఇంక చాలు, కవితపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఓ వైపు పార్టీ నేతలు అధినేతపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు కవిత విమర్శల తరువాత బిఆర్ ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా మాత్రం కవితను దూరం పెట్టేసింది. హరీష్ రావుపై కవిత తీవ్ర స్దాయిలో విమర్శలు చేసిన కొద్దిసేపటికే బీఆర్ ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా X లో ఆశక్తికర పోస్ట్ పెట్టింది. హరీష్ రావు నిన్న అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ పై అధికార పార్టీ విమర్శలకు తిప్పికొడుతున్న వీడియో పోస్ట్ చేసింది. ఇది ఆరడుగుల బుల్లెట్ అంటూ హరీష్ రావు ను ఓ రేంజిలో పైకెత్తింది. సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లుగా కాళేశ్వరంపై కాలేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు అంటూ వీడియో పోస్ట్ చేసింది బిఆర్ ఎస్ పార్టీ..
బీఆర్ ఎస్ పోస్ట్ చేసిన వీడియోలో హరీష్ రావుకు ఓ రేంజ్ లో ఎలివేట్ చేసారు. కాలేశ్వరం రిపోర్టులో 600 పేజీలకు , ఒక్కొక్క అక్షరానికి నేను సమాధానం చెబుతానంటూ హరీష్ రావు , కాంగ్రెస్ నేతలకు ఇచ్చిన కౌంటర్ డైలాగ్ తో , వరుస పంచ్ లతో ఆ వీడియో ఉంది. ఓవైపు కేసీఆర్ కుమార్తె, ఆపార్టీ ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసిన కొద్ది సేపటికే హరీష్ ను ఆకాశానికెత్తడంతో ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఎవరు ఏమాన్నా.. బిఆర్ ఎస్ మద్దతు హరీష్ రావుకే ఉంటుందని క్లారిటీ ఇచ్చినట్లయింది. బిఆర్ ఎస్ పోస్ట్ క్రింద అంతే స్దాయిలో హరీష్ రావుకు మద్దతుగా బిఆర్ ఎస్ క్యాడర్ కామెంట్స్ చేయడం ఆశక్తిగా మారింది.
తెగేదాకా లాగేశారు.. ఇక మిగిలింది యాక్షన్ తీసుకోవడం మాత్రమే. ఆలస్యం వద్దూ.. ప్రకటన చేయడం ఖాయమంటూ , కవితపై వేటు తప్పదనే వార్తలు చక్కర్లు కొడుతున్న నేపధ్యంలో బిఆర్ ఎస్ సోషల్ మీడియా సైతం హరీష్ కు మద్దతు పలకడంతో కవిత ఇకపై అధికారికంగా కూడా ఒంటరే అనే భావన క్యాడర్ లోకి తీసుకెళ్లింది బిఆర్ ఎస్ . ఇదిలా ఉంటే బిఆర్ ఎస్ అధికారిక వాట్సప్ గ్రూపులలో సైతం కవితను అవమానించేలా బిఆర్ ఎస్ పార్టీ వ్యవహరించిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా బిఆర్ ఎస్ నేతలు మీడియాతో మాట్లడిన కామెంట్స్, వీడియోలు బీఆర్ ఎస్ అధికారికి వాట్సప్ గ్రూపులలో పోస్ట్ చేస్తారు. మీడియాకు ఈ గ్రూపుల ద్వారానే సమాచారం ఇస్తారు. తాజాగా బిఆర్ ఎస్ వాట్సప్ గ్రూపులో హారీష్ రావుపై కవిత వ్యాఖ్యలు పోస్ట్ చేయడం , చేసిన కొద్ది సేపటికే డిలీట్ ఆల్ కొట్టడం చకచకా జరిగిపోయాయి. అంతేకాదు కవిత వ్యాఖ్యలు పోస్ట్ చేసిన కవిత పీర్ ను కూడా బిఆర్ ఎస్ వాట్సప్ గ్రూప్ ల నుంచి రిమూవ్ చేసేశారు. ఇలా బిఆర్ ఎస్ మీడియా రెండుగా చీలిపోయింది. కవిత తనకంటూ వేరే కుంపటి పెట్టుకోక తప్పని పరిస్దితిని తీసుకొచ్చేశారు.
సోషల్ మీడియాలో దూరం పెడుతున్నారంటే దాదాపు కవితపై వేటుకు సిద్దంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చేశారనే వార్తలకు బలం చేకూరుతోంది. బీఆర్ ఎస్ నుండి కవితను సాగనంపేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. సొంత పార్టీలో ఉంటూ,పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతూ .. పార్టీ నేతలనే విమర్శిస్తే ఊరుకుంటుదా అధిష్టానం అనే వాదనలు ఓవైపు. ఇన్నాళ్లు చూసి చూడనట్లు ఉన్నాం కాదా.. ఇప్పుడూ అలాగే లైట్ తీసుకుందామనే సలహాలు మరోవైపు, ఇవన్నీ ఒకెత్తైతే నేరుగా హరీష్ రావుపై తీవ్ర విమర్శల తరువాత కూడా కవితను వెనకేసుకొస్తే హరీష్ రావు గుడ్ బైయ్ చెప్పేస్తారనే భయం మరోవైపు.. ఇలా ఇవ్నీ లెక్కలు వేశాక, అతి త్వరలో కవితపై చర్యలు తీసుకోక తప్పేలా లేదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు సొంత పార్టీ నేతలు.





















