అన్వేషించండి

Formula E Race Case: కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!

ACB KTR Summons: ఫార్ములా-ఈ రేసు నిధుల దుర్వినియోగం కేసులో కేటీఆర్ సహా నిందితులకు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై31న హాజరు కావాలని ఆదేశించింది.

KTR Summoned by Acb Court In Formula E Race:   హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫార్ములా-ఈ రేసు నిధుల దుర్వినియోగం కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR)కు గట్టి షాక్ తగిలింది. ఈ వ్యవహారంలో ఏసీబీ దాఖలు చేసిన దాదాపు 250 పేజీల ఛార్జిషీట్‌ను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. కేటీఆర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్ రెడ్డి సహా మరో ఇద్దరికి సమన్లు జారీ చేసింది. వీరంతా జూలై 31న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి   ఆదేశాలు జారీ చేశారు.

రూ. 55 కోట్ల అక్రమ  మళ్లింపు                            

2024లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు కోసం నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ. 55 కోట్ల నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా కేబినెట్ ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండానే ఈ భారీ మొత్తాన్ని విదేశీ కరెన్సీ రూపంలో బదిలీ చేయడంపై ఏసీబీ తన ఛార్జిషీట్‌లో కీలక ఆధారాలను పొందుపరిచింది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే ఈ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటికే ఈ కేసులో గవర్నర్,  కేంద్ర ప్రభుత్వం ప్రాసిక్యూషన్ అనుమతులు మంజూరు చేయడంతో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

 కోర్టు సమన్ల వెనుక అర్థమేంటి?                

సాధారణంగా దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుని సమన్లు జారీ చేసిందంటే.. నిందితులపై ఉన్న ఆరోపణల్లో ప్రాథమికంగా వాస్తవం ఉందని న్యాయస్థానం సంతృప్తి చెందిందని అర్థం. జూలై 31న కేటీఆర్ కోర్టుకు హాజరైనప్పుడు ఆయనకు ఛార్జిషీట్ కాపీలను అందజేస్తారు. ఆ దశలో ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడమో లేదా ఆరోపణలను క్వాష్ చేయాలని కోరడమో చేయాల్సి ఉంటుంది.  ఒకసారి విచారణ ప్రారంభమైతే మాత్రం ఇది రాజకీయంగా కేటీఆర్‌కు పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

 రంగంలోకి  ఈడీ 

ఈ కేసులో ఏసీబీ దర్యాప్తుతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కూడా దూకుడు పెంచింది. విదేశీ నిధుల బదిలీ, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఇప్పటికే ఆరా తీస్తోంది. రాజకీయంగా చూస్తే, ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ యుద్ధంగా మారింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను గ్లోబల్ లెవల్‌కు తీసుకెళ్లడానికే రేసు నిర్వహించాం  అని కేటీఆర్ సమర్థించుకుంటుండగా..  బ్రాండ్ ఇమేజ్ పేరుతో ప్రజా ధనాన్ని విదేశీ సంస్థలకు దోచిపెట్టారు అని రేవంత్ రెడ్డి సర్కార్ ఘాటుగా విమర్శిస్తోంది. ఏసీబీ కోర్టు తాజా నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. జూలై 31న కోర్టులో జరిగే పరిణామాలు  కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని  బీఆర్ఎస్ నేతలు టెన్షన్‌కు గురవుతున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Dasara Festival Rush: పండుగ రద్దీతో స్తంభించిన హైదరాబాద్- విజయవాడ హైవే.. పంతంగి వద్ద రికార్డు స్థాయిలో వాహనాలు
పండుగ రద్దీతో స్తంభించిన హైదరాబాద్- విజయవాడ హైవే.. పంతంగి వద్ద రికార్డు స్థాయిలో వాహనాలు
Hyderabad Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Embed widget