అన్వేషించండి

Telangana Politics BJP: వ్యక్తిగత దాడులు.. పొలిటికల్ అస్త్రాలు- బండి భగీరథ్ కేసు చుట్టూ మారుతున్న తెలంగాణ రాజకీయం!

Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసు అసలు నేరం కోణం కన్నా రాజకీయంగానే ఎక్కువ వార్తల్లో ఉంటోంది. చివరికి పరారీ అంటూ పోస్టర్లు కూడా వేస్తున్నారు. ఈ రాజకీయం దేనికి సంకేతం?

Telangana Politics Bandi Bhagirath Case:  తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వ్యక్తిగత స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు కేవలం ఒక నేరపూరిత దర్యాప్తుగా మిగలకుండా, రాష్ట్రంలో రాజకీయ సెగలు పుట్టిస్తోంది. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, శేరిలింగంపల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో బండి భగీరథ్ పరారీ  అంటూ వెలిసిన పోస్టర్లు ఈ వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. అసలు ఈ పోస్టర్లు ఎవరు వేశారు? దీని వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఏవి? అన్నది పక్కన పెడితే, ప్రత్యర్థిని దెబ్బతీయడానికి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

రాజకీయంగా హైపర్ యాక్టివ్ 
 
ఈ వ్యవహారం రెండు భిన్నమైన కథనాల మధ్య నలుగుతోంది. ఒక వైపు, ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందని, ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేశారని ప్రాసిక్యూషన్ చెబుతోంది. మరోవైపు, ఇది పక్కాగా ప్లాన్ చేసిన  హనీ ట్రాప్  అని, రూ. 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేశారని భగీరథ్ తరపున కౌంటర్ ఫిర్యాదు నమోదైంది. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సి ఉండగా, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న  ట్రోలింగ్  ఈ కేసులో అసలు బాధితులు ఎవరో తేల్చలేనంత గందరగోళాన్ని సృష్టిస్తోంది.

 బాధ్యత ఎవరిది? 

సాధారణంగా ఏదైనా కేసు నమోదైనప్పుడు దర్యాప్తుకు సహకరించాల్సిన బాధ్యత నిందితులపై ఉంటుంది. అయితే, బుధవారం సిట్  విచారణకు భగీరథ్ హాజరుకాలేదు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తయిన తర్వాత వచ్చేలా రెండు రోజుల తరవాత వస్తానని సమాచారం పంపారు.   బండి సంజయ్ రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే తన కుమారుడిని బలి చేస్తున్నారని, ఇది తనపై జరుగుతున్న పొలిటికల్ హిట్ జాబ్  అని ఆరోపిస్తున్నారు.  అధికార పక్షం మాత్రం.. నేరం చేసింది ఎవరైనా చట్టం ముందు సమానమేనని, బాధితురాలికి న్యాయం జరగాల్సిందేనని పట్టుబడుతోంది. మరో వైపు బీఆర్ఎస్ నేతలు  బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలంటున్నారు. 

నలిగిపోతున్న బాధితురాలి కుటుంబం 

ఈ రాజకీయ యుద్ధంలో బాధితురాలి కుటుంబానికే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి.  రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు బురద చల్లుకునే క్రమంలో, బాధితురాలి గుర్తింపును గానీ, ఆమె మానసిక స్థితిని గానీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు ఈ సమస్యను పరిష్కరించడానికి వివాహం వంటి వింత సలహాలు ఇవ్వడం, దానికి టీపీసీసీ ఖండన తెలపడం వంటివి చూస్తుంటే.. ఈ అంశం ఎంతటి అయోమయానికి గురైందో అర్థం చేసుకోవచ్చు.  తెలంగాణ రాజకీయాల్లో నేతలను వ్యక్తిగతంగా దెబ్బతీయడానికి వారి పిల్లలను, కుటుంబ సభ్యులను వాడుకునే సంస్కృతి పెరిగిపోవడం ఆందోళనకరమన్న అభిప్రాయం వినిపిస్తోంది.  అది భగీరథ్ అయినా, మరెవరైనా.. నేరం నిరూపితమైతే చట్టపరమైన శిక్ష అనుభవించాలి. కానీ, దర్యాప్తు పూర్తికాకముందే పోస్టర్లతో వేధించడం ,  రాజకీయ కుట్రలంటూ తప్పించుకునే ప్రయత్నం చేయడంపై విమర్శలు వస్తున్నాయి.  చివరకు కోర్టులో తేలాల్సిన అంశాన్ని వీధి పోరాటంగా మార్చడం వల్ల వ్యవస్థల పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళనవ వ్యక్తమవుతోంది. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tollywood Fans Political Agenda: ఫ్యాన్స్ పేరుతో హీరోల ఇమేజ్‌తో ఆట - రాజకీయం కొత్త దిశలో వెళ్తోందా?
ఫ్యాన్స్ పేరుతో హీరోల ఇమేజ్‌తో ఆట - రాజకీయం కొత్త దిశలో వెళ్తోందా?
AP New Pattadar Passbooks Rajamudra: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ టు రాజముద్ర - పాస్‌బుక్‌లపై జగన్ ఫోటో తొలగింపు - చంద్రబాబు మార్క్ జనాకర్షక వ్యూహం!
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ టు రాజముద్ర - పాస్‌బుక్‌లపై జగన్ ఫోటో తొలగింపు - చంద్రబాబు మార్క్ జనాకర్షక వ్యూహం!
KTR GHMC Elections Strategy: గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !
గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Embed widget