అన్వేషించండి

Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

Bandi Bhagirath | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ ఓ మైనర్ బాలికను వేధించాడన్న ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు కాగా, తక్షణం విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించారు.

Bandi Sanjay Son Bandi Bhagirath Case | హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు తక్షణం విచారణ చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేసు నమోదైనప్పటికీ చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేశారని డీజీపీని ప్రశ్నించారు. ఈ క్రమంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై స్పెషల్ టీం ఏర్పాటు చేసి తక్షణమే విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్‌ను సోమవారం నాడు ఆదేశించారు. 

ఈనెల 8వ తేదీనే ఫిర్యాదు అందినప్పటికీ, నిందితుడు బండి భగీరథ్2పై చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం జరిగిందని డీజీపీని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ బలగాలన్నీ భద్రతా ఏర్పాట్లలో బిజీగా ఉండటం వల్ల విచారణలో కొంత జాప్యం జరిగిందని సీఎంకు డీజీపీ వివరించారు. ఈ కేసులో ఎలాంటి  జాప్యం లేకుండా సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

బండి భగీరథ్ పై పోక్సో కేసు..
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది. బాధిత బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, ఆ ఘటనకు సంబంధించిన అంశాలను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి తరపు వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేసి ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయనున్నారు. 

పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

తన కుమార్తెను బండి భగీరథ్‌ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ బాలిక (17) తల్లి ఫిర్యాదు చేశారు. దాంతో పేట్‌బషీరాబాద్‌ పోలీసులు సెక్షన్‌ 11 రెడ్‌విత్‌ 12 ఆఫ్‌ పోక్సో యాక్ట్, బీఎన్‌ఎస్‌ 74, 75 సెక్షన్ల కింద మే 8న రాత్రి బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదు చేశారు. మొయినాబాద్లోని ఒక ఫామ్‌ హౌజ్‌తోపాటు మరో రెండు ప్రాంతాల్లో బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు కేంద్రమంత్రి కుమారుడు కావడంతో కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనకడుకు వేశారని.. మోదీ సభ జరుగుతుంటే సజీవ దహనం చేసుకుంటామని హెచ్చరిస్తే ఎట్టకేలకు కేసు నమోదు చేసినట్లు బాధితులు తెలిపారు.

హనీట్రాప్ ఆరోపణలు.. బండి ఫిర్యాదుతో కేసు నమోదు
బండి భగీరథ్ తనపై నమోదైన కేసును హనీ ట్రాప్ గా పేర్కొంటూ కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక స్నేహం పేరుతో పరిచయమై, తనను పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులతో కలిసి ఒత్తిడి తెచ్చిందని బండి భగీరథ్ సన్నిహితులు తెలిపారు. ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో, తప్పుడు ఆరోపణలతో క్రిమినల్ కేసులు పెడతామని తనను బెదిరించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కరీంనగర్ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు.  తాను జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అనే వ్యక్తిని.. మోదీ శిష్యుడినని.. ఎలాంటి తప్పు చేయలేదని ప్రధాని మోదీ సభలో అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget