BosCh KTR : ఇండియాలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే - బోష్ స్మార్ట్ క్యాంపస్ ప్రారంభించిన కేటీఆర్ !
హైదరాబాద్‌లో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. బాష్ స్మార్ట్ క్యాంపస్‌ను ఆయన ప్రారంభించారు.
BosCh KTR : బోష్ కంపెనీ స్మార్ట్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభమయింది. మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మౌలిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ నగరం వెనక్కి తగ్గేది లేదని కేటీఆర్ అన్నారు. నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని, దానికి తగిన వేగంతోనే అభివృద్ధి జరుగుతోందన్నారు. హైదరాబాద్ నగరంలో గత ఏడాదిన్నరలో లక్షన్నర ఉద్యోగాలు సృష్టించినట్లు మంత్రి తెలిపారు.మొబిలిటీ వ్యాలీని సృష్టించేందుకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తోందన్నారు. 5 జోన్ లతో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. క్వాల్‌కామ్ లాంటి సెమీ కండెక్టర్ కంపెనీలు హైదరాబాద్‌లో దూసుకువెళ్తున్నాయన్నారు.
Minister @KTRTRS inaugurated @BoschSoftware's smart campus in Hyderabad today. The IT Minister said that through the new 1.5 lakh sq. ft. facility providing employment to over 3,000 people, Bosch will strengthen its presence in Automotive Engineering domain. pic.twitter.com/M51Hm7M27i
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 14, 2022
భారత్‌లో వస్తున్న ఉద్యోగాల్లో మూడో వంతు హైదరాబాద్‌లోనే సృష్టి
ఇండియాలో మూడవ వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌లో క్రియేట్ అయినట్లు తెలిపారు. బోష్ అతిపెద్ద కంపెనీ అని, న్యూ ఏజ్ మొబైల్స్, కార్లలోనూ సాఫ్ట్‌వేర్ పెరుగుతోందన్నారు. ఆటోమోటివ్ రంగంలో బోష్ మరింత రాటుదేలుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హయ్యెస్ట్ గ్రోత్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినట్లు మంత్రి తెలిపారు. ఐటీ ఎగుమతులు రాష్ట్రం నుంచి భారీగా పెరిగినట్లు మంత్రి చెప్పారు. ఇండియాలో మూడవ వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌లో క్రియేట్ అయినట్లు తెలిపారు. బోష్ అతిపెద్ద కంపెనీ అని, న్యూ ఏజ్ మొబైల్స్, కార్లలోనూ సాఫ్ట్‌వేర్ పెరుగుతోందన్నారు.
బోష్ స్మార్ట్ క్యాంపర్ హైదరాబాద్‌కు మరింత ఖ్యాతి తెచ్చిందన్న కేటీఆర్
ఎలాంటి నేపథ్యంలో ఇక ఆటోమొబైల్ రంగంలో అతి పెద్ద కంపెని అయిన బోష్.. తెలంగాణాలో నూతన ఆఫీస్ పెట్టడం మన ఖ్యాతిని మరింత పెంచింది. స్టార్టప్ రంగంలో అద్బుతంగా ముందుకు వెళ్తున్న తెలంగాణ టాలెంట్ జోన్ గా అవతరించిదని చెప్పారు.ఐటీ ఎగుమతులు రాష్ట్రం నుంచి భారీగా పెరిగినట్లు మంత్రి చెప్పారు.
ఎక్కువగానే ఎమ్మెన్సీల రిక్రూట్ మెంట్
మల్టీనేషనల్ కంపెనీలు ముందు అనుకున్న దాని కంటే ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనికి కారణం యంగ్ టాలెంట్ హైదరాబాద్ లో ఉందన్నారు. హైదరాబాద్‌లో ఫార్ములా-ఈను ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇండియాలో ఆ ఈవెంట్‌ను నిర్వహిస్తున్న తొలి నగరం హైదరాబాద్ అని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏడాది ఈవీవీ సమ్మిట్‌ను నిర్వహించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభ వేడుకకు దూరంగా కేటీఆర్, కారణం ఏంటంటే