Delhi KTR: ఢిల్లీకి కేటీఆర్ - రేవంత్ పై ఫిర్యాదుకా ? అరెస్టు నుంచి తప్పించుకోవడానికా ?
Telangana: కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. రేవంత్ చేసిన స్కాములపై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ కాంగ్రెస్ భిన్న వాదన వినిపిస్తోంది.
KTR is going to Delhi: తెలంగాణ రాజకీయాలు కాక మీద ఉన్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన స్కాముల మీద ఆయన కేంద్ర మంత్రులకు ఫిర్యాదులు చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అమృత్ పథకంలో భాగంగా కేంద్రం నిధులతో చేయిచే పనుల టెండర్ల విషయంలో భారీ అవకతవకలు జరిగాయని కేటీఆర్ గతంలో ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతల్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే అంశంపై స్వయంగా కేంద్రమంత్రుల్ని.. దర్యాప్తు సంస్థల్ని కూడా కలిసి ఫిర్యాదు చేస్తారని అంటున్నారు.
కాంగ్రెస్ స్కాంలపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి కేటీఆర్
అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కేటీఆర్ ఫర్యటన అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికని ఆరోపిస్తున్నారు. ఫార్ములా ఈ రేసు విషయంలో గల్లంతు అయిన యాభై ఐదు కోట్ల రూపాయల వ్యవహారంలో ఏసీబీ అధికారులు కేటీఆర్ ను అరెస్టు చేయడానికి గవర్నర్ పర్మిషన్ అడిగారని.. అది ఇంకా రాజ్ భవన్‌లో పెండింగ్ లో ఉందన్నారు. తనను అరెస్ట్ చేయకుండా బీజేపీ నేతలతో లాబీయింగ్ చేసుకునేందుకు గవర్నర్ అనుమతి రాకుండా చూసుకునేందుకు ఢిల్లీ వెళ్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీజేపీ నేతలతో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని చెబుతున్నారు.
Also Read: తెలంగాణ యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
అరెస్టుకు గవర్నర్ పర్మిషన్ ఇవ్వకుండా లాబీయింగ్ కోసమన్న కాంగ్రెస్
కేటీఆర్ మాజీ మంత్రి. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలపై అరెస్టులు చేయాలంటే.. గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుది. లేకపోతే అరెస్టు చట్ట ప్రకారం చెల్లదు. ఈ కారణంగానే ఏసీబీ అధికారులు గవర్నర్‌ను అరెస్టు చేయడానికి అనుమతి కోరారాని అంటున్నారు.ఈ విషయం తెలిసే కేటీఆర్ కొద్ది రోజులుగా తనను అరెస్టు చేయడానిక ిచూస్తున్నారని తాను రెడీగా ఉన్నానని సవాల్ చేస్తున్నారు. అయితే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుటున్నారని కానీ తప్పు చేసిన ఎవర్నీ వదిలేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Also Read: Bandi Sanjay: లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
అయితే కేటీఆర్ మాత్రం.. ముందుగా పొంగులేటినే జైలుకెళ్లేలా ఉన్నారని ఆయనపై ఈడీ దాడులు చేసినా వివరాలు ఎందుకు బయటకు రాలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ పరంగా కూడా హైలెట్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ తెలంగాణ నేతలు కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.