అన్వేషించండి

Revanth Reddy: తెలంగాణ యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్

Telangana News | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఉద్యోగ నియమాక పత్రాలు అందజేత కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Telangana CM Revanth Reddy | హైదరాబాద్‌: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో తెలిసొచ్చిందని, త్వరలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు. ఖైరతాబాద్‌లో ఏఎంవీఐలకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం వల్ల తెలంగాణలో 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. నిరుద్యోగులు జాబ్స్ కోసం కేసులు లెక్కచేయకుండా ఉద్యమ బాట పట్టారు, కానీ కేసీఆర్ హయాంలో వారి ఆకాంక్షలు నెరవేరలేదు. ఆఖరికి కేసీఆర్ ఫ్యామిలీలో నలుగురికి ఉద్యోగాలు పోయాయి. కాంగ్రెస్ పాలనలో నియామక ప్రక్రియ వేగవంతం చేశాం. ఇప్పుడు అసిస్టెంట్​ మోటార్​ వెహికిల్​ ఇన్​స్పెక్టర్లు (AMVI) పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని’ పేర్కొన్నారు. 

కేసీఆర్ కు రెండుసార్లు అధికారం ఇచ్చినా నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పది నెలల్లో 50వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న ఎల్బీ స్టేడియంలోనే నియామక పత్రాలు అందించి నిరుద్యోగులతో పాటు వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూశాం, అది నాకు అత్యంత సంతోషం కలిగించిందన్నారు. మీ గ్రామంలో విద్యార్థులు, నిరుద్యోగులతో మాట్లాడి.. వారిని పోటీ పరీక్షలకు సిద్ధం చేయ్యాలని AMVI పోస్టులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ సూచించారు. 

పండుగ రోజు డ్రగ్స్ తీసుకోవడం ఏంటి?
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంతోషంగా దీపావళి పండుగ చేసుకుంటుంటే.. కొందరు పండుగ రోజున డ్రగ్స్ తీసుకుని గృహప్రవేశం అని బుకాయించే ప్రయత్నం చేయడం విడ్డూరం. లీడర్ అంటే రోల్ మోడల్ గా నిలవాలి. కానీ పండగ పూట డ్రగ్స్, సారాతో దావత్ చేసుకునే వారు లీడర్లు కాదు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారిని రోల్ మోడల్ గా తీసుకోవాలా, లేక డ్రగ్స్ తీసుకునే వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలా అంటూ సీఎం రేవంత్ రెడ్డి యుతను ప్రశ్నించారు. 

కాలుష్యం నుంచి హైదరాబాద్ ను కాపాడుకోవాలంటే రవాణా శాఖ సహకారం కావాలి. త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాల కోసం త్వరలోనే ఒక పాలసీ తీసుకొస్తాం. కానీ పది నెలల్లో ప్రజలు ఏదో కోల్పోయారని కేసీఆర్ చెబుతున్నాడు. ఆయన ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోవడం తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయింది ఏమీ లేదన్నారు. ఈ 10 నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు, రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో 1 కోటి 5లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసి పథకాలతో లబ్ది పొందారు.

నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాటలోకి తెచ్చాం. 49 లక్షల 90వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించారు. ఆడబిడ్డలకు రూ.500కు వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ తో 10లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్ లభించింది. 35వేల మంది టీచర్లు బదిలీ అయ్యారు. 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనున్నాం. కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టాడు కానీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ 1 పోస్టులకు పరీక్షలు నిర్వహించాం. త్వరలో వారికి నియామక పత్రాలు అందిస్తాం’ అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణ యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
తెలంగాణ యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Attack On Collector: కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళా రైతు - ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస, వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళా రైతు - ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస, వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
Jio Vs Airtel: జియో వర్సెస్ ఎయిర్‌టెల్ - రోజూ 2 జీబీ డేటా అందించే బెస్ట్ ప్లాన్లు ఇవే!
జియో వర్సెస్ ఎయిర్‌టెల్ - రోజూ 2 జీబీ డేటా అందించే బెస్ట్ ప్లాన్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Gautam Gambhir Australia Press meet | BGT 2024 కోసం కసిగా ఎదురుచూస్తున్నామన్న గౌతం గంభీర్ |ABP Desamఆసీస్ తో టెస్టుకు రోహిత్ దూరం! కెప్టెన్ గా బుమ్రా?ట్రోలర్స్‌కి ఇచ్చి పడేసిన రౌడీ, ఒక్క వీడియోతో గప్‌చుప్బెల్టు తీస్తానన్నారు? రోజా సంచలన ట్వీట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణ యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
తెలంగాణ యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Attack On Collector: కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళా రైతు - ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస, వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళా రైతు - ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస, వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
Jio Vs Airtel: జియో వర్సెస్ ఎయిర్‌టెల్ - రోజూ 2 జీబీ డేటా అందించే బెస్ట్ ప్లాన్లు ఇవే!
జియో వర్సెస్ ఎయిర్‌టెల్ - రోజూ 2 జీబీ డేటా అందించే బెస్ట్ ప్లాన్లు ఇవే!
New Maruti Dzire: రూ.ఏడు లక్షల్లోపు ధరలోనే మారుతి కొత్త డిజైర్ - సేఫెస్ట్ మారుతి కారు ఇదే!
రూ.ఏడు లక్షల్లోపు ధరలోనే మారుతి కొత్త డిజైర్ - సేఫెస్ట్ మారుతి కారు ఇదే!
Case On RGV: ఆర్జీవీకి తప్పదు - ప్రకాశం జిల్లాలో కేసు నమోదు !
ఆర్జీవీకి తప్పదు - ప్రకాశం జిల్లాలో కేసు నమోదు !
Sanjay Bangar Son Aryan:అమ్మాయిగా మారిన సంజయ్ బంగర్‌ కుమారుడు- సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
అమ్మాయిగా మారిన సంజయ్ బంగర్‌ కుమారుడు- సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
Alia Bhatt - Nag Ashwin: నాగ్ అశ్విన్ లేడీ ఓరియంటెడ్ మూవీ ప్లాన్... బాలీవుడ్ హీరోయిన్, 'ఆర్ఆర్ఆర్' ఫేమ్ ఆలియాతో చర్చలు
నాగ్ అశ్విన్ లేడీ ఓరియంటెడ్ మూవీ ప్లాన్... బాలీవుడ్ హీరోయిన్, 'ఆర్ఆర్ఆర్' ఫేమ్ ఆలియాతో చర్చలు
Embed widget