Love Marriage: సరిహద్దులు లేని ప్రేమ, అమెరికా అమ్మాయి తెలంగాణ అబ్బాయి అలా ఒకటయ్యారు
అమెరికా అమ్మాయి, తెలంగాణ అబ్బాయిని కలిపింది ప్రేమ. తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమికుల రోజుకు రెండు రోజుల మందు వివాహం చేసుకుని ప్రేమకు హద్దులు లేవని నిరూపించారు
ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించారు ఒక ప్రేమ జంట. దేశాలు వేరైనా ప్రేమ విశ్వవ్యాప్తం అని చాటారు. ప్రేమికుల రోజు(Valentine's Day)కు రెండు రోజుల ముందు వివాహం చేసుకున్నారు. తెలంగాణ కొత్తగూడెం జిల్లా(Kothagudem District)కు చెందిన టోనీ సిలాస్ అమెరికాకు చెందిన జెస్సికా ఇద్దరు కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. ఇరువురు తమ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు చెప్పి పెద్దలను ఒప్పించారు. వీరి ప్రేమను ఒప్పుకున్న కుటుంబ పెద్దలు కొత్తగూడెం సెయింట్ ఆండ్రస్ చర్చిలో CSI బిషప్ పద్మారావు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేశారు. ఈ పెళ్లికి అమెరికా(America) నుంచి అమ్మాయి తల్లిదండ్రులు హాజరయ్యారు. విశేషం ఏమిటంటే ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఉండగా రెండు రోజుల ముందుగా ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
హనుమకొండ అబ్బాయి అమెరికా అమ్మాయి
హనుమకొండ అబ్బాయి, అమెరికా అమ్మాయి ఇరువురు ప్రేమ వివాహం(Love Marriage) చేసుకున్నారు. హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్‌లో హిందు సంప్రదాయంతో నెల రోజుల క్రితం వైభవంగా వారి వివాహం జరిగింది. హనుమకొండ(Hanumakonda) సూదుల సువర్ణ-సమ్మిరెడ్డి దంపతుల కుమారుడు బస్వంత్‌రెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(Software Engineer)గా ఉద్యోగం చేస్తున్నారు. అదే కంపెనీలో పని చేస్తున్న అమెరికాకు చెందిన హంఫ్రే బిల్‌రావు-వెరోనిక కుమార్తె ఎలీషాతో బస్వంత్ రెడ్డికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమ(Love)గా మారింది. ఇరువురు తమ ప్రేమ విషయాన్ని కుటుంబ పెద్దలకు తెలపగా, వాళ్లు అంగీకరించారు. దీంతో ఇరు కుటుంబ సభ్యుల మధ్య వారి వివాహం(Marriage) ఘనంగా జరిగింది.
అమెరికా అబ్బాయి తమిళ అమ్మాయి
అమెరికాకు చెందిన అబ్బాయి తమిళనాడు(Tamil Nadu)కు చెందిన అమ్మాయి తమిళ సంప్రదాయంతో ఒకటయ్యారు. చెన్నై(Chennai) మాధవరం సమీపంలో ఉంటున్న నాగర్‌కోవిల్‌కు చెందిన రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్ చంద్రన్ కుమార్తె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. అక్కడే మిచిగాన్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పీటర్ లాక్కర్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో చెన్నై టీనగర్‌లోని ఓ హోటల్లో శుక్రవారం వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు కూడా తమిళ సంప్రదాయం ప్రకారం దుస్తులు ధరించి వివాహ వేడుకలో పాల్గొన్నారు. వివాహానంతర కార్యక్రమాలు కూడా తమిళ సంప్రదాయంలో నిర్వహించారు. తమళపాటలకు నృత్యం చేస్తూ అబ్బాయి కుటుంబీకులు ఎంజాయ్ చేశారు.
Also Read: ప్రేమించుకొని తల్లితో వివాహం, ఆమె కూతురిపైనా మోజుపడి పెళ్లికి ఊహించని నాటకం