Khammam MLC Elections: ఖమ్మం ఎమ్మెల్సీ రేసులో తుమ్మల, పొంగులేటి.. సీఎం కేసీఆర్ మెచ్చేదెవరు?
రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ మూడింట రెండు వంతులకు పైగా మెజార్టీ ఉండటంతో రూలింగ్ పార్టీల అధినేతలు ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ సీటు ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు అలా వచ్చాయో లేదో వెంటనే తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 3, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ వచ్చింది. నవంబరు 9న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 19న పోలింగ్ జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ మూడింట రెండు వంతులకు పైగా మెజార్టీ ఉండటంతో రూలింగ్ పార్టీల అధినేతలు ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ సీటు ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుంది.. టీఆర్‌ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానం, అత్యధిక మెజారిటీ ఆ పార్టీకే ఉండటంతో స్థానిక నేతల్లో పోటీ మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్ టిక్కెట్ తెచ్చుకున్నవాళ్లే ఎమ్మెల్సీగా ఎన్నికవుతారనుకుంటే.. ఇప్పుడు టీఆర్‌ఎస్ ఎవరికి టిక్కెట్ కేటాయిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 769 మంది ఓటర్లు ఉన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహాబూబాబాద్, ములుగు జిల్లాల పరిధిలో ఈ మొత్తం ఓటర్లు ఉన్నారు.
Also Read: ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ పర్యటన.. గంటన్నర కోసం రూ.23 కోట్ల ఖర్చు! బీజేపీ ప్లాన్ ఏంటి?
వారిలో 530 మంది ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు 185 మంది ఉండగా, 45 మంది జడ్పీటీసీలు, తొమ్మిది మంది ఎక్స్‌అపీషియో మెంబర్లు ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఈ ఓటర్లలో అత్యధికులు టీఆర్‌ఎస్ పార్టీ వారే కావడం అధికార పార్టీకి కలిసొస్తుంది. కానీ పార్టీలో ఎవరికి టీఆర్‌ఎస్ టిక్కెట్ దొరికితే వారు ఎమ్మెల్సీ అయిపోయినట్లేనని బావించాలి. ఈ ఎమ్మెల్సీ స్థానం రేసులో ఇద్దరు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరొకరు తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. వీరికి అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితి వివరాలపై ఓ లుక్కేద్దాం.
Also Read: సీఎం జగన్ బిచ్చమెత్తుకుంటున్నారన్న తెలంగాణ మంత్రి... సీఎం కేసీఆర్ దిల్లీ ఎందుకు వెళ్తున్నారని ఏపీ మంత్రి కౌంటర్
ఎమ్మెల్సీ రేసులో పొంగులేటి, తుమ్మల..
ఖమ్మం ఎమ్మెల్సీ రేసులో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీ కాగా, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు మాజీ మంత్రి. వీరిద్దరితో పాటు తాజా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు ఈసారి టిక్కెట్ కేటాయించే అవకాశాలు లేకపోలేదు. పార్టీలో సైతం దీనిపై ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా తుమ్మల నాగేశ్వరరావుకు పేరుంది. 2014లో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కేటాయించి తుమ్మలను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. 2016లో పాలేరు ఉప ఎన్నికల్లో విజయం సాధించిచిన తుమ్మల గత అసెంబ్లీ ఎన్నికల్లో (2018) ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న తుమ్మలకు మళ్లీ అవకాశం లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి..
2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి ఎంపీగా విజయం సాధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్ లో చేరారు. 2019 ఎన్నికల్లో ఖమ్మం సిట్టింగ్ సీటు టికెట్ ఆయనకు దక్కలేదు. అప్పటినుంచి పార్టీ మారతాడని ప్రచారం జరిగినా టీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చి పార్లమెంట్‌కు మరోసారి వెళతారని ప్రచారం జరిగినా.. నిరాశే ఎదురైంది. ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న పొంగులేటికి స్థానికంగా ఉన్న పలుకుబడి పార్టీకి కలిసొచ్చే అంశం. అదే సమయంలో కేసీఆర్‌కు సన్నిహితుడైన తుమ్మల అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఖమ్మం ఎమ్మెల్సీగా ఎవరికీ ఛాన్స్ ఇస్తారనే అంశం జిల్లాలో రాజకీయ వేడి పెంచుతోంది.
Also Read: ప్రభుత్వంపై ఇక తిరుగుబాటే .. ఉద్యోగ సంఘాల ఆగ్రహం !జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ బాయ్‌కాట్ !