KCR Letter : ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ - రెండు ప్రధాన బిల్లులు ఆమోదించాలని విజ్ఞప్తి !
ప్రధానమంత్రి మోదీకి కేసీఆర్ లేఖ రాశారు. బీసీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదించాలని కోరారు.
KCR Letter : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న సందర్భంలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖలు రాశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును.. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కోరారు. చట్ట సభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. 18 నుంచి జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో రెండు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. బీసీ అభ్యున్నతి, మహిళా సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, వారి హక్కుల రక్షణకు బీఆర్ఎస్ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుందని కేసీఆర్ అన్నారు.
ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, కేంద్రం తెచ్చే బిల్లులు తదితర అంశాలపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్‌రావు సహా ఎంపీలందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
చంద్రబాబు అరెస్టుపై స్పందించాలని ఎవర్నీ అడగం - ఎన్టీఆర్ విషయంలో తేల్చి చెప్పిన అచ్చెన్నాయుడు !
దేశం పేరును ఇండియాగా కాకుండా భారత్‌గా మారుస్తామంటూ జీ-20 సమావేశాల సందర్భంగా చెప్పకనే చెప్పింది. ఇది రేపు పార్లమెంటులో చర్చకొస్తే ఏం చేయాలి..? అన్నది బీఆర్‌ఎస్‌కు సమస్యగా ఉన్నది. దీనిపై ఇప్పటికే అన్ని పార్టీలూ తమ తమ వైఖరులను స్పష్టం చేశాయి. కేంద్ర వైఖరికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో తమ తమ అభిప్రాయాలను వెల్లడించాయి. కానీ బీఆర్‌ఎస్ మాత్రం ఇప్పటికీ తన వైఖరిని స్పష్టం చేయలేదు.
తుమ్మలతో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం - 17న పార్టీలో చేరే అవకాశం !
అసెంబ్లీ ఎన్నికల కోసం మూణ్నెల్ల ముందే తొలి జాబితాను ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలకు కేంద్రం పచ్చజెండా ఊపితే… శాసనసభ ఎన్నికలు మరో రెండు మూడు నెలలు వాయిదా పడటం ఖాయం. ‘షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే ఓకే. అలాగాకుండా జమిలీ ఎన్నికలు వస్తే మాత్రం గెలుపు మాకు తలకు మించిన భారమవుతుంది. మేం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇది మా పార్టీకి ఇబ్బందికర పరిణామమే…’ అని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.అదే సమయంలో భారత్ పేరు వివాదం ఉంది. ఈ రెండింటినీ కేసీఆర్ వ్యతిరేకించే అవకాశం లేదు కానీ.. బిల్లులు పెడతారో లేదో తెలియదు కాబట్టి స్పందించకపోవడం మంచిదని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. బిల్లులు పెడితే అప్పుడు సరైన విధానం ప్రకటించవచ్చని..భావిస్తున్నారు.