అన్వేషించండి

TDP On Jr NTR : చంద్రబాబు అరెస్టుపై స్పందించాలని ఎవర్నీ అడగం - ఎన్టీఆర్ విషయంలో తేల్చి చెప్పిన అచ్చెన్నాయుడు !

చంద్రబాబు అరెస్టుపై స్పందించాలని తామ ఎన్టీఆర్‌ను అడగబోమని టీడీపీ తెలిపింది. ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయననే అడగాలన్నారు.

 

TDP On Jr NTR :  చంద్రబాబునాయుడు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం చర్చనీయాంశమయింది. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇచ్చింది.  ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయననే అడగాలని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. స్పందించాలని తాము ఎవరినీ అడగడం లేదన్నారు. తనను అడిగితే తాను ఏం చెపుతానని అన్నారు.  జనసేనతో  రాబోయే రోజుల్లో జనసేనతో కలిసి కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ ను జనసేన నేతలు, కార్యకర్తలు ఖండిస్తున్నారని చెప్పారు. టీడీపీ చేపట్టిన దీక్షల్లో జనసేన శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయని తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై గుసగుసలు                                    

చంద్రబాబును అరెస్టు చేయడంపై అందరూ స్పందిస్తున్నారు కానీ.. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం చర్చనీయాంశమయింది. ఇది రాజకీయంగా మద్దతు ప్రకటించడం కాదని.. కష్టకాలంలో కుటుంబసభ్యునికి అండగా నిలవడం అని.. చాలా మంది విశ్లేషిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత ఓ అవార్డు ఫంక్షన్ కు ఆయన దుబాయ్ వెళ్లారు. సోషల్ మీడియాలో  జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్  , టీడీపీ ఫ్యాన్స్ మధ్య తరచూ ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఎన్టీఆర్ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నరని అలాంటి ప్రకటనలు కూడా చేయలేదంటున్నారు. 

టీడీపీ అగ్రనాయకత్వంతో వివాదాలు ఉన్నాయని ప్రచారం                                      

జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అయితే ఆ తర్వాత వైసీపీలో పెద్దగా ఎక్కడా కనిపించలేదు. కానీ అంతకు ముందు నుంచే టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కలిసినప్పుడల్లా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటున్న దృశ్యాలు వెలుగులోకి వస్తూంటాయి. అయితే రాజకీయ పరమైన సందర్భాల్లో అందరూ స్పందిస్తున్నా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాత్రం స్పందించడం లేదు. ఇది టీడీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు, లోకేష్‌, బాలకృష్ణల విషయంలో ఎన్టీఆర్ అంత సానుకూలంగా లేరని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మౌనాన్ని వైఎస్ఆర్‌సీపీకి చెందిన కొంత మంది నేతలు.. టీడీపీపై ఎదురుదాడికి ఉపయోగించుకుంటున్నారు. 

ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ                                           

ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో  జూనియర్ ఎన్టీఆర్ ఓ సారి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏం చర్చించారో ఎవరికీ తెలియదు కానీ.. ఆయన మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయలేదు. బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. అన్ని రాజకీయ అంశాలకూ జూనియర్ ఎన్టీఆర్ దూరంగానే ఉంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Donald Trump Inauguration: డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
Joe Biden: కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh Monalisa | కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను కట్టిపడేసింది | ABP DesamKolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP DesamCM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Donald Trump Inauguration: డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
Joe Biden: కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
Bhatti Vikramarka: 'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
Himani Mor: నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Telangana Beer News: తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ  బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
Embed widget