KCR : 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు.. రైతు బంధు పథకం అమలుకు కేసీఆర్ ఆదేశం !
రైతు బంధు, దళిత బంధు పథకాలపై సీఎం కేసీఆర్ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.
రైతులకు ఎకరానికి రూ. ఐదు వేల చొప్పున సాయం చేసే రైతు బంధు పథకాన్ని డిసెంబర్ 28 నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. డిసెంబర్ 28వ తేదీ నుండి రైతు లబ్ది దారుల ఖాతాల్లో జమ చేస్తారు. ప్రారంభించిన వారం పదిరోజుల్లో గతం లో మాదిరి వరుస క్రమంలో అందరి ఖాతాల్లో జమ అవుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పథకాల అమలుపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భం కీలక దిశానిర్దేశం చేశారు. రైతు బంధు పథకం కోసం రైతులు ఎదురు చూస్తున్నందున వారికి వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు.
Also Read: ఉద్యోగుల విభజనపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు... కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన
మరో వైపు దళిత బంధు పథకం అమలుపైనా సీఎం సమీక్షించారు. తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ది చేయడమే 'దళిత బంధు పథకం ' లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. దళిత బంధు పథకం ద్వారా నూరుశాతం సబ్సిడీ కింద అందించే పది లక్షల రూపాయలు, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా.. సామాజిక పెట్టుబడి గా మారి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం గా పటిష్టం చేయడంలో దోహద పడుతుందన్నారు.
Also Read: ఆ ఇద్దరు స్టాండప్ కమెడియన్లకు కేటీఆర్ ఆఫర్ ! బెంగళూరు గాలి తీసేశారుగా !?
దళిత బంధును ఇప్పటికే ప్రకటించిన పద్దతిలో ప్రభుత్వం అమలు చేస్తుందని,. అందుకు సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం, ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళిత బంధు ను ముందుగా ప్రకటించిన విధంగా అమలు చేస్తామన్నారు.తాము ఎప్పుడు మోసగించబడుతామనే దుఃఖం దళిత వాడల్లో వుందని, వారి ఆర్తిని అర్థం చేసుకొని పని చేయాల్సిన అవసరం వుందని, " మీకు ఆకాశమే హద్దు. మీరు ఇప్పటి వరకు చేసిన ఏ పని లో లేని తృప్తి దళిత బంధు పథకం అమలు లో పాల్గొనడంలో దొరుకుతుంద " ని కలెక్టర్లకు సీఎం కెసీఆర్ స్పష్టం చేశారు.
Also Read: యూపీలో ఐటీ దాడుల కలకలం.. అఖిలేష్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు !
దళిత కుటుంబాల ఆర్థిక స్థితి ని మెరుగుపరిచేందుకు వున్న అన్ని అవకాశాలను వ్యాపార ఉపాధి మార్గాలను శోధించాలని, అందుకు దళిత మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, తదితర దళిత సామాజిక అభివృద్ది కాముకుల సలహాలు సూచనలు తీసుకోవాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లకు సూచించారు. సీఎం కేసీఆర్ సమీక్షలో ఒమిక్రాన్ వైరస్ ప్రభావం, వ్యాక్సిన్లు వంటి వాటిపైనా వివరాలు తెలుసుకున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి