BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Telangana News : పార్టీ మారుతున్నానని చెప్పేందుకు వెళ్లిన కేకేపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు పదవులు అనుభవించి వెళ్తున్నారని మండిపడ్డారు.
KCR expressed his anger on KK : ఎంపీ కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షితో సమావేశం అయ్యారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన యూట్యూబ్ మీడియాలకు ఇంటర్యూలు ఇస్తూ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని చెబుతున్నారు. గురువారం ఆయన తాను పార్టీ మారుతున్నట్లుగా కేసీఆర్‌కు చెప్పేందుకు ఫామ్ హౌస్‌కు వెళ్లారు.
పార్టీ మారేందుకు సాకులు చెప్పవద్దని ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్ !
తనకు ఉన్న ఇబ్బందులు చెప్పి పార్టీ మారుతున్నానని కేసీఆర్ కు చెప్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పార్టీ అధినేత అసహనానికి గురైనట్లుగా తెలుస్తోంది. పదేళ్ల పాటు పార్టీలో పెద్ద పీట వేసి పదవులు ఇస్తే.. కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఉన్న ఇబ్బందులను ఆయన చెప్పబోగా.. సాకులు చెప్పవద్దని మండిపడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన సమావేశం మధ్యలోనే వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.
కాంగ్రెస్‌పై ఇప్పటికే ప్రశంసలు కరిపిస్తున్న కేకే
ఇప్పటికే ఆయన కాంగ్రెస్ తనకు తక్కువ చేయలేదని, ఆది నుంచి మర్యాదలు చేసిందని ఎంపి కెకె తెలిపారు. తెలంగాణ కోసం అప్పుడు పార్టీ మారానని వివరణ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నామని, నెరవేరిందని, సొంత పార్టీ వైపు చూస్తే తప్పేంటని వాదిస్తున్నారు. కుమార్తె పదవి కోసం ఆయన పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేశవరావు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవి కాలం2026 వరకూ ఉంది. పార్టీ మారినందున తనపై అనర్హతా వేటు వేయకుండా.. కేసీఆర్ తో సత్సంబంధాలు పెట్టుకునేందుకు ఆయనకు వెళ్లినట్లుగా భావిస్తున్నారు. కానీ పరిస్థితి రివర్స్ అవడంతో సైలెంట్ గా వచ్చేశారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.
సుదీర్గ కాలం కాంగ్రెస్ నేతగా ఉన్న కే్కే
కేసీఆర్ స్వతహాగా కాంగ్రెస్ నేత. ఆయన పలుమార్లు పీసీసీ చీఫ్ గా పని చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్క సారే గెలిచారు. తర్వాత ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఆయనకు పదవులు మాత్రం వస్తూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం తర్వాత ... తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితి మారిపోవడం.. కాంగ్రెస్ బలహీనపడటంతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు మంచి పదవి ఇచ్చి.. కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం పోగానే ఆయన పార్టీ మారిపోతున్నారు.