KCR Rs 5 Lakh To Farmer: బాధలు విని, రైతు కుటుంబానికి కేసీఆర్ రూ. 5 లక్షలు ఆర్ధిక సాయం
Telangana మాజీ సీఎం కేసీఆర్ రైతుల సమస్యల్ని తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పేందుకు పొలం బాట పట్టారు. ఓ రైతు బాధ విని కుమారుడి పెళ్లి ఖర్చుల కోసం రూ.5 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు.
BRS Chief KCR visits fields and met Farmers- జనగామ: రైతు సమస్యలు విని చలించిపోయిన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేశారు. పొలం ఎండిపోయింది, కొడుకు పెళ్లి ఉందని తమ బాధలు చెప్పుకున్న కుటుంబానికి కేసీఆర్ ఆర్ధిక సాయం చేశారు. నీళ్లు అందక ఎండిపోయిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నేడు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటిస్తున్నారు.
ఎండిపోయిన పంటల్ని పరిశీలించిన కేసీఆర్
ఆదివారం (మార్చి 31) జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని ధరావత్ తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన పలువు రైతులను కేసీఆర్ పరామర్శించారు. దుఃఖంలో ఉన్న రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు రాక నాలుగు ఎకరాల పంటను కోల్పోయిన ఆంగోతు సత్తెమ్మ కేసీఆర్ కు తన గోడువెల్ల బోసుకుంది. బోర్లు వేసి నీళ్లు రాక పంటలు ఎండిపోయి దాదాపు నాలుగైదు లక్షల అప్పు అయిందని కేసీఆర్ ముందు విలపించారు. తన కొడుకు పెళ్లి పెట్టుకున్నానని పంట ఎండిపోవడంతో చేతిలో చెల్లి గవ్వలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకున్నారు. అన్నదాతల సమస్యలపై తక్షణమే స్పందించిన కేసీఆర్ సత్యమ్మ కుమారుని వివాహ ఖర్చు నిమిత్తం ఐదు లక్షల రూపాయలను అక్కడికక్కడే ప్రకటించారు.
రైతులు ధైర్యంగా ఉండాలని పోరాడి మన నీళ్లను మనం సాధించుకుందామని.. 24 గంటల కరెంటును సాధించుకుందామని.. రైతు రుణమాఫీని, రైతు బంధు పోరాడి సాధించుకుందామని రైతులకు కేసీఆర్ భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే.. కనీసం చీమ కుట్టినట్టయినా లేదు ఈ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వానికి
— BRS Party (@BRSparty) March 31, 2024
ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ.. రాజకీయాలలో బిజీగా ఉన్న దుర్మార్గపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి!
రైతన్న నేనున్నా అంటూ రైతుల కన్నీళ్లను తుడిచేందుకు..… pic.twitter.com/GEtsyukRji
చీమ కుట్టినట్లుగా కూడా లేని కాంగ్రెస్ ప్రభుత్వం
రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయిట్లు కూడా లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయాలలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలతో బిజీగా ఉన్నారంటూ మండపిడుతున్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా రైతుల కన్నీళ్లను తుడిచేందుకు.. పంటపొలాల్లో గుండె చెదురుతున్న రైతుల్లో ధైర్యాన్ని నింపేదుకు కేసీఆర్ పర్యటిస్తున్నారని చెప్పారు.
మీరునప్పుడే బాగుండేనని, ఇప్పుడు చుక్క నీరు రావటం లేదు, బోర్లు వేసినా నీళ్ళు పడటం లేదు అని రైతులకు కేసీఆర్ కు తమ గోడు వెల్లబోసుకున్నారు. మోటార్లు కాలి పోతున్నాయని రైతుల ఆవేదన వ్యక్తం చేయగా.. పోరాటం చేద్దాం ధైర్యంగా ఉండాలని అన్నదాతలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు.
Also Read: Kadiyam Srihari Joins Congress: కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య